BigTV English

OTT Movie : నగర శివార్లలో లవర్స్… బాడీ పార్ట్స్ ను ముక్కలు ముక్కలుగా నరికి చంపే సైకో… స్పైన్ చిల్లింగ్ రియల్ స్టోరీ

OTT Movie : నగర శివార్లలో లవర్స్… బాడీ పార్ట్స్ ను ముక్కలు ముక్కలుగా నరికి చంపే సైకో… స్పైన్ చిల్లింగ్ రియల్ స్టోరీ
Advertisement

OTT Movie : రియల్ క్రైమ్ స్టోరీలతో ఇప్పుడు సినిమాలు , సిరీస్ లు చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తున్నాయి. ఆడియన్స్ కూడా వీటిని ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. రీసెంట్ గా ఒక సీరియల్ కిల్లర్ కేస్ ఆధారంగా, ఒక సిరీస్ వచ్చింది. ఇది 1968-1985 మధ్య సంచలనం సృష్టించిన ఒక అన్‌ సాల్వ్డ్ కేసుతో మొదలవుతుంది. 16 హత్యలు (8 డబుల్ మర్డర్స్) లు జరిగిన ఈ రియల్ కేసు ఉత్కంఠంగా నడుస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘ది మాంస్టర్ ఆఫ్ ఫ్లారెన్స్’ (The Monster of Florence) 2025లో వచ్చిన ఇటాలియన్ ట్రూ క్రైమ్ సిరీస్. స్టెఫానో సోల్లిమా దర్శకత్వంలో ఫ్రాన్సెస్కా ఓలియా, మార్కో బుల్లిట్టా, లిలియానా బొట్టోన్, గియాకోమో ఫాడ్డా నటించారు. 4 ఎపిసోడ్‌ లు ఉన్న ఈ సిరీస్ 2025 అక్టోబర్ 22న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయింది. ఐయండిబి లో దీనికి 6.5/10 రేటింగ్ ఉంది.

కథలోకి వెళ్తే

బార్బరా అనే మహిళ, తన ప్రేమికుడు అంటోనియోతో ఒక వెకేషన్ లో ఉంటుంది. భర్తకు తెలీకుండా అతనితో గడుపుతుంటుంది. ఈ సమయంలో ప్రేమికుడితో ఒక కార్‌లో రొమాన్స్ చేస్తుంటుంది. ఇంతలో ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి వాళ్లను గన్ తో కాల్చి చంపుతాడు. ఈ సీన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. కిల్లర్ 22 కాలిబర్ బెరెట్టా గన్‌తో వాళ్లను చంపినట్లు తెలుస్తుంది. ఇది అక్కడ జరిగిన మొదటి డబుల్ మర్డర్ కేసుగా నమోదవుతుంది. దీంతో పోలీసులు అనుమానంతో బార్బరా భర్త స్టెఫానో ను అరెస్ట్ చేస్తారు. కానీ అతని దగ్గర గన్ కనిపించదు. కానీ స్టెఫానో ముద్దాయిగా తేల్చి జైలులో ఉంచుతారు.


Read Also : లైవ్‌లో అమ్మాయిని కట్టేసి ఆ పాడు పనులు చేసే సైకో… గూస్ బంప్స్ మూమెంట్స్… క్లైమాక్స్ కేక

అయితే స్టెఫానో జైలులో ఉన్నా కూడా ఆ గన్ తో మర్డర్స్‌ జరుగుతుంటాయి. స్టెఫానో ఆ గన్ ను ఇతరులకు ఇచ్చాడని పోలీసులు అనుమానిస్తారు. కిల్లర్ 17 సంవత్సరాల్లో 8 డబుల్ మర్డర్స్ చేస్తాడు. యంగ్ కపుల్స్‌ నే ఆ కిల్లర్ టార్గెట్ చేస్తాడు. స్టెఫానో కేసు ట్విస్ట్‌లు మీద ట్విస్టులు ఇస్తుంది. ఇక ఈ కేసును డిస్ట్రిక్ట్ అటార్నీ సిల్వియా విచారిస్తుంది. సిల్వియా ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఒక కిల్లర్ ని పట్టుకుని అరెస్ట్ చేస్తుంది. కానీ అసలు హంతకుడు ఇంకా బయటే ఉన్నాడని అనుమానిస్తుంది. చివరికి కిల్లర్ దొరుకుతాడా ? ఈ హత్యలు చేస్తున్నది ఎవరు ? కపుల్స్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ? అనే విషయాలను, ఈ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : బాబోయ్ ఇదేం సినిమా… పోలీస్ ఆఫీసర్ మర్డర్… కిల్లర్‌కే చెమటలు పట్టించే అమ్మాయి… కిర్రాక్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : మాస్క్ మ్యాన్ మారణహోమం… ఒళ్లుగగుర్పొడిచేలా మర్డర్స్… ఒంటరిగా చూశారో ఫసక్

OTT Movie : అర్దరాత్రి అమ్మాయిల్ని చంపే సైకో… ఒంటరి ఆడపిల్లలే టార్గెట్… మెంటల్ మాస్ ట్విస్టులు

OTT Movie : హెర్బల్ మెడిసిన్‌తో పుట్టే అంతులేని వింత వ్యాధి… వెన్నులో వణుకు పుట్టించే సరికొత్త జొంబీ హర్రర్ మూవీ

Friday OTT Movies: ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ 3 సినిమాలను మిస్ అవ్వకండి..

OTT Movie : ప్రియుడి కోసం భర్తకు తెలియకుండా పాడు పని… దిమాక్ ఖరాబ్ సీన్లు ఎన్నో

OTT Movie : అమ్మాయి మాయలో కొడుకు… ఆ బంధమే తండ్రికి అడ్డుగోడ… ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి భయ్యా ?

Big Stories

×