Manchu vishnu: మంచు ఫ్యామిలీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇండస్ట్రీలో ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యామిలీలో మంచు ఫ్యామిలీ మొదటి స్థానంలో ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు కానీ ఆ ఇద్దరు కూడా మంచి గుర్తింపు తెచ్చుకోలేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్న స్టార్ హీరోలుగా మాత్రం ఎదగలేదు.. ఇప్పటికీ ఒక్క హైట్ సరిగ్గా చూస్తున్నారు.. అయితే ప్రస్తుతం కన్నప్ప మూవీ తో ప్రేక్షకులకు రాబోతున్నాడు. మూవీ ప్రమోషన్ల కారణంగా.. చానెల్స్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి మంచు విష్ణు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ తరుణంలోనే ఆయన ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. సినిమా గురించి కాకుండా పొలిటికల్ కు సంబంధించిన కామెంట్స్ చేశారు. ఆయనకు అనేక మంది ఎమ్లెల్యే లు తెలుసు అని సంచలన విషయాలను బయట పెట్టాడు. దాంతో పాటు తన ఫ్యామిలీని తప్పుగా మాట్లాడితే తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చాడు.
మంచు విష్ణు ప్రముఖ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో మంచు వారబ్బాయి మాట్లాడుతూ.. సోషల్ మీడియాని కరెక్ట్ గా వాడుకోవాలి అంతేగాని వేరే వాళ్ళని నిందించడానికి లేదా అసభ్యంగా పోస్ట్ పెట్టండి. ఇబ్బంది పెట్టకూడదు.. నా తప్పు ఉంటే భరిస్తాను ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకోను అని ఆయన అన్నాడు. తప్పు నా వైపు ఉంటే నేను తప్ప ఒప్పుకుంటాను అంతేగాని ఫ్యామిలీ మధ్యలో అట్లాగే అసభ్యంగా మాట్లాడిన పోస్ట్ పెట్టిన మెసేజ్ సహించమని స్ట్రాంగ్ కౌంటర్ఇచ్చాడు.. సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్న వాళ్ళకి ఇంటర్వ్యూ వార్నింగ్ ఇచ్చాడు. మూవీరూల్స్ బాగాలేదని పెట్టిన భరిస్తాను దయచేసి ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేసి మాత్రం ఇందులో నా అసహనాన్ని పరీక్షించవద్దు అంటూ విష్ణు అంటారు. ప్రస్తుతం కన్నప్ప మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న విష్ణు ఇచ్చుడు మార్నింగ్ సమ్మర్లో ప్రేక్షకుల మందులు తీసుకురావాలని ఆలోచనలో ఉన్నాడు..
ఇకపోతే ఈ మూవీ అద్భుతమైన కథాంశంతో భారీ తారాగణంతో తీశారట. ఈ సినిమాకు మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించి దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్ సమర్పించారని సమాచారం. అయితే ఈ సినిమాకు మరో స్పెషల్ ఏంటంటే ఇందులో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఇప్పటివరకు అందరికీ సంబంధించిన పోస్టర్లు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ లుక్ పై ప్రశంసలు కురిసాయి. ఇక ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. విష్ణు ఈ మూవీపై ఆశలు పెట్టుకున్నారు. మరి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..