OTT Movie : ఇప్పుడు ఎక్కడ చూసినా షార్ట్ ఫిల్మ్ లు తీసేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లతోనే వీటిని తీసి సోషల్ మీడియాలో వదిలి, ఎవరికి ఉన్న టాలెంట్ ని వాళ్ళు నిరూపించుకుంటున్నారు. వీటిలో కొన్ని షార్ట్ ఫిల్మ్ లకు, అవార్డులు కూడా దక్కుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే షార్ట్ ఫిల్మ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ స్టోరీ ఒక బ్లాక్ హోల్ కాగితం చుట్టూ తిరుగుతుంది. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది. అనే వివరాల్లోకి వెళితే ..
యూట్యూబ్ (Youtube) లో
ఈ బ్రిటిష్ షార్ట్ ఫిల్మ్ పేరు ‘ది బ్లాక్ హోల్’ (The Black Hole). 2008 లో వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ కు ఫిలిప్ సాన్సమ్, ఒల్లీ విలియమ్స్ దర్శకత్వం వహించారు. ఇందులో అత్యాశకు వెళితే ఏం జరుగుతుందో చక్కగా చూపించారు. ఇది యూట్యూబ్ (Youtube) లో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
చార్లీ అనే ఒక ఉద్యోగి ఆఫీస్ లో ఒంటరిగా పని చేసుకుంటూ ఉంటాడు. అయితే అతను ఈ బోరింగ్ ఉద్యోగంతో విసిగిపోయి, చాలా ఒత్తిడిలో ఉంటాడు. ఒకానొక సమయంలో జిరాక్స్ మిషన్ పని చేయకుండా పోతుంది. అప్పుడే ఒక A3 కాగితంపై ఒక నల్లటి గుండ్రని బొమ్మ, ఆ మిషన్ నుంచి బయటకు వస్తుంది. చార్లీ అది ఏమిటో అర్థం కాక, ఆ కాగితంపై తన కాఫీ కప్పు పెడతాడు. కానీ అది అకస్మాత్తుగా కాగితంలోకి పడిపోతుంది. అతను ఆశ్చర్యపోయి ఆ కాగితంలో ఉన్న నల్లటి బొమ్మ ఒక ‘బ్లాక్ హోల్’ లాంటిదని గ్రహిస్తాడు. అది ఏ గోడకైనా అతికించి, దాని ద్వారా లోపల ఉన్న వస్తువులను తీసుకోవచ్చని తెలుసుకుంటాడు. మొదట చార్లీ ఈ బ్లాక్ హోల్‌ని ఉపయోగించి, వెండింగ్ మిషన్ నుండి స్నికర్స్ చాక్లెట్ బార్ ను తీసుకుంటాడు.
Read Also : ఇంట్లోనే సైకో కిల్లర్ ను పెట్టుకుని పండగ చేసుకునే బ్యాచ్… భయంతో అరుపులు పెట్టించే థ్రిల్లర్ మూవీ
ఇప్పుడు అతనికి మరింత ఉత్సాహం పెరుగుతుంది. అతనికి ఒక దురాలోచన వస్తుంది. ఆఫీసులోని సేఫ్ లాకర్ లో ఉన్న డబ్బును తీసుకోవాలని అనుకుంటాడు. అతను కాగితాన్ని లాకర్ పై అతికించి, డబ్బును తీసుకోవడం ప్రారంభిస్తాడు. అయితే ఎక్కువ డబ్బు కోసం ఆశపడి, అతను లాకర్ లోపలికి పూర్తిగా దూరతాడు. ఈ క్రమంలో కాగితం లాకర్ నుండి జారిపడి నేలపై పడుతుంది. చార్లీ ఆ లాకర్ లో చిక్కుకుంటాడు. అతను సహాయం కోసం గట్టిగా అరుస్తాడు. కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో అందులోనే ఉండిపోతాడు. చివరికి అతను లాకర్ లో నుంచి బయటకి వస్తాడా ? అందులోనే ఉండిపోతాడా ? అనే విషయాలను ఈ షార్ట్ ఫిల్మ్ ను చూసి తెలుసుకోండి.