E-Paper
Advertisement

షాహిద్ అఫ్రిదిని కుక్క అంటూ బండ బూతులు తిట్టాను…ఇర్ఫాన్ ప‌ఠాన్ సంచ‌ల‌నం

షాహిద్ అఫ్రిదిని కుక్క అంటూ బండ బూతులు తిట్టాను…ఇర్ఫాన్ ప‌ఠాన్ సంచ‌ల‌నం
Advertisement

Irfan Pathan abusing Shahid Afridi:  ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు అంటే జనాలు ఎగబడి చూస్తారు. ఇక ఆదివారం రోజున ఈ రెండు జట్లు తలపడితే… పనులు మానుకొని టీవీలకే అతుక్కుపోతూ ఉంటారు. అలాగే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ప్లేయర్ల మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ మ్యాచ్ ల‌లో చీటికి మాటికి ప్లేయర్ల మధ్య చాలా సందర్భాల్లో గొడవలు జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో షాహిద్ అఫ్రిదికి తనకు జరిగిన గొడవను ఇర్ఫాన్ పఠాన్ బయట పెట్టారు. ఈ సందర్భంగా షాహిద్ అఫ్రిదిని కుక్క అంటూ సంబోధించానని గుర్తు చేశారు ఇర్ఫాన్ పఠాన్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

షాహిద్ అఫ్రిదిని కుక్క అంటూ బండ బూతులు తిట్టా – ఇర్ఫాన్ ప‌ఠాన్

2006 సంవత్సరంలో పాకిస్తాన్ పర్యటనకు టీమిండియా వెళ్ళింది. ఈ సందర్భంగా విమానంలో కరాచీ నుంచి లాహోర్ కు టీమిండియాతో పాటు పాకిస్తాన్ ప్లేయర్లు ప్రయాణించారు. ఈ సందర్భంగా తనకు షాహిద్ ఆఫ్రిదికి గొడవ జరిగినట్లు ఇర్ఫాన్ పఠాన్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా షాహిద్ ఆఫ్రిదిని కుక్కతో పోల్చానని వ్యాఖ్యానించారు ఇర్ఫాన్ పఠాన్. కుక్క‌లాగే మొరుగుతున్నాడ‌ని మండిప‌డ్డారు.

Advertisement

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

అసలు విమానంలో ఏం జరిగిందంటే ?

విమానంలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ దగ్గరకు వచ్చి అతని తలపై చేయి వేసి జుట్టును నిమిరాడు షాహిద్ ఆఫ్రిది. ఈ సందర్భంగా ఏంట్రా పిల్లాడా? ఎలా ఉన్నావ్ ? అని ఇర్ఫాన్ పఠాన్ ను పలకరించాడు. అయితే వెంటనే రియాక్ట్ అయిన ఇర్ఫాన్ పఠాన్, నువ్వు ఎప్పటి నుంచి నాకు నాన్నవ్ అయ్యావు ? ఎందుకలా పిల్లాడా ? అని పిలిచావంటూ సీరియస్ అయ్యారు. అక్కడితో ఆగకుండా మీ పాకిస్తాన్ లో ఎలాంటి మాంసం దొరుకుతుందని పక్కన ఉన్న అబ్దుల్ రజాక్ ను ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నించాడు. ఏంటి అలా అడుగుతున్నామని అటు అబ్దుల్ రజాక్ షాక్ అయ్యాడు.

Advertisement

షాహిద్ ఆఫ్రిది నిన్న రాత్రి కుక్క మాంసం తిన్నట్టున్నాడు… అందుకే కుక్క లాగా మొరుగుతున్నాడని స్ట్రాంగ్ కౌంటర్ ఇర్ఫాన్ పటాన్ ఇచ్చాడు. కుక్కతో ఇర్ఫాన్ పఠాన్ పోల్చడంతో… షాహిద్ ఆఫ్రిది ముఖం మాడిపోయింది. ఇర్ఫాన్ పఠాన్ ఇచ్చిన కౌంటర్ కు మళ్లీ సమాధానం చెప్పలేక సైలెంట్ గా కూర్చుండిపోయాడు. ఇక విమానం దిగే వరకు పాకిస్తాన్ క్రికెటర్లు ఎవరు కూడా ఒక్క ముక్క మాట్లాడలేదు. అయితే ఈ సంఘటన గురించి ఇర్ఫాన్ పఠాన్ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ లో తీవ్రమైన చర్చ జరిగింది. కానీ దానికి షాహిద్ అఫ్రిది కౌంటర్ ఇచ్చారు. అసలు ఇర్ఫాన్ పఠాన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని… తనను తిట్టలేదని పేర్కొన్నారు.

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

 

Related News

నాకు టీమిండియా బౌలర్లంటేనే అసహ్యం..అందుకే ఫైనల్స్‌లో చితకబాదాను

పాకిస్తాన్‌కు తిలక్ వర్మ రంకు మొగుడిలా మారాడు

ఇదెక్కడి మాస్ రా మామ.. బ్యాట్ కు తగలకుండానే సిక్సర్

తిండికే దిక్కులేదు, పాకిస్తాన్ ముఖాలకు సిల్వ‌ర్ మెడ‌ల్ రావడమే ఎక్కువ..షోయబ్ అక్తర్ సంచలనం

సగానికి పైగా నష్టాలు… PCBలో ఆర్థిక సంక్షోభం, ఇక దేవుడు కూడా కాపాడ‌లేడు

4 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేక‌పోయాం…పాకిస్తాన్ త‌ల తెగిన‌ట్టుగా ఉంది

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం

Big Stories

Advertisement
×