Illu Illalu Pillalu Today Episode September 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమకి ఒక కొరియర్ వస్తుంది. అది తీసుకున్న శ్రీవల్లి ప్రేమకి బొకే ఇచ్చారు ఏంటి? అందులో వన్ వీక్ అని రాసి ఉందని అనుకుంటుంది. ఈ విషయాన్ని వెళ్లి ప్రేమని అడుగుతుంది ప్రేమ చెప్పిన సమాధానం పై శ్రీవల్లికి అనుమానం వస్తుంది. ప్రేమ ఏదో పెద్ద మ్యాటర్ ని దాసిపెడుతుంది. అదేంటో కనిపెట్టి ప్రేమకు చుక్కలు చూపించాలి అని శ్రీవల్లి అనుకుంటుంది. శ్రీవల్లికి అనుమానం మొదలవుతుంది. ప్రేమ మాత్రం శ్రీవల్లిని బయటకి పంపేసి తలుపు వేస్తుంది.. మొన్న సీక్రెట్ గా ఏదో లెటర్ వచ్చిందని దాల్చింది. ఈ బొకే పంపించడానికి ఏదో ఉంది అని ఆలోచిస్తుంది. ప్రేమ బొకేను చూసి షాక్ అవుతుంది.
అప్పుడే కళ్యాణ్ ఫోన్ చేసి బొకే అందిందా నీకు నచ్చిందా అని అడుగుతాడు. మరి నువ్వు ఇలాంటి పంపించి నన్ను ఇది చేయాలని చూస్తున్నావా అని ప్రేమ అడుగుతుంది. అయితే నువ్వు బొకే పంపిస్తే అస్సలు నమ్మట్లేదు కదా నీకు అదిరిపోయే దిమ్మ తిరిగే వీడియో ఒకటి పంపిస్తాను చూసి ఎంజాయ్ చెయ్ బేబీ అని అంటాడు.. వాళ్ళిద్దరూ ఫోటో గదిలో ఉన్న వీడియోని ప్రేమకు పంపిస్తాడు అది చూసి షాక్ అవుతుంది. అప్పుడే ధీరజ్ఇంట్లో వస్తాడు ప్రేమను అలా చూసి ఏమైందని అడుగుతాడు. కానీ ప్రేమ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. నువ్విలా ఉండడం నాకు నచ్చట్లేదు ప్రేమ నువ్వు నీలాగే ఉంది అని బయటికి తీసుకెళ్తాడు. నాకు కూడా చెప్పుకోలేని సమస్యతో నువ్వు బాధపడుతున్నావు అని అర్థమవుతుంది. అదేంటో నాకు కొంచెం కొంచెం అన్న చెప్పు నీ సమస్యని నేను తీరుస్తాను అని హామీ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సాగర్ ని మంచిగా రెడీ చేసి దేవుడి దగ్గరికి తీసుకొస్తుంది నర్మదా. ఎప్పుడు లేంది వీళ్లు పూజ చెయ్యడానికి పూజ గదిలోకి వెళ్లి పూజ చేసి మరి సాగర్ ని ఎక్కడ తీసుకెళ్తుంది అబ్బా అని శ్రీవల్లి ఆలోచిస్తుంది. అంతే కాదు అనుమానం కూడా మొదలవుతుంది.. అయితే మొత్తానికి శ్రీవల్లి నర్మదా సాగర్ లో గుట్టు రట్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సాగర్ ఆశీర్వాదం ఉండాలి అని అంటాడు.. ఇప్పుడు ఎవరికీ తెలియకుండా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు.. ఈ విషయం తెలిస్తే ఇంట్లో నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళనిస్తారా అని అడుగుతుంది.
సాగర్ నర్మదని తీసుకొని వాళ్ల నాన్న ఆశీర్వాదం కావాలని అక్కడికి వస్తాడు. నాన్న నాకు మీ ఆశీర్వాదం కావాలి అని అడుగుతాడు. ఇంత సడన్గా ఆశీర్వాదం ఏంట్రా అని రామరాజు అడుగుతాడు. కానీ తిరుపతి మాత్రం ఆశీర్వాదమని గతంలో వెళ్లి పెళ్లి చేసుకుని వచ్చావు ఈసారి ఏం వెలగబెడతామని అనుకుంటున్నావు అని అడుగుతాడు. తింగరోడైన వీడు చెప్పింది కరెక్టే కదరా పోయినసారి అలా జరిగింది వీడు చెప్తుంటే నాకు కూడా అనుమానం వస్తుంది అని రామరాజు అంటాడు. అయితే అదేం లేదు నాన్న అని ఎగ్జామ్ అనే మాట సాగర్ నోటి నుంచి వస్తుంది.
