Gundeninda GudiGantalu Today episode May 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా శివ చెప్పిన విషయాన్ని బట్టి బాలు ఎందుకు చేయి విరగగొట్టాడో తెలుసుకోవాలని కారు స్టాండ్ కి వస్తుంది. అక్కడ రాజేష్ ని ఏమైంది అన్నయ్య ఎందుకు ఏదో దాస్తున్నారు. వాడిని కొట్టాల్సిన అవసరం ఏంటి? ఈయన ఎక్కడున్నారు నేను ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిందే అని మీనా అడుగుతుంది. మీనాకు రాజేష్ అసలు విషయం గురించి చెప్పాలని అనుకుంటాడు. బాలు ఆ విషయాన్ని చెప్పనివ్వకుండా రాజేష్ ని అడ్డుకుంటాడు.
బాలుని శివ చేయి ఎందుకు విరగొట్టారు.. మేమంటే మీకు అంత చులకన.. డబ్బులు లేవని మీరు అంతగా ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు వాడు ఎలా ఎగ్జామ్స్ రాయాలి ఇది ఆలోచించరా అని మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాలు మాత్రం మీ నాకు అసలు నిజం చెప్పనివ్వకుండా తనలో తానే బాధపడతాడు..ఇన్నాళ్లు మా నాన్న లేని లోటును మా వాళ్లకు మీరు తీరుస్తారు అనే నమ్మకం నాకుంది ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. నేను తప్పు చేశాను కదా నన్ను కొట్టి చంపేసేయండి అని మీనా బాధపడుతూ వెళ్ళిపోతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. తన తమ్ముడు చెయ్యి బాలు విరగొట్టిన విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పి మీనా బాధపడుతూ ఉంటుంది. మీనా బాధని చూసి చూడలేక రోహిణి శృతి ఇద్దరు ఓదారుస్తూ ఉంటారు. ఇంట్లోకి అప్పుడే వచ్చిన బాలుపై సత్యం సీరియస్ అవుతాడు. నువ్వు చేసిన పనేం బాగా లేదంటూ సత్యం కోపంగా బాలుని తిడతాడు. వాడు ఏం చేసాడో తెలిస్తే మీరందరూ వాన్ని తిడతారంటూ బాలు తనకు తెలిసిన నిజాన్ని బయట పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. కానీ మీ నా మొహం చూసి ఆగిపోతాడు. ప్రభావతి మాత్రం బాలు ఏదో దాస్తున్నాడని నిజాన్ని బయట పెట్టాలని ఎంతో కంగారు పడుతూ ఆలోచిస్తుంది.
ప్రభావతి ఒక్క మాట అనగానే బాలు ఇవన్నీ నీకు అవసరం లేదు అని నోరు మూయిస్తాడు. ఇక ఇంట్లోనే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా బాలుదే తప్పు అంటూ నిందిస్తారు. నేను ఎందుకిలా చేశానో అందరికీ తెలిస్తే ఆ రోజు నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అంటూ బాలు అంటారు. బాలు ఎంత అడిగినా నిజం చెప్పకపోవడంతో మీనా విసిగిపోతుంది. ఆయనను ఏమి అడగద్దు మావయ్య ఆయన ఇష్టం వచ్చినట్లు ఉండనివ్వండి నాకు డబ్బు లేదని చెప్పేసి నన్ను ఇలా చేస్తున్నాడు అని నాకు అర్థం అయిపోయింది అని మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది..
ఆ తర్వాత మీనా దగ్గరికి వెళ్లిన బాలు ఇలాంటి విషయాలు నేను ఇంట్లో వాళ్ళందరికీ చెప్పే అడగాలా నన్ను అడిగితే సరిపోతుంది కదా అని అడుగుతాడు.. మీరు ఎలాగో నిజం చెప్పట్లేదు. నా తమ్ముని కొట్టినట్టే నన్ను కొట్టే ఆలోచనలో ఉన్నారేమో అందుకే నేను ఇంట్లో వాళ్లకి ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాను. ఇక మీరు నాకు ఏ విషయంలోనూ మాట్లాడొద్దు అని మీనా బాధపడుతుంది. బాలు మాత్రం నేను ఒక విషయాన్ని చెప్పలేకపోతున్నాను ఆ విషయం చెప్తే నీ గుండె ఆగిపోతుంది. అందుకే నీకు ఏ విషయం చెప్పలేదు అంటూ బాలు ఎంత నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా మీనా మాత్రం బాలు మొహం కూడా చూడదు.
ఇక రాత్రి అందరూ భోజనాలు చేసే పడుకుంటారు. మీనా హాల్లో కింద పడుకుంటుంది. బాలు మేడ మీద పడుకుంటాడు. అయితే అక్కడ పడుకున్నప్పటినుంచి బాలుకి మీనా తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అలా నిద్రలోకి జారుకోగానే.. సుశీలకొచ్చిన కళ నిజం అవుతుందేమో అని ఉలిక్కిపడి ఒక్కసారిగా లేస్తాడు. షీలా డార్లింగ్ అన్నట్లు మీనా ఇంట్లోంచి వెళ్ళిపోతుందేమో నాకు భయమేస్తుంది అంటూ ఆలోచిస్తాడు. ఇక ఏదైతే అదే అయింది మీనాకు నిజం చెప్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది నన్ను తప్పుగా అర్థం చేసుకోదంటూ అనుకుంటారు బాలు. ఇక మీ నాకు నిజం చెప్పడానికి మీనా దగ్గరికి వెళ్తాడు. మీనా బాలు రావడం చూసి ఈయన నాకు నిజం చెప్పడానికి వచ్చినట్లున్నారు అని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో బాలు మీనాకు నిజం చెప్తాడా..? మీనా దాన్ని నమ్ముతుందా..? శివని మీనా ఏం చేస్తుంది..? అన్నది సోమవారం ఎపిసోడ్ లో చూడాలి..