OTT Top 10 Viewership: ఓటీటీలో ప్రతి వారం ఎన్నో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, రియాలిటీ షోలు వస్తుంటాయి. కానీ వీటిలో ప్రేక్షకులు నిజంగా ఎక్కువగా చూసింది ఏది ? ఏ సినిమా అందరినీ ఆకట్టుకుంది ? ఈ వారం విడుదలైన సినిమాలలో రష్మిక మందన్న నటించిన ‘కాక్‌టెయిల్ 2’కు ఎలాంటి ర్యాంక్ వచ్చింది ? అనేది తెలుసుకోవాలంటే తాజాగా ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన వ్యూయర్‌షిప్ జాబితా చూడాల్సిందే. ఆగస్టు 3 నుంచి 9 వరకు ఓటీటీ వ్యూయర్‌షిప్ లిస్ట్ రిలీజ్ కాగా, ఇందులో ఏకంగా 5.8 మిలియన్ల వ్యూస్‌తో ఓ స్టంట్ రియాలిటీ షో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. మరి ఆ షో ఏంటి ? టాప్-10లో ఇంకేం ఉన్నాయి ? ఇప్పడు తెలుసుకుందాం.
ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్న Khatron Ke Khiladi Season 15. ప్రమాదకరమైన స్టంట్లు, సెలబ్రిటీల మధ్య పోటీ, రోహిత్ శెట్టి హోస్టింగ్ ఈ షోకు భారీ క్రేజ్ తీసుకొస్తున్నాయి. ఈ సీజన్ రెండో వారంలో ఏకంగా 5.8 మిలియన్ల వ్యూస్ సాధించి టాప్ ప్లేస్‌లో నిలిచింది.
రెండో స్థానంలో Operation Safed Sagar నిలిచింది. కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళం నిర్వహించిన ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కిన ఈ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. యాక్షన్, దేశభక్తి, నిజ జీవిత ఘటనల నేపథ్యంలో సాగే ఈ కథ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
మూడో స్థానంలో సినిమా లేదా వెబ్‌సిరీస్ కాకుండా India vs Sri Lanka Test Match నిలవడం విశేషం. సోనీ లివ్‌లో ప్రసారమైన ఈ మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులు భారీగా వీక్షించారు. దీంతో లైవ్ స్పోర్ట్స్ కూడా ఓటీటీ వ్యూయర్‌షిప్‌లో ఎంత ప్రభావం చూపిస్తుందో మరోసారి స్పష్టమైంది.
నాలుగో స్థానంలో ఎప్పటి నుంచో ప్రేక్షకులను నవ్విస్తున్న Taarak Mehta Ka Ooltah Chashmah ఉంది. కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు పోటీ పడుతున్నా ఈ కామెడీ షో మాత్రం స్పెషల్ ఫ్యాన్ బేస్ తో టాప్ లిస్టులో కొనసాగుతోంది.
ఐదో స్థానంలో Main Wapas Aaunga ఉంది. ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామా ఓటీటీలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. థియేటర్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకు కూడా మంచి వ్యూయర్‌షిప్ లభించింది.
ఆరో స్థానంలో అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న Kaun Banega Crorepati ఉంది. ప్రశ్నలు, ఆసక్తికరమైన పోటీ, భారీ ప్రైజ్ మనీతో పాటు అమితాబ్ బచ్చన్ హోస్టింగ్ ఈ షోకు ఎప్పటిలాగే ప్రత్యేకమైన క్రేజ్ తీసుకొస్తోంది.
ఇక ఈ లిస్టులో రష్మిక మందన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా Cocktail 2 ఏడో స్థానంలో నిలిచింది. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రేమ, స్నేహం, రిలేషన్‌షిప్స్ చుట్టూ తిరుగుతుంది. థియేటర్లలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోనూ మంచి వ్యూయర్‌షిప్ అందుకుంటోంది.
ఎనిమిదో స్థానంలో Thukra Ke Mera Pyaar Season 2 ఉంది. ప్రేమ, పగ, రాజకీయాలు, ప్రతీకారం వంటి అంశాలతో సాగే ఈ డ్రామా మొదటి సీజన్ తర్వాత ప్రేక్షకుల్లో ఆసక్తిని కొనసాగిస్తోంది.
తొమ్మిదో స్థానంలో Anupamaa ఉంది. టెలివిజన్‌లో ఇప్పటికే భారీగా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ సీరియల్ ఓటీటీలోనూ తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, అనూహ్యమైన మలుపులతో సాగే కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇక టాప్-10లో చివరి స్థానంలో House of the Dragon Season 3 ఉంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రపంచానికి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సిరీస్‌లో టార్గారియన్ కుటుంబం మధ్య అధికార పోరు మరింత తీవ్రమవుతుంది. భారీ స్థాయి విజువల్స్, డ్రాగన్స్, రాజకీయ కుట్రలు ఈ సిరీస్‌కు ప్రత్యేకమైన క్రేజ్ తీసుకొచ్చాయి.
అలా గత వారం ఓటీటీ వ్యూయర్‌షిప్‌లో ఖతరోన్ కే ఖిలాడి సీజన్ 15 నంబర్ వన్‌గా నిలిస్తే, ఆపరేషన్ సఫేద్ సాగర్, ఇండియా వర్సెస్ శ్రీలంక టెస్ట్ మ్యాచ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక రష్మిక మందన్న నటించిన కాక్‌టెయిల్ 2 ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. సినిమాల కంటే స్టంట్లు, రియాలిటీ షోలు, స్పోర్ట్స్‌కి కూడా ప్రేక్షకులు భారీగా కనెక్ట్ అవుతున్నారనే విషయాన్ని ఈ టాప్-10 లిస్ట్ మరోసారి చూపించింది.
Read Also: అమ్మకు క్యాన్సర్… కూతురికి ఆటిజం… కానీ ఈ అమ్మాయి చేసిన పని చూస్తే గర్వపడతారు భయ్యా