Mumaith Khan : టాలీవుడ్ నటి ముమైత్ ఖాన్ పేరు వినగానే అందరికి ఇప్పటికి ఇంకా నా వయసు నిండా పదహారే అనే పాట టక్కున గుర్తుకు వస్తుంది. ఐటమ్ సాంగ్స్ లలో కనిపిస్తూ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. యూత్ కు ఇప్పటికి ఆమె క్రష్ గానే ఉంది. స్టార్ ఐటెం డ్యాన్సర్‌గా మంచి క్రేజ్ అందుకున్న ముమైత్ ఖాన్ గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో పలు బిగ్ ప్రాజెక్టుల్లో కనిపించిన ఆమె, తన డ్యాన్స్ మ్యూమెంట్స్‌తో అభిమానులను తన వైపు తిప్పుకుంది.. ఈ మధ్య సినిమాల్లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈమె పేరు ట్రెండ్ అవుతూనే ఉంది.. అయితే తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాదాపుగా 15 రోజుల పాటుగా ఆమె కోమాలోకి వెళ్లిందనే ఓ వార్త ఇండస్ట్రీని కుదిపేస్తుంది. అందులో నిజమేంత ఉందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
నిజానికిఅప్పట్లో పెద్ద సినిమాల్లో ముమైత్ తో ఒక సాంగ్ పక్కా ఉండేది. అయితే కొన్నాళ్ల అనంతరం ఆమె కెరీర్ కాస్త డీలాపడింది. టీవీ షోలతో పాటు కొన్ని ప్రత్యేక పాత్రలతో ప్రయత్నించినా, ముమైత్ కి మళ్లీ క్రేజ్ రాలేదు.. సినిమాలో అయితే కనిపించలేదు కానీ ఈమధ్య బిజినెస్ లోకి దిగిన విషయం తెలిసిందే. హెయిర్ బ్యూటీ క్లినిక్ ను ప్రారంభించిన ముమైత్ ఖాన్ మీడియా ఫోకస్‌లోకి వచ్చింది. ప్రముఖ డ్యాన్సర్‌గా ఎన్నో సూపర్ హిట్ పాటల్లో అలరించిన ముమైత్ ఖాన్ అకస్మాత్తుగా ఇండస్ట్రీ నుంచి మాయం అయ్యింది.
Also Read : నా ఫ్యామిలి జోలికి వస్తే ఊరుకోను.. మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్..
అనేక ఊహాగానాలు వినిపించాయి. సోషల్ మీడియాలోనూ ఆమె గురించి చాలా తక్కువగా వినిపించడం, ఏమైందో అనే ఆసక్తిని పెంచింది. అయితే తాజాగా ముమైత్ ఖాన్ తాను కనిపించకుండా పోవడానికి కారణాలను పంచుకుంది. తన జీవితంలో తాను ఎదుర్కొన్న అతి పెద్ద సంఘటన గురించి వివరించింది. ఇంట్లో డ్యాన్స్ చేస్తూ ఉండగా కాలు జారిపోయి బెడ్‌కి తల బలంగా తగిలింది. అయితే, రక్తం రాలేదుకానీ, లోపల పెద్ద ప్రమాదం జరిగింది.. హాస్పిటల్ కు తీసుకెళ్లారు కానీ నేను అప్పుడు కోమాలోకి వెళ్ళిపోయినట్లు చెప్పింది. దాదాపు 15 రోజులుగా ఆఛేతన స్థితిలోకి వెళ్ళిపోయినట్లు ఆమె తెలిపారు. కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత తన మెమరీలో మార్పు వచ్చిందని చెప్పింది.. ఇప్పటికీ దాని ఎఫెక్ట్అలానే ఉంది అప్పుడప్పుడు నేను మెమరీ లాస్ అవుతానని ఆమె బయట పెట్టారు.. గతంలో స్పెషల్ సాంగ్స్ తో పాటు ముమైత్ పలు పవర్ఫుల్ క్యారెక్టర్లు కూడా చేసింది.. ముమైత్ ఖాన్ గురించి తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు.. ఎంత కష్టమొచ్చింది అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం బిజినెస్ లోకి అడుగుపెట్టిన ఈమె అందులో సక్సెస్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది. సినిమాలు చేస్తున్న లేదా చూడాలి..