BigTV English

OTT Movie : మొదటి రాత్రే ప్రియుడితో లేచిపోయే భార్య … వీడి కష్టం పగవాడికి కూడా రావొద్దురా బాబూ

OTT Movie : మొదటి రాత్రే ప్రియుడితో లేచిపోయే భార్య … వీడి కష్టం పగవాడికి కూడా రావొద్దురా బాబూ

OTT Movie : మలయాళం సినిమాల ట్రెండ్ ఇప్పుడు బాగా నడుస్తోంది. ఒకప్పుడు మలయాళం సినిమాలంటే చిన్న చూపు ఉండేది. అయితే ఇప్పుడు ఈ సినిమాలు అన్ని భాషలలో రిలీజ్ చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా వీటిని ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక పెళ్ళికాని ప్రసాద్ చుట్టూ తిరుగుతుంది. 30 దాటిపోయినా పెళ్లి మాత్రం అవ్వకపోవడంతో, హీరో బాధపడుతూ ఉంటాడు. పెళ్లి కోసం ఇతడు చేసే ప్రయత్నాలతో మూవీ స్టోరీ సరదాగా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్ఫ్లిక్స్ (Netflix) లో

ఈ మలయాళం మూవీ పేరు ‘పద్మిని’ (Padmini). 2023 లో రిలీజ్ అయిన ఈ మూవీకి సేన్నహెగ్డే దర్శకత్వం వహించగా, జేక్స్ బెజొయ్ సంగీతం అందించారు. పెళ్లిజరిగిన మొదటిరాత్రే భార్య వేరే వాడితో లేచిపోతుంది.మళ్ళీ పెళ్లి కోసం వీడు పడే తాపత్రయం మామూలుగా ఉండదు. ఈ మలయాళం మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరోకి అప్పుడే కొత్తగా పెళ్లి జరుగుతుంది. మొదటి రాత్రికి రెడీ అవుతుండగా, పెళ్లికూతురు షాక్ ఇస్తుంది. హీరోతో నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతనితో వెళ్ళిపోతానని చెప్తుంది. చెప్పడమే కాకుండా ఆ రాత్రి బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోతుంది. లేటు వయసులో పెళ్లి జరిగినా, శోభనం కూడా అవ్వకుండానే పెళ్లికూతురు లేచిపోవడంతో హీరో చాలా బాధపడతాడు. ఆ తర్వాత ఊర్లో వాళ్ళందరూ అతన్ని ఎగతాళి చేస్తుంటారు. హీరో నలుగురిలో తిరగాలంటే సిగ్గుతో రోజూ చచ్చిపోతుంటాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత మాట్రిమోనీలో మళ్లీ పేరు నమోదు చేసుకోమని హీరోకి ఫ్రెండ్ సలహా ఇస్తాడు. అలా ఒక పెళ్లిళ్ల బ్రోకర్ దగ్గర హీరో తన వివరాలు ఇస్తాడు. ఇతనికి శ్రీదేవి అనే లాయర్ తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అయితే అక్కడికి వెళ్లిన హీరోకి, శ్రీదేవికి చిన్నపాటి గొడవ జరుగుతుంది. అక్కడితో ఆ పెళ్ళిచూపులు కూడా క్యాన్సిల్ అయిపోతుంది.

ఒంటరిగానే ఉన్న అతని జీవితంలోకి పద్మిని అనే అమ్మాయి వస్తుంది. కొద్ది రోజుల్లోనే వీళ్ళు ప్రేమలో పడతారు. ఇంట్లో వాళ్ళకి కూడా విషయం చెప్తారు. అయితే ఈ పెళ్లి జరగాలంటే, నువ్వు విడాకులు తీసుకోవాలని చెప్తుంది పద్మిని. మొదటి రాత్రి కూడా గడవకుండా వెళ్లిపోయిన, ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా హీరోకి తెలియదు. కోర్టులో విడాకుల కోసం కేసు మాత్రం వేస్తాడు. అయితే కేసు విచారణలో ఆమె ఎక్కడుందో తనకు తెలియదని జడ్జ్ కి చెప్తాడు. జడ్జ్ హీరో కి వార్నింగ్ ఇచ్చి, వచ్చే వాయిదాకి తనని తీసుకురావాలని చెప్పి పంపిస్తాడు. చివరికి లేచిపోయిన పెళ్ళాం తిరిగి వస్తుందా? పద్మనీతో హీరోకి పెళ్లి అవుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘పద్మిని’ (Padmini) అనే ఈ మలయాళం మూవీని మిస్ కాకుండా  చూడండి.

Tags

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×