E-Paper
Advertisement

జూలైలో హ్యాచ్‌బ్యాక్‌ల దూకుడు.. వాగన్ ఆర్ టాప్, మారుతి హవా!

జూలైలో హ్యాచ్‌బ్యాక్‌ల దూకుడు.. వాగన్ ఆర్ టాప్, మారుతి హవా!
Advertisement

July 2026 Hatchback Sales: భారత్‌ లో హ్యాచ్‌ బ్యాక్ కార్లకు రోజు రోజుకు మరింత ఆదరణ లభిస్తోంది. జూలై 2026 అమ్మకాలు చూస్తూ, ఆ సెగ్మెంట్ కార్లు దుమ్మురేపాయి. గత నెలలో మొత్తం 1,07,602 హ్యాచ్‌ బ్యాక్‌ లు అమ్ముడయ్యాయి. గతేడాది జూలైలో 74,475 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈసారి అమ్మకాలు ఏకంగా 44.48 శాతం పెరిగాయి. జూన్ 2026తో పోలిస్తే కూడా 35.49 శాతం వృద్ధి నమోదైంది.

వాగన్ఆర్ మళ్లీ నంబర్ వన్

జూలైలో మారుతి సుజుకి వాగన్ ఆర్ అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌ బ్యాక్‌గా నిలిచింది. మొత్తం 23,338 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో 14,710 యూనిట్లు సేలయ్యాయి. అంటే ఏడాదిలో 58.65 శాతం వృద్ధి సాధించింది. రెండో స్థానంలో మారుతి స్విఫ్ట్ ఉంది. ఇది 21,538 యూనిట్ల అమ్మకాలతో 51.78 శాతం  వృద్ధిని సంపాదించింది. ఈ మోడల్‌కు 20 శాతానికి పైగా మార్కెట్ వాటా ఉంది.

బాలెనో, ఆల్టోకు కూడా భారీ డిమాండ్

Advertisement

మూడో స్థానంలో ఉన్న మారుతి బాలెనో జూలైలో 18,241 యూనిట్లు అమ్ముడయ్యింది. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 45.89 శాతం పెరిగాయి. ఇక మారుతి ఆల్టో మాత్రం ఈ నెలలో ప్రత్యేకంగా నిలిచింది. 2025 జూలైలో 5,910 యూనిట్లుగా ఉన్న అమ్మకాలు ఈసారి 12,534 యూనిట్లకు చేరాయి. అంటే ఏకంగా 112.08 శాతం వృద్ధి నమోదైంది. వాగన్ఆర్, స్విఫ్ట్, బాలెనో, ఆల్టో నాలుగు మోడళ్లే కలిపి 75,651 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో హ్యాచ్‌ బ్యాక్ మార్కెట్‌లో మారుతి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.

ఐ20 అమ్మకాల్లో భారీ జంప్

టాటా టియాగో 7,429 యూనిట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హ్యుందాయ్ ఐ20 6,738 యూనిట్ల అమ్మకాలతో నిలిచింది. ఐ20 గతేడాది 3,396 యూనిట్లతో పోలిస్తే దాదాపు 98 శాతం వృద్ధిని సాధించింది. టయోటా గ్లాంజా 4,461 యూనిట్లతో తర్వాతి స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే దీని అమ్మకాలు 11.12 శాతం తగ్గాయి. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 4,055 యూనిట్ల అమ్మకాలతో 13.90 శాతం వృద్ధిని నమోదు చేసింది. మారుతి సెలెరియో కూడా జూలైలో మంచి ఫలితాలు సాధించింది. గతేడాది 1,392 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి 3,914 యూనిట్లకు చేరింది. వార్షికంగా 181.18 శాతం వృద్ధి నమోదైంది. టాటా ఆల్ట్రోజ్ 2,862 యూనిట్ల అమ్మకాలతో తర్వాతి స్థానంలో నిలిచింది. అయితే గతేడాదితో పోలిస్తే దీని అమ్మకాలు 26.71 శాతం తగ్గాయి.

74 శాతం మార్కెట్ మారుతి సొంతం

Advertisement

కంపెనీల పరంగా చూస్తే మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్ విభాగంలో స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగించింది. జూలైలో 79,665 యూనిట్లు విక్రయించి సుమారు 74 శాతం మార్కెట్ వాటా సాధించింది. హ్యుందాయ్ 10,793 యూనిట్లతో రెండో స్థానంలో, టాటా మోటార్స్ 10,291 యూనిట్లతో మూడో స్థానంలో నిలిచాయి.

Read Also: స్కోడా ఎలక్ట్రిక్ కార్ల ఎంట్రీ.. భారత్‌కు రానున్న 3 గ్లోబల్ మోడల్స్ ఇవే!

Tags

Related News

227 కిమీ రేంజ్‌ తో యూధా EPOD-భారత్.. ఈ ఆటో ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

స్కోడా ఎలక్ట్రిక్ కార్ల ఎంట్రీ.. భారత్‌కు రానున్న 3 గ్లోబల్ మోడల్స్ ఇవే!

కవాసకి W230 vs యమహా XSR155.. ఈ రెండు రెట్రో బైక్‌లలో ఏది బెస్ట్?

నీళ్లు లేకుండా కారు వాష్.. ఈ ఐడియా ఏదో భలే ఉందే!

మళ్లీ మార్కెట్లోకి అడుగు పెట్టిన స్పైకర్.. అదిరిపోయే సూపర్‌ కార్‌ తో రీఎంట్రీ!

ఆటోమొబైల్ రంగంలో రికార్డ్.. రూ.383 కోట్లకు అమ్ముడైన టాప్ బ్రాండ్ ఈవీ కారు.. ఎవరు కొన్నారో తెలుసా?

జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ 85 యూనిట్లు మాత్రమే!

Big Stories

Advertisement
×