Watch Video: క్రికెట్ లో అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. పొద్దున నుంచి రాత్రి వరకు.. ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక మూలన క్రికెట్ గురించి సంబంధించిన ఏదో ఒక వింత సంఘటన తెరపైకి వస్తోంది. క్రికెటర్లు కొట్టుకోవడం, లేదా గ్రౌండ్ లోనే స్లెడ్జింగ్ చేసుకోవడం.. ఒకరినొకరు బండ బూతులు తిట్టుకోవడం… ఇలాంటివి చాలా సహజమైపోయాయి. అలాగే ఎవరు ఊహించని.. క్యాచులను ఫిల్డర్స్ పట్టడం కూడా జరుగుతూ ఉంటాయి. అయితే తాజాగా… ఆటగాడు కొట్టిన అదిరిపోయే షాట్… అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ షార్ట్ చుసిన వాళ్ళు ఏ బి డివిలియర్స్ ( AB de Villiers ).. అమ్మ మొగుడు వచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఏబీ డివిలియర్స్ ను మించిపోయిన మరో ప్లేయర్ ( Luke Hollman )
ఇంగ్లాండ్ వేదికగా ప్రస్తుతం వైటాలిటీ బ్లాస్ట్ లీగ్ ( Vitality Blast T20 2025 ) జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో.. తాజాగా మిడిల్ సె*క్స్ వర్సెస్ సర్రే మధ్య అ కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన.. సర్రే విజయం సాధించింది. ఏకంగా 8 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది సర్రే. అటు మిడిల్ సె*క్స్ జట్టు మాత్రం దారుణంగా ఓడిపోయింది. మ్యాచ్ అప్డేట్ గురించి పక్కకు పెడితే ఈ మ్యాచ్లో అదిరిపోయే షాట్ కొట్టాడు ఓ ప్లేయర్. మిడిల్ సె**క్స్ జట్టుకు సంబంధించిన లుక్ హాల్మన్ దిమ్మతిరిగే బ్యాటింగ్ చేశాడు. బౌలర్ వేసిన బంతిని చూసి… తన వెనుక సైడు ఆడబోయి…. రివర్స్ స్వీప్ ఆడి మరి బౌండరీ సాధించాడు.
అచ్చం ఎ బి డివిలియర్స్ ( AB de Villiers ) తరహాలోనే… స్కూప్ షాట్ ఆడాడు. ఈ మ్యాచ్ 19 ఓవర్ ఐదవ బంతి సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో సామ్ కరణ్ బౌలింగ్ వేశాడు. ఈ నేపథ్యంలో చాక చక్యంగా బ్యాటింగ్ చేసిన హాల్మన్ ( Luke Hollman ) … రివర్స్ షాట్ ఆడి ఫలితాన్ని సంపాదించాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎబి డివిలియర్స్ కంటే ప్రమాదకరంగా బ్యాటింగ్ చేస్తున్నాడని మెచ్చుకుంటున్నారు. ఇలాంటోడు గనుక జట్టులోకి వస్తే తిరిగి ఉండదని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో 14 బంతులు ఆడిన హాల్మన్… 32 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు బౌండరీలు అలాగే ఒక సిక్సర్ కూడా ఉంది. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సర్రే నిర్ణీత 20 ఓవర్లలో 1089 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు చేదించలేకపోయింది. దీంతో సర్రే విజయం.. సాధించింది.
— Out Of Context Cricket (@GemsOfCricket) July 17, 2025