E-Paper
Advertisement

శోభనం తర్వాత రోజే భార్య పంచాయతీ… కితకితలు పెట్టే కామెడీ ఫ్యామిలీ డ్రామా

శోభనం తర్వాత రోజే భార్య పంచాయతీ… కితకితలు పెట్టే కామెడీ ఫ్యామిలీ డ్రామా
Advertisement

Telugu Comedy Drama : ఇటీవల కాలంలో సినిమాలు ఒకే ఓటీటీలో కాకుండా మల్టిపుల్ ఓటీటీలలో దర్శనం ఇస్తున్నాయి. తాజాగా మరో తెలుగు సినిమా కూడా ఇలా రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్ లలోకి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ETV Winలో హిట్ అయి, ఇప్పుడు Amazon Prime Videoలోకి కూడా వచ్చేసిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. థియేటర్లలో ఆశించిన రెస్పాన్స్ దక్కకపోయినా, ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది. ఈ మూవీ పేరు ‘పాపం ప్రతాప్’ (Papam Prathap). 2026 ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన ఈ కామెడీ డ్రామాను ఎస్పీ దుర్గా నరేష్ దర్శకత్వం వహించారు. తిరువీర్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన ఈ చిత్రం నవ్వుల విందుగా ఉంటుంది.

కథలోకి వెళ్తే…

గోదావరి లంక గ్రామంలో పురుగుల మందుల వ్యాపారం చేసుకుంటాడు వీరయ్య (అజయ్ ఘోష్). అతని కొడుకు ప్రతాప్ (తిరువీర్). చిన్నప్పటి నుంచి తన క్లాస్‌మేట్ బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను ప్రతాప్ ప్రేమిస్తాడు. పెద్దయ్యాకా ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. అంతా సంతోషంగా సాగుతుందనుకున్న సమయంలోనే ఒక ఊహించని ట్విస్ట్ వచ్చి పడుతుంది. బుజ్జమ్మ ఊరి పెద్దల ముందు ఒక పంచాయితీ పెట్టి, తన భర్తతో తనకు సంబంధించిన ఒక సమస్యను బయట పెడుతుంది.

Advertisement

ఆ సమస్య ఏమిటో తెలిసి ఊరంతా షాక్ అవుతుంది. ప్రతాప్‌పై గ్రామంలో అనుమానాలు మొదలవుతాయి. దీంతో ఊర్లో వాళ్ళ వ్యంగ్యాస్త్రాలు విసరడంతో పాటు చెవులు కోరుక్కుంటూ ఉంటారు. భార్య శోభనం జరిగిన వెంటనే ఇలా తన సమస్యను అందరి ముందు పెట్టడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రతాప్ తన సమస్యను అర్థం చేసుకుని దాన్ని ఎలా ఎదుర్కొంటాడు ? తన భార్యతో సంబంధాన్ని ఎలా సరిదిద్దుకుంటాడు ? ఈ క్రమంలో జరిగే ఫన్నీ, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామా, మంచి సందేశం ఉన్న ఈ సినిమాను అస్సలు మిస్ చేసుకోకండి

సినిమాలో ఇవే హైలెట్స్

తిరువీర్ సహజమైన కామెడీ టైమింగ్‌తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పాయల్ రాధాకృష్ణ బ్రేవ్ అండ్ ఎమోషనల్ హీరోయిన్ పాత్రలో ఆకట్టుకుంటుంది. అజయ్ ఘోష్, రాశి, దేవి ప్రసాద్, రఘుబాబు, శ్రీనివాస్ అవసరాల తదితరులు సపోర్టింగ్ కాస్ట్ గా నటించారు. గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌తో సరదా, హార్ట్ టచింగ్ స్టోరీగా రూపొందింది. సెన్సిటివ్ అంశాన్ని కామెడీ ద్వారా సెన్సిటివ్ గా చెప్పడం నిజంగా స్పెషలే. ‘పాపం ప్రతాప్’ ప్రస్తుతం ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. వీకెండ్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చూడాలి అనుకునే వారికి ఇది బెస్ట్ సజెషన్. పైగా రెండు ఓటీటీలలో అందుబాటులో ఉంది. ఒక దాంట్లో సబ్స్క్రిప్షన్ లేకపోతే మరో ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

Advertisement

Read Also : ఇంటర్వ్యూను మధ్యలో ఆపేస్తే మర్డర్… మైండ్ బెండింగ్ కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్

Related News

ఓటీటీలోకి నయనతార ‘హాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

Big Stories

Advertisement
×