E-Paper
Advertisement

రివర్స్ కెమెరా To బ్లైండ్ స్పాట్ మానిటరింగ్.. ఇండియా లోనే మోస్ట్ అడ్వాన్స్ డ్ ఈవీ స్కూటర్ ఇదే!

రివర్స్ కెమెరా To బ్లైండ్ స్పాట్ మానిటరింగ్.. ఇండియా లోనే మోస్ట్ అడ్వాన్స్ డ్  ఈవీ స్కూటర్ ఇదే!
Advertisement

Keeway Hypvolt-R Electric Scooter: భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో కొత్త టెక్నాలజీతో మరో ప్రీమియం మోడల్ అడుగుపెట్టింది. కీవే హైప్‌వోల్ట్-ఆర్ పేరుతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీని స్టైలిష్ డిజైన్ మాత్రమే కాదు.. కార్లలో కనిపించే కొన్ని ఆధునిక భద్రతా ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. రూ.1.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ స్కూటర్‌ను దేశంలోనే అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా ADAS లెవెల్-2, రివర్స్ పార్కింగ్ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ లాంటి ఫీచర్లు ఉండటం విశేషం.

డిజైన్ గురించి..

హైప్‌వోల్ట్-ఆర్ మ్యాక్సీ స్టైల్ స్కూటర్ గా మార్కెట్ కు పరిచయం అయ్యింది. ముందు భాగంలో డ్యూయల్ ప్రొజెక్టర్ LED హెడ్‌ లైట్లు, L-షేప్ LED DRLs, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు క్రేజీ లుక్‌ను ఇస్తాయి. వెనుక భాగంలో ప్రత్యేకమైన LED టెయిల్‌ లైట్‌ తో పాటు రివర్స్ కెమెరా కూడా ఉంది. పార్కింగ్ సమయంలో వెనుక ఉన్న పరిస్థితిని స్క్రీన్‌ పై చూసే అవకాశం ఉంటుంది.

అత్యాధునిక భద్రతా ఫీచర్లు

Advertisement

భద్రత విషయంలో కూడా ఈ స్కూటర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్ ఛానల్ ABS అందించారు. అలాగే ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి సాధారణంగా ఖరీదైన కార్లలో కనిపించే టెక్నాలజీలు కావడం విశేషం.  రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ మరింత మెరుగుపరచడానికి 14 అంగుళాల అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లు అందించారు.

ఆకట్టుకునే లేటెస్ట్ ఫీచర్లు

టెక్నాలజీ పరంగా కూడా ఈ స్కూటర్ ఆకట్టుకుంటుంది. ఇందులో 5 అంగుళాల TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, USB Type-A, Type-C ఛార్జింగ్ పోర్టులు, 27 లీటర్ల అండర్‌ సీట్ స్టోరేజ్, రివర్స్ మోడ్, అలాగే ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌ లు ఉన్నాయి. అవసరాన్ని బట్టి రైడర్ తనకు నచ్చిన మోడ్‌ను ఎంచుకోవచ్చు.

బ్యాటరీ, రేంజ్..

Advertisement

ఇందులో 12 kW సామర్థ్యం గల మిడ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇది 72 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీంతో కేవలం 2.3 సెకన్లలోనే 0 నుంచి 40 కిమీ వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లు. బ్యాటరీ కోసం రెండు 2.5 kWh రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌లను అందించారు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే IDC ప్రమాణాల ప్రకారం 180 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుంది. అయితే సాధారణ వినియోగంలో సుమారు 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అంచనా. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ తో బ్యాటరీని 3 గంటల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఆధునిక టెక్నాలజీ, ప్రీమియం డిజైన్, కార్ల తరహా భద్రతా ఫీచర్లను కోరుకునే వారికి కీవే హైప్‌వోల్ట్-ఆర్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: పెట్రోల్ ఏరాక్స్‌ కు గుడ్‌బై.. యమహా ఏరాక్స్-E వచ్చేసింది!

Related News

నిస్సాన్ టెక్టన్ కలర్స్ రివీల్.. ఏ వేరియంట్‌ లో ఏ కలర్ దొరుకుతుందంటే?

గ్రాండ్ విటారాపై బంపర్ ఆఫర్.. వామ్మో.. అన్ని వేల డిస్కౌంటా!?

టెక్టన్ కోసం హృతిక్ రోషన్.. నిస