OTT Movie : మలయాళం హీరో బాసిల్ జోసెఫ్ ని ఇప్పుడు ఎక్కువగా అభిమానిస్తున్నారు ప్రేక్షకులు. పక్కింటి అబ్బాయిలా అనిపించే ఈ హీరో మినిమం గ్యారంటీ తో దూసుకుపోతున్నాడు. ఈ హీరో రీసెంట్ గా నటించిన అన్ని సినిమాలు, మంచి కలెక్షన్స్ సాధించాయి. సిక్స్ ప్యాక్ తో ఆరడుగుల ఎత్తు లేకపోయినా, అభినయంతో ఆకట్టుకుంటున్నాడు జోసెఫ్. అయితే ఈ మలయాళం హీరో నటించిన ఒక మూవీ థియేటర్లలో అంతగా ఆడకపోయినా, ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ప్రసూన్ యానిమేటర్‌గా తన కెరీర్‌ను కొనసాగించాలని కలలు కంటాడు. కానీ తండ్రి మరణం తర్వాత, కుటుంబ ఒత్తిడి కారణంగా అతను ఒక గ్రామంలో వెటరనరీ డాక్టర్ గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరవలసి వస్తుంది. ఈ ఉద్యోగం అతని కలలకు విరుద్ధంగా ఉండటంతో, అతను పని పట్ల నిరాసక్తితో ఉంటాడు. ఆ గ్రామీణ వాతావరణంలో సర్దుకుపోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడతాడు. గ్రామంలోని ప్రజలతో, జంతువులతో ప్రసూన్ చేసే ప్రయాణం అతనికి ఒక సవాలుగా మారుతుంది. అతని అనుభవరాహిత్యం, పని పట్ల అయిష్టత కారణంగా అతను తప్పుడు ఆరోపణలకు గురవుతాడు. ఒకానొక సమయంలో ఈ ఉద్యోగాన్ని విడిచి వెళ్లిపోవాలని అనుకుంటాడు. అతను తన సహోద్యోగి స్టెఫీ సహాయంతో క్రమంగా ఈ పరిస్థితులకు అలవాటు పడతాడు. ఒక రోజు గర్భిణీ ఆవుకు చికిత్స చేసే సమయంలో, ప్రసూన్ జీవితంలో మార్పును తెస్తుంది. ఈ సంఘటన అతన్ని మనుషులు, జంతువుల మధ్య సంబంధాన్ని గౌరవించేలా చేస్తుంది. చివరికి ప్రసూన్ వెటరనరీ డాక్టర్ గానే ఉండిపోతాడా ? యానిమేటర్ కావాలనే ఆశయం ఏమౌతుంది. అతని జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి ? అనే విషయాలను, ఈ మలయాళం సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : దిక్కు మాలిన ఐడియాతో కోట్లు కొల్లగొట్టే ప్లాన్… ఊహించని ట్విస్ట్ తో అడ్డంగా బుక్కయ్యే తింగరోడు
జియో హాట్ స్టార్ (Jio hotstar) లో
మలయాళ కామెడీ డ్రామా మూవీ పేరు ‘పల్తు జాన్వార్’ (Palthu Janwar). 2022 లో విడుదలైన ఈ సినిమాకి సంగీత్ పి.రాజన్ దర్శకత్వం వహించారు. ఇందులో బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించగా, ఇంద్రన్స్, జానీ ఆంటోనీ, దిలీష్ పోతన్, షమ్మీ తిలకన్ సహాయక పాత్రల్లో నటించారు. భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కథ ప్రసూన్ (బాసిల్ జోసెఫ్) అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.