BigTV English

Don’t Come Home Movie : దయ్యాల కొంపలో గందరగోళం… పోలీసులకు చుక్కలు చూపించే మిస్సింగ్ కేస్

Don’t Come Home Movie : దయ్యాల కొంపలో గందరగోళం… పోలీసులకు చుక్కలు చూపించే మిస్సింగ్ కేస్

OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలను ఒక పక్క ఇష్టపడుతూ, మరో వైపు భయపడుతూ చూస్తూ ఉంటారు. రెండు విధాలుగా ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. కొన్ని సినిమాలను చూస్తూ భయపడి థియేటర్లలో నుంచి, మధ్యలోనే బయటికి వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వెబ్ సిరీస్ లు కూడా ఈ కంటెంట్ తో డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే థాయ్ సిరీస్ ట్విస్ట్ లతో అదరగొట్టేస్తోంది. ఆరు ఎపిసోడ్స్ ఉన్న ఈ థాయ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రతి ఎపిసోడ్ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. క్లైమాక్స్ లోనే అసలు ట్విస్ట్ బయటపడుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్‌ఫ్లిక్స్‌ (Netfix)లో

ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘డోంట్ కమ్ హోమ్’ (Don’t come home). దీనికి వూట్టిదానై ఇంతరకసేట్ దర్శకత్వం వహించారు. డోంట్ కమ్ హోమ్ అనేది థాయ్ మిస్టరీ డ్రామా టెలివిజన్ సిరీస్. ఈ సిరీస్ 31 అక్టోబర్ 2024 నుండి నెట్‌ఫ్లిక్స్‌ (Netfix)లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.


స్టోరీలోకి వెళితే

హీరోయిన్ తన కూతురు మిన్నీని, తన స్వస్థలం అయిన ఇంటికి తీసుకు వెళుతూ ఉంటుంది. ఎందుకో ఏమో తెలియదు గానీ, ఆమె టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత పెట్రోల్ బంకులో ఆయిల్ కొట్టించుకొని వెళ్తుంది. ఇంటికి వెళ్ళాక, అక్కడ అంతా పాడు బడిపోయి ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరూ ఉండరు. వీళ్ళిద్దరూ ఆ ఇంట్లో అన్ని సరి చేసుకుంటూ ఉంటారు. అదే ఇంట్లో కూతురులా ఉండే మరొక అమ్మాయి, అటు ఇటు తిరిగినట్టుగా కనబడుతూ ఉంటుంది. దగ్గరికి వెళ్లి చూస్తే మాయమైపోతూ ఉంటుంది. మిన్నుకి కూడా ఆ ప్రాంతంలో దయ్యాలు కనబడుతూ ఉంటాయి. ఒకరోజు మిన్ను కనబడకుండా పోతుంది. హీరోయిన్ కంగారుపడి పోలీసులకు ఫోన్ చేస్తుంది. పోలీసులు అక్కడికి వచ్చి, సిసి కెమెరా  చెక్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ కూడా, అక్కడ పరిస్థితులను గమనిస్తూ ఉంటుంది. హీరోయిన్ అబద్ధం చెప్తోందని అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే సిసి ఫుటేజ్ లో కారులో వచ్చేటప్పుడు అందులో కూతురు ఉండదు. ఈ విషయాన్ని హీరోయిన్ ను  అడుగుతుంది పోలీస్ ఆఫీసర్. అప్పుడు హీరోయిన్ తను ముందర సీట్లు పడుకుని ఉందని చెప్తుంది. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు పోలీసులు.

ఫ్లాష్ బ్యాక్ లో ఒక స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. హీరోయిన్ చిన్నగా ఉన్నప్పుడు, ఆమె తల్లి ఒక ఇంజనీర్ కావడంతో ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఒకరోజు వెకేషన్ కి వెళ్తుండగా, అక్కడ కూడా కూతురిపై కోప్పడుతూ ఉంటుంది. ఇక కారులో నుంచి దిగి వెళ్ళిపోతున్నాను అని చెప్పి బయటకి వస్తుంది. ఈలోగా కార్ యాక్సిడెంట్ అవుతుంది. హీరోయిన్ తో పాటు ఆ కార్లో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. అప్పుడు ఇంటికి వచ్చిన హీరోయిన్ తల్లి, సూసైడ్ చేసుకొని చనిపోవాలనుకుంటుంది. ఆ ప్రయత్నం చేస్తుండగానే, ఆమె ఆశ్చర్యం కలిగించే ఒక విషయం కనిపెడుతుంది. అదే ఆమె ప్రయోగం చేస్తున్న టైం మిషన్ వర్క్ చేస్తుందని గ్రహిస్తుంది. చివరికి ఆ టైం మిషన్ వల్ల పోయిన వాళ్ళ ప్రాణాలను తెప్పించగలుగుతుందా? ప్రజెంట్ లో జరుగుతున్న హీరోయిన్ ఎవరు? ఆమె తెచ్చుకున్న పాప ఎలా మిస్సయింది. ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : డబ్బుల కోసం అలాంటి వీడియోలో… భార్య ఉండగానే చేయకూడని పని… బెంగాలీ థ్రిల్లర్

OTT Movie : సొంత భార్యనే పరాయి మగాళ్ల దగ్గరకు… నన్ అని కూడా చూడకుండా… మతిపోగోట్టే మలయాళ క్రైమ్ డ్రామా

Friday OTT Movies : మూవీ లవర్స్ కు జాతరే.. ఒక్కరోజు ఓటీటీలోకి 26 సినిమాలు..!

OTT Movie : మనుషుల్ని బంకర్లలో దాచి ఇదేం పాడు పని ? దిక్కుమాలిన డెత్ గేమ్స్… బెస్ట్ సర్వైవల్ మూవీ

OTT Movie : ఓరి నాయనో… మనుషుల్ని మటన్ లా ఆరగించే ఊరు… దీనికంటే నరకమే బెటర్

War 2 OTT : ‘వార్ 2’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే..?

Big Stories

×