E-Paper
Advertisement

OTT Movie : డేటింగ్ కోసం పాకులాడే ఫ్యాట్ లేడీ… బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ కు తిప్పలు తప్పలేదు

OTT Movie : డేటింగ్ కోసం పాకులాడే ఫ్యాట్ లేడీ… బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ కు తిప్పలు తప్పలేదు
Advertisement

OTT Movie : అమ్మాయిలు అందానికి ఇచ్చే విలువ మొగుళ్ళకు కూడా ఇవ్వరు. అందం మీద అంత మక్కువ పెంచుకుంటారు అమ్మాయిలు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో, లావుగా ఉన్న ఒక అమ్మాయి లవ్ లో పడుతుంది. ఆ తరువాత బరువు తగ్గడానికి నానా కష్టాలు పడుతుంది. ఈ మూవీ సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఈ చైనీస్ రొమాంటిక్ ఫ్యాంటసీ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..

వికి (viki) ఓటీటీ లో

Advertisement

ఈ చైనీస్ రొమాంటిక్ ఫ్యాంటసీ మూవీ పేరు ‘ఓవర్‌సైజ్ లవ్’ (Over size love). లిన్ జియావో జి అనే ఒక యువతి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. 2020 లో వచ్చిన ఈ మూవీకి జాంగ్ లీనజీ దర్శకత్వం వహించారు. డేటింగ్ కోసం తపన పడే ఒక అమ్మాయి, అందం కోసం మాజిక్ సిరప్ తాగుతుంది. ఆ తరువాత ఆమె చాలా అందంగా అవుతుంది. ఇక ఇప్పుడు ఈ చైనీస్ రొమాంటిక్ ఫ్యాంటసీ స్టోరీ రసవత్తరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ చైనీస్ రొమాంటిక్ ఫ్యాంటసీ మూవీ వికి (viki) ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే ..

Advertisement

లిన్ జియావో జి ఒక ద్వీపంలో ఫోటోగ్రఫీ స్టూడియో నడుపుతుంది. ఆమె కొంచెం అధిక బరువు కలిగి ఉంటుంది. ఆమె ఆకర్షణీయమైన జీవితం గురించి కలలు కంటుంది. ఆమె చిన్ననాటి స్నేహితుడు అయిన హాన్ బింగ్, ఆమె జీవితంలోకి తిరిగి వస్తాడు. అప్పుడు ప్రశాంతమైన ఆమె జీవితంలో ఒక అంతరాయం ఏర్పడుతుంది. లిన్ జియావో జికె, హువాంగ్ కే మీద చాలా కాలంగా ప్రేమ ఉంది. కానీ ఆమె బరువు తనకు సమస్యగా మారుతుంది. ఒకరోజు ఆమెకు   అనుకోకుండా, ఒక మర్మమైన కషాయం కనిపిస్తుంది. ఈ మాయాజాల మిశ్రమం ఆమెను సన్నని, అందమైన అమ్మాయిగా  మారుస్తుంది. హువాంగ్ కేకి దగ్గరగా ఉండటానికి ఆమె “ఆలిస్” అవతారం ఎత్తుతుంది.  ఆ తరువాత అందంగా ఉండటంతో,  ఆమె కలలుగన్న జీవితాన్ని గడపడం ప్రారంభిస్తుంది. అయితే, “ఆలిస్” గా వున్న ఆమె, తన అసలు రూపాన్ని పట్టించుకోకుండా ఉంటుంది.

అందు వల్లే ఆమెను ప్రేమిస్తున్న బాల్య స్నేహితుడు హాన్ బింగ్ నుండి దూరమవడం ప్రారంభిస్తుంది. ఆమె తీసుకున్న కషాయం ఈ  దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. ఆమె కొత్త జీవితం కస్టాలు తీసుకొస్తుంది. లిన్ జియావో జి ఒక సందిగ్ధతను ఎదుర్కొంటుంది.  ఆమె ఒక నిర్ణయం  తీసుకుంటుంది. చివరికి ఆమె సమాజం కోసం ఏర్పరుచుకున్న అందాన్ని వద్దనుకుంటుంది.  తాను జీవిస్తున్నఒక  భ్రాంతి నుండి బయటపడాలని అనుకుంటుంది. ఆ తరువాత ఆమె తన అసలు శరీరానికి తిరిగి వస్తుంది. హాన్ బింగ్‌తో ఆనందం, ప్రేమను పంచుకుంటుంది. ఇంతటితో స్టోరీ ముగుస్తుంది. ఈ రొమాంటిక్ ఫ్యాంటసీ మూవీ ‘ఓవర్‌సైజ్ లవ్’ (Over size love) ని మీరుకూడా చూడాలని అనుకుంటే, వికి (viki) ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది.

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×