BigTV English

Drugs Case: చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు

Drugs Case: చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు

Drugs Case: చర్లపల్లిలో బయటపడ్డ డ్రగ్స్ దందాలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ సాధారణ ఫ్యాక్టరీలో వందల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇక్కడి నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న ముఠాను మహారాష్ట్ర పోలీసులు కూలీల వేషంలో వచ్చి పట్టుకున్నారు. డ్రగ్స్‌ తయారీ, వాటి అమ్మకాలు రెండూ హైదరాబాద్‌లోనే జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించారు.


వాగ్దేవి ల్యాబ్స్‌లో కార్మికుడిగా చేరిన క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్..
వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్స్ ఫ్యాక్టరీలో నెలరోజుల ముందే లేబర్‌గా చేరాడు మహారాష్ట్ర కానిస్టేబుల్. కంపెనీలో దిగుమతులు, కెమికల్స్, డ్రగ్స్ తయారీ సెంటర్, రవాణాపై నిఘా పెట్టారు. నెల రోజుల తర్వాత పక్కాగా డ్రగ్స్ తయారవుతుందని తెలుసుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆకస్మిక దాడులు చేసి గుట్టు రట్టు చేశారు పోలీసులు. భారీ మొత్తంలో డ్రగ్స్ చేస్తూ మహారాష్ట్ర పోలీసులకు చిక్కాడు నిర్వాహకుడు శ్రీనివాస్ విజయ్ వోలేటి. శ్రీనివాస్ వోలేటి ఎవరికీ అనుమానం రాకుండా ఏమార్చాడు. రోజువారీ కూలీలను మారుస్తూ డ్రగ్స్ తయారు చేసేవాడు.

భారీ మొత్తంలో డ్రగ్స్ తయారు చేస్తూ దొరికిన శ్రీనివాస్ విజయ్ వోలేటి
మహారాష్ట్ర క్రైం బ్రాంచ్‌‌ పోలీసులకు చిక్కిన శ్రీనివాస్‌‌ విజయ్‌‌ ఓలేటి బృందం.. 10 ఏళ్లుగా మెఫిడ్రోన్ డ్రగ్స్ తయారు చేసి అమ్ముతున్నట్లు ఆధారాలు సేకరించారు. ప్రతిసారి కనీసం 5 కిలోల చొప్పున మెఫెడ్రోన్ డ్రగ్‌‌ను విక్రయించేవారని, ఒక్కో కిలో 50 లక్షల చొప్పున ఏజెంట్లకు అమ్మేవాడని గుర్తించారు. మహారాష్ట్ర,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ డ్రగ్స్ రాకెట్‌ను నడిపాడు. ఈనెల 5న బంగ్లాదేశ్ యువతి నుంచి సేకరించిన ఆధారాలతో ఏకంగా 12వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ తయారీ పదార్థాలను సీజ్ చేశారు.


పోలీసుల అదుపులో నిర్వాహకుడు శ్రీనివాస్, కెమిస్ట్ తానాజీ
వాగ్దేవి ల్యాబ్స్‌ నిర్వాహకుడితో పాటు కెమిస్ట్‌ తానాజీ లను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ ఓలేటి, తానాజీ ఇద్దరు కలిసి ఒప్పందం మేరకు డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. తానాజీ ఓ కెమికల్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్‌గా పనిచేస్తున్నాడు. సోదాల్లో భాగంగా 5 కిలోల 968 గ్రాముల ఎండీ, 35500 లీటర్ల కెమికల్స్‌, 19 బాక్స్‌లలో 950 కిలోల మిథైలిన్ డైక్లోరైడ్‌తో కలిపి మొత్తం 200 డ్రమ్ముల్లో గుర్తించారు. అలాడే ల్యాబ్‌లో నిల్వ చేసిన డ్రగ్‌ పౌడర్‌ను కలిపి రెండు లారీల్లో ముంబైకి తరలించారు.

Also Read: ఏపీలో ఫేక్ న్యూస్‌పై ఫైట్ షురూ.. సీఎం సంచలన నిర్ణయం..

గతంలో పట్టుబడిన 11 మంది నిందితుల వివరాల సేకరణ..
ఇద్దరు కీలక నిందితులతో పాటు గతంలో పట్టుబడిన 11 మంది నిందితుల నుంచి వివరాలను సేకరించారు. నిర్వాహకుడు శ్రీనివాస్‌ విజయ్ పాత నేరస్తుడని గుర్తించారు. గతేడాది ముంబైలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. బెయిల్‌పై హైదరాబాద్ వచ్చి డ్రగ్స్ కంపెనీ పెట్టి దందా నడిపాడు. విచారణలో ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో పాటు ఇతర దేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. వాగ్దేవి ల్యాబ్స్‌తోపాటు, వాగ్దేవి ఇన్నోసైన్స్, అటెంటివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను సైతం అదుపులోకి తీసుకున్నారు.

Related News

Century Old Tractor: అద్భుతమైన ఇంజనీరింగ్.. వందేళ్ల నాటి ట్రాక్టర్, ఎక్కడంటే..

Mumbai fire accident: ముంబైలో హై రైజ్‌లో మంటలు.. 23 అంతస్తుల భవనంలో ప్రమాదం.. ఒకరి మృతి!

Gujarat Tragedy: మహాకాళి ఆలయ మార్గంలో ప్రమాదం.. సాంకేతిక లోపమా?

Karnataka Library: ఆస్తులు అమ్మి పుస్తకాలు కొన్నాడు.. అసలు ట్విస్ట్ ఇదే!

Red Fort theft: ఎర్రకోటలో సంచలనం.. బంగారు, వజ్ర కలశాలు గల్లంతు.. విలువ కోట్లల్లోనే!

Big Stories

×