నర్మదా ఎగ్జామ్ కాదు మ్యారేజ్ అని కవర్ చేస్తుంది. అయితే మ్యారేజ్ కి వెళ్తే ఇలాంటి బట్టలు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏదో జరుగుతుంది అని తిరుపతి అనుమాన పడతాడు. నర్మదా టెన్షన్ పడుతూ ఉంటుంది. నా కొడుకుకి ఏం రా నా కొడుకు ఈ బట్టల్లో దొరబాబు లాగా ఉన్నాడు అని రామరాజు అంటాడు. వేదవతి కూడా నా కొడుకు మహారాజు లాగా ఉన్నాడు ఈ బట్టల్లోని మురిసిపోతుంది. ఎప్పుడు లేంది ఒక కాగితం ఏదో దేవుడి దగ్గర పెట్టి మీరు పూజ చేశారు కదా అదేంటి మరిది గారు అని శ్రీవల్లి సాగర్ ని అడ్డంగా ఇరికిస్తుంది.
అవునండి మావయ్య గారు ఎప్పుడు లేనిది వీళ్లిద్దరు గదిలోకి వెళ్లి దేవుడి దగ్గర పూజ చేసి మరి ఒక కాగితాన్ని అక్కడ పెట్టారు. అది సాగర్ మరిది జేబులోనే ఉంది మీరు కావాలంటే అడగండి మావయ్య గారు అని శ్రీవల్లి అంటుంది.. సాగర్ ని ఆ కాగితం ఇవ్వమని రామ రాజు అడుగుతాడు. ఆ కాయితాన్ని చూసి అందరూ షాక్ అవుతారు తిరుపతి ఏంటి బావ అలా ఉన్నావ్ ఇటీవ్వు నేను చదువుతాను అందులో ఉన్న మ్యాటర్ ని చదివి షాక్ అవుతాడు.
ఇదేంట్రా ఇలా రాసుకున్నావ్ ఏంటి రా అని రామరాజు అడుగుతాడు. మన మిల్లు కి మొండి బాకీలు ఉన్నాయి కదా నాన్న అవి రావాలని దేవుడి దగ్గర పూజ పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాను అని అంటాడు.. ఇకనుంచి సాగర్ నర్మదా వెళ్ళిపోతారు. ప్రేమ కళ్యాణ్ కోసం అంతా వెతుకుతూ ఉంటుంది. ఏంటి నువ్వు ఇప్పుడు కళ్యాణ్ కోసం వెతుకుతున్నావు ఏంటి అని ప్రేమ ఫ్రెండ్స్ అడుగుతారు. ఏం లేదే ఊరికే అడుగుదామని అని ప్రేమ ఏదో ఒకటి కవర్ చేస్తుంది. మొత్తానికి కళ్యాణ్ను పట్టుకుంటుంది ప్రేమ.
ఆ కళ్యాణ్రోడ్ల పై పరిగెత్తించి మరీ కొడుతుంది. వీధులన్నీ తిప్పి మరి చితగ్గొట్టేస్తుంది. ఇక ప్రేమ నుంచి కళ్యాణ్ పారిపోతూ ఉంటాడు. నర్మదా సాగర్ కి ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ కి లోపలికి పంపిస్తుంది. భద్రావతి ఇంట్లో సేన కొడుకుకి పెళ్లి సంబంధం కోసం మనుషులు వస్తారు. మాకు బాగా నచ్చింది కట్నకానుకలు ఏమాత్రం ఇస్తారు అని అడుగుతారు.. కొంచమైనా సిగ్గుండాలి మీ అమ్మాయి లేచిపోయింది మీ అక్క లేచిపోయింది ఇప్పుడు ఇలా మీరు కట్నం అడుగుతున్నారు ఏంటి పిల్లనివ్వడమే ఎక్కువ అని అంటాడు పెళ్లి వాళ్ళు. ఆ మాట విన్న సేన వాళ్ళని కొట్టి పంపిస్తాడు.
Also Read : పల్లవి ప్లాన్ సక్సెస్.. శ్రీయాకు మైండ్ బ్లాక్.. అవనికి స్ట్రాంగ్ కౌంటర్..
వాళ్లది ఏమీ తప్పులేదు మీదే తప్పు అత్త లేచినప్పుడు మీరు ఆ పని వాడిని ఏమి చేయలేదు. అలాగే నా చెల్లెలు ఆ పనోడి కొడుకుతో వెళ్లిపోతే అది కూడా ఏమీ చేయలేరు అందుకే ఇంకా ఎన్ని సంబంధాలు చూసిన ఇలానే మాట్లాడుతారు మనం వేరే ఏ ఊరికైనా వెళ్లి బ్రతుకుదాం అని విశ్వం అంటాడు. ఇది మన ఊరు రా మనం ఎక్కడికి వెళ్దాం ఆ రామరాజుని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టి ముప్పు తిప్పలు పెడతానని భద్ర అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..