OTT Movie : మలయాళం సినిమాలు థియేటర్లతో పాటు ఓటిటిలో కూడా దూసుకుపోతున్నాయి. ఇప్పుడు మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా వీటిని రిలీజ్ చేస్తున్నారు. ఈ దర్శకులు స్టోరీని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో బాగా సక్సెస్ అవుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక కేర్‌టేకర్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాను ఎమోషన్ డ్రామాకి, కామెడీని మిక్స్ చేసి తెరకెక్కించారు మేకర్స్. ఈ మూవీని చూస్తే బాలీవుడ్ లో వచ్చిన ‘The Lunchbox’ సినిమా గుర్తుకు వస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
మనోరమా మాక్స్ (Manorama Max) లో
ఈ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘పవి కేర్‌టేకర్’ (Pavi Caretaker). 2024 లో వచ్చిన ఈ మూవీకి వినీత్ కుమార్ దర్శకత్వం వహించారు. దీనిని దిలీప్ గ్రాండ్ ప్రొడక్షన్ ద్వారా నిర్మించారు. ఈ మూవీలో దిలీప్ ప్రధాన పాత్రలో నటించగా… స్వాతి కొండే, రాధికా శరత్‌కుమార్, జానీ ఆంటోనీ, ధర్మజన్ బొల్గట్టి వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ కథ కేరళలోని ఒక రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో కేర్‌టేకర్‌గా పని చేసే పవిత్రన్ జీవితం చుట్టూ తిరుగుతుంది. 2024 ఏప్రిల్ 26 థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం మనోరమా మాక్స్ (Manorama Max) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
పవిత్రన్ గల్ఫ్ లో ఉద్యోగం చేసి ఇండియాకి తిరిగి వస్తాడు. ఆ తరువాత కేరళలోని ఒక అపార్ట్‌మెంట్ లో కేర్ టేకర్‌గా పని చేస్తుంటాడు. పెళ్ళి కాకపోవడంతో అతని జీవితం రొటీన్‌గా సాగుతుంది. ఇప్పుడు అతనికి ఒక పెంపుడు కుక్క మాత్రమే తోడుగా ఉంటుంది. పవిత్రన్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రెండు షిఫ్ట్‌లలో పని చేస్తాడు. ముక్కు సూటిగా మాట్లాడే ఇతని స్వభావం సహోద్యోగులతో, ముఖ్యంగా మహిళా ఉద్యోగులతో గొడవలకు దారి తీస్తుంది. ఈ క్రమంలో ఆ అపార్ట్‌మెంట్ యజమాని, మాజీ పోలీసు అధికారి మరియమ్మ పవిత్రన్ కు ఒక ఇంటిని అద్దెకు ఇవ్వాలని నిర్ణయిస్తుంది. అయితే ఆ ఇంట్లో ఒక మహిళ డే డ్యూటి చేస్తూ ఉంటుంది. రాత్రి షిఫ్ట్‌లో పని చేసే పవిత్రన్ ఈ మహిళను కలిసే అవకాశం ఉండదు.
వారిద్దరూ ఒక టేబుల్‌పై ఉంచిన నోట్స్ ద్వారా కమ్యూనికేట్ చేయడం ప్రారంభిస్తారు. ఈ నోట్స్ ద్వారా వారి మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది. పవిత్రన్ ఆమెపై ఇష్టం పెంచుకుంటాడు. అయితే ఒక అపార్థం కారణంగా, ఆ మహిళ అకస్మాత్తుగా ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. దీనితో పవిత్రన్ హృదయం బద్దలవుతుంది. ఈ ఘటన అతని పని తీరు పై కూడా ప్రభావం చూపుతుంది. పవిత్రన్ తన వల్లే ఆమె దూరంగా వెళ్లిపోయిందని బాధపడతాడు. ఇక ఆమెను వెతకడం మొదలెడతాడు. తన తప్పును సరిదిద్దుకోవడానికి క్షమాపణ అడగాలనుకుంటాడు. చివరికి వారు తిరిగి కలుసుకుంటారా ? వారి అనుబంధం మరింత బలపడుతుందా ? పవిత్రన్ చేసిన పొరపాటు ఏమిటి ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమాను మిస్ కాకుండా కూడనది.
Read Also : చేతబడి చేస్తోందని చెల్లిని చంపబోయారు … అక్క అడ్డుపడి అడ్డంగా ఏసుకుంటూ పోయింది