BigTV English

OTT Movies: ఇల్లు కడితే చస్తారు.. భావన నటించిన ఈ హర్రర్ మూవీ.. కలలోనూ వెంటాడుతుంది

OTT Movies: ఇల్లు కడితే చస్తారు.. భావన నటించిన ఈ హర్రర్ మూవీ.. కలలోనూ వెంటాడుతుంది

OTT Movies: పాన్ ఇండియా పుణ్యమా అని ఏ భాష చిత్రమైన అన్ని భాషల్లోనూ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీంతో మూవీ లవర్స్ కి డబుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుంది. థియేటర్, ఓటీటీ.. ప్లాట్ ఫాం ఏదైనా అన్ని భాష సినిమాలు చూసేయొచ్చు. దీంతో మూవీ లవర్స్ అలరించేందుకు ఓటీటీలో సైతం విభిన్న కథలను తీసుకువస్తున్నాయి. ముఖ్యం హారర్, థ్రిల్లర్ వెబ్ సరీస్ లతో మూవీ లవర్స్ ని కట్టిపడేస్తున్నాయి. ప్రతి వారం విడుదలయ్యే చిత్రాల్లో హారర్, థ్రిల్లర్ చిత్రాలకే ఎక్కువ ఓటు వేస్తున్నారు. దీంతో ఓటీటీలకు ధీటుగా థియేటర్ లో విభిన్న కథ చిత్రాలు విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత అవి ఓటీటీలో సందడి చేస్తున్నాయి.


హారర్, థ్రిల్లర్ గా ది డోర్

అలా ఇటీవల థియేటర్లలో విడుదలైన ప్రస్తుతం ఓటీటీలో సందడి ఓ హారర్ థ్రిల్లర్ వచ్చింది. అదే ది డోర్ (The Door). తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి 28న థియేటర్లో విడుదలైంది.నటి భావన ప్రధాన పాత్రలో పోషించింది. ఇందులో ఆర్కిటెక్చర్ గా నటించిన ఆమెకు తరచూ ఆత్మలు దర్శనం ఇస్తుంటాయి. ఈ క్రమంలో ఆమె ఆత్మలతో మాట్లాడటం చేస్తుంది. ఇలా ప్రతి క్షణం భయానక సంఘటనలు, సస్పెన్స్ తో ది డోర్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. మీకూ ఇలాంటి అనుభవం కావాలంటే ఈ వెబ్ సిరీస్ అసలు మిస్ కాకండి. అయితే ఈ మూవీ కథేంటి, భావనకు ఆత్మలు కనిపించడం వెనక రహస్యం ఏంటో రివ్యూలో చూద్దాం.


మిత్రను వెంటాడిన ఆత్మలు

ఈ సినిమా భావన మిత్ర పాత్రలో కనిపించింది. ఆమె నైపుణ్యం కలిగిన ఆర్కిటెక్ట్. ఒక రోజు ఆమె తండ్రి అనుమానస్పదంగా ఓ రోడ్డు ప్రమాదంలో మరణిస్తాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత మిత్రకు ఓ కొత్త నిర్మాణ ప్రాజెక్ట్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఒక నిర్జనమైన చీకటి ప్రదేశంలో ఉంటుంది. అదంత ఒక విశాలమైన ప్రదేశం. చూట్టూ పక్కల కొంత దూరంగా ఇల్లు కానీ, మనుషులు ఉండరు. అయితే ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్న సమయంలో మిత్రకు వింత సంఘటనలు ఎదురవుతుంటాయి. కార్మికులు ఒక్కొక్కరుగా అసాధారణ పరిస్థితుల్లో మరణిస్తారు. స్థలం చుట్టూ ఒక భయానక వాతావరణం నెలకొంటుంది. తరచూ ఆమెకు ఏవో వింత శబ్ధాలు వినిపించడం, అసాధారణ శక్తులు ఆమె చూట్టూ కదలాడుతున్నట్లు అనిపిస్తుంది. ఆమె చూట్టూ ఏదో జరుగుతున్నట్టు, ఎవరో తనని ఫాలో అవుతన్నట్టు అనూహ్య పరిస్థితులు చూస్తుంది.

ఒక రోజు ఆత్మలు తనకు దర్శనం ఇస్తాయి. అవి ఓ తల్లి, కూతురి ఆత్మలని తెలుసుకుంటుంది. ఈ స్థలంలో జరిగిన ఒక భూమి కబ్జా కేసులో హత్యకు గురవుతాయి. ఈ ఆత్మలు మిత్రకు తమ కథను వివరించి.. తమకు న్యాయం చేయమని కోరుతాయి. వాటికి సాయం చేసే క్రమంలో మిత్రకు షాకింగ్ విషయాలు వెల్లడవుతాయి. ఈ క్రమంలో తన తండ్రిది సహాజ మరణం కాదని, హత్య అని తెలుసుకుంది. ఈ ఆత్మలకు, తన తండ్రికి మధ్య సంబంధం ఉందని తెలుసుకుంటుంది. మిత్ర ఈ రహస్యాలను ఛేదించే ప్రయత్నంలో తన సొంత జీవితాన్ని, చుట్టూ ఉన్నవారిని రక్షించుకోవడానికి ఒక భయానక పోరాటంలో నిమగ్నమవుతుంది.ఇంతకి ఆత్మలు ఎవరూ? వాటికి.. మిత్ర తండ్రికి మధ్య సంబంధం ఏంటి? ఆమెకే ఎందుకు ఆ ఆత్మలు కనిపించాయి? తెలియాలంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కాగా ప్రస్తుతం ఈ సినిమా సిప్లి సౌత్ యాప్ లో స్ట్రీమింగ్ అవుతుంది. భారత్ లో మినహా అన్ని దేశాల్లో ఇది అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ చిత్రం ఇండియన్ ఓటీటీ ప్లాట్ ఫాంలోకి అందుబాటులోకి రానుంది.

ఉత్కంఠ పెంచే భయానక సంఘటనలు
ఈ చిత్రం తమిళంలో విడుదలైనప్పటికీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉండవచ్చు, ఎందుకంటే భావనా మీనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన నటి. ఈ సినిమా హారర్, థ్రిల్లర్ శైలిని ఇష్టపడే వారికి ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని అందిస్తుంది. పారానార్మల్ హారర్ ఈ సినిమాకు ప్రధాన బలం. చిత్రంలో భయానక చిత్రం భయానక దృశ్యాలు, ఆత్మల దర్శనాలు.. ప్రధాన పాత్రల చూట్టూ అవి తిరుగుతూ గుసగుసలాడటంతో.. దానివల్ల మిత్రకు ఎదురైన అనుభవం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. మిత్ర తన తండ్రి గతంలోని చీకటి రహస్యాలను కనుగొనడం కథలో ట్విస్ట్ థ్రిల్ చేస్తుంది. భూమి కబ్జా కేసులు, అవినీతి, హత్యలు వంటి అంశాలు కథలో సామాజిక సందేశాన్ని అందిస్తాయి. భవనా మీనన్ పోషించిన మిత్ర ఒక ధైర్యమైన, తెలివైన స్త్రీ పాత్ర, ఆమె భయాన్ని ఎదుర్కొంటూ సత్యాన్ని వెలికితీస్తుంది.

Related News

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

Big Stories

×