OTT Movie : సీరియల్ కిల్లర్ లు సృష్టించే వాతావరణం చాలా భయంకరంగా ఉంటుంది. ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుని హత్యలు చేస్తుంటారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఎన్నో సినిమాలు కూడా తెరకెక్కాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది యూ యంగ్-చుల్ అనే సీరియల్ కిల్లర్ 2000 లో 20 మంది వేశ్యలను అత్యంత కిరాతకంగా హత్యలు చేసాడు. ఈ కిల్లర్ స్టోరీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇది సియోల్‌లోని మాంగ్వోన్-డాంగ్ ప్రాంతంలో తెరకెక్కింది. ఈ సినిమా ఒక గ్రిప్పింగ్ స్టోరీతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
రెండు ఓటీటీలలో
ఈ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది చేసర్’ (The chaser). ఈ సినిమాకి హాంగ్-జిన్ తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రియల్ కొరియన్ సీరియల్ కిల్లర్ లైఫ్ లో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందింది. ఇందులో కిమ్ యూన్-సియోక్ (జంగ్-హో గా), హా జంగ్-వూ (యంగ్-మిన్ గా), సియో యంగ్-హీ (మి-జిన్ గా) ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 3 నిమిషాల రన్ టైం ఉన్న ఈ సినిమాకి IMDb లో 7.8/10 రేటింగ్ ఉంది. ఈ కొరియన్ సినిమా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలోఅందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
జంగ్-హో ఒక అవినీతి మాజీ పోలీసు డిటెక్టివ్. ఇప్పుడు సియోల్‌లో ఒక చిన్న వేశ్యాగృహాన్ని నడుపుతుంటాడు. అయితే అతని దగ్గర ఉండే ఇద్దరు అమ్మాయిలు కనిపించకుండాపోతారు. వాళ్ళు తన వద్ద డబ్బులు తీసుకుని, అవి తీర్చకుండా పారిపోయారని అతను మొదట అనుకుంటాడు. ఈ క్రమంలో ఒక రోజు రాత్రి, అతను అనారోగ్యంతో ఉన్న మి-జిన్ అనే అమ్మాయిని ఒక క్లయింట్‌ను కలవమని బలవంతంగా పంపిస్తాడు. ఆ తర్వాత ఈ క్లయింట్ తన మిస్సింగ్ అయిన అమ్మాయిలతో చివరిగా కనిపించిన వ్యక్తి అని జంగ్-హో గుర్తిస్తాడు. ఇక యంగ్-మిన్ అనే క్లయింట్ తన దగ్గర ఉన్న అమ్మాయిలను ట్రాఫిక్ చేస్తున్నాడని అనుమానిస్తాడు జంగ్-హో. మి-జిన్ ద్వారా అతని చిరునామాను కనిపెట్టడానికి ఆమెను పంపిస్తాడు. అయితే యంగ్-మిన్ ఒక సైకోపాథిక్ సీరియల్ కిల్లర్. అతను వేశ్యలను లక్ష్యంగా చేసుకుని, దారుణంగా హత్యలు చేస్తుంటాడు.
మి-జిన్ ను కూడా అందుకోసమే ఒక రాత్రికి బుక్ చేసుకుంటాడు. ఇప్పుడు ఆమె అతని ఇంటిలో చిక్కుకుంటుంది. జంగ్-హో, తన మాజీ పోలీసు నైపుణ్యాలను ఉపయోగించి, యంగ్-మిన్‌ను ట్రాక్ చేస్తాడు. అతన్ని అరెస్టు చేయడంలో విజయం సాధిస్తాడు. అయితే సియోల్ మేయర్‌పై జరిగిన ఒక దాడి కారణంగా పోలీసు విభాగం మీడియా ఒత్తిడిలో ఉంటుంది. దీనివల్ల యంగ్-మిన్‌పై ఆధారాలు లేకపోవడంతో అతన్ని విడుదల చేయవలసి వస్తుంది. ఈ సమయంలో జంగ్-హో ఒక 12 గంటల గడువులో మి-జిన్‌ను కాపాడటానికి సమయానికి వ్యతిరేకంగా పరుగెత్తాల్సి ఉంటుంది. ఈ స్టోరీ సియోల్‌లోని ఇరుకైన వీధులలో జరిగే ఉత్కంఠభరితమైన ఛేజ్ సన్నివేశాలతో, యంగ్-మిన్ దారుణమైన హత్యలతో ముందుకు సాగుతుంది. ఇంతకీ జంగ్-హో, మి-జిన్ ను కాపాడుతాడా ? ఆ కిల్లర్ కి శిక్ష పడుతుందా ? కిల్లర్ వేశ్యలను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : వామ్మో ఇదెక్కడి అరాచకంరా అయ్యా… మనిషి మెదడును ఉడికించి తినే సైకో… 14 మంది బలి