BigTV English

OTT Movie : అన్నయ్య చనిపోయాడని వదినకి ఆ పని చేసే మరిది.

OTT Movie : అన్నయ్య చనిపోయాడని వదినకి ఆ పని చేసే మరిది.

OTT Movie : తమిళ్ ఇండస్ట్రీ నుంచి గొప్ప నటీనటులు తెరమీదకు వచ్చారు. ఈ ఇండస్ట్రీ నటనకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. డి గ్లామర్ రోల్ చేయాలంటే మొదటగా తమిళ నటులు సిద్ధంగా ఉంటారు. బాబీ సింహ, కీర్తి సురేష్ జంటగా నటించిన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


యూట్యూబ్ (Youtube) లో

ఈ తమిళ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘పాంభు సత్తై’ (Paambhu Sattai). బాబీ సింహా,  కీర్తి సురేష్ నటించిన ఈ తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ఆడమ్ దాసన్ దర్శకత్వం వహించాడు. ఇందులో గురు సోమసుందరం, భాను, చార్లే సహాయక పాత్రల్లో నటించారు. నటుడు మనోబాల నిర్మించిన ఈ మూవీకి అజీష్ సంగీతం అందించారు. అన్న చనిపోయాక హీరో వదినతో ఉండాల్సి వస్తుంది. అయితే సమాజం వీళ్ళను మరోలా చూస్తుంది. వదినకి మళ్ళీ పెళ్లి చేయాలనుకొనే మరిది చుట్టూ స్టోరీ నడుస్తుంది. ఈ తమిళ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

దక్ష తన అన్న చనిపోవడంతో వదినతో కలిసి ఒక ఇంట్లో ఉంటాడు. వదిన ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటుంది. దక్ష కూడా వాటర్ క్యాన్లు సప్లై చేసే జాబ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో దక్ష, వేణి అనే అమ్మాయిని చూస్తాడు. ఆమె చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుంది. దక్ష వేణిని లవ్ చేయడం మొదలు పెడతాడు. కొద్ది రోజుల్లోనే వీళ్ళిద్దరూ, ఒకరిని ఒకరు ఇష్టపడతారు. ఒకరోజు వేణిని చూసుకోవడానికి పెళ్లి కొడుకు వస్తాడు. ఈ విషయం వేణి, దక్షతో చెప్తుంది. దక్ష వేణి తండ్రిని కలిసి  అసలు విషయం చెప్తాడు. అయితే వేణిని, దక్షకు ఇవ్వడానికి ఆమె తండ్రి  ఒప్పుకోడు. ఎందుకంటే దక్ష అతని వదిన తో కలిసి ఒకే ఇంట్లో ఉంటాడు. ఊర్లో అందరూ వీళ్ళ గురించి తప్పుగా అనుకుంటూ ఉంటారు. అందువల్ల వేణిని దక్షకి ఇవ్వడానికి ఒప్పుకోడు. ఆ తర్వాత వేణికి, దక్షకి వదిన విషయంలో చిన్నపాటి గొడవ అవుతుంది.

తనకు అందరికన్నా వదినే ముఖ్యమని చెప్తాడు. తను చాలా డబ్బున్న అమ్మాయి అని, తన అన్నను ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి వచ్చిందని చెప్తాడు. దురదృష్టవశాత్తు అన్న చనిపోవడంతో, ఇంట్లో వాళ్ళు ఆమెను వద్దనుకోవడంతో తనతో పాటే ఉంటుందని చెప్తాడు. తన వల్ల మరిది పెళ్లి ఆగిపోతుందని బాధపడుతుంది వదిన. తను పెళ్లి చేసుకుంటే మరిదికి కూడా పెళ్లి అవుతుందని గ్రహించి, మరిదితో పెళ్ళికొడుకుని చూడమంటుంది. చివరికి దక్ష, వేణి పెళ్లి జరుగుతుందా ? వదినకి పెళ్లి సంబంధం కుదురుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్  అవుతున్న ‘పాంభు సత్తై’ (Paambhu Sattai) అనే ఈ మూవీని చూడాల్సిందే.

Tags

Related News

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

OTT Movie : ఫ్యామిలీ కోసం అడల్ట్ సైట్‌లోకి ఎంట్రీ … CA టాపర్ కూడా అలాంటి పనులు … ఈ సిరీస్ ను ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

Big Stories

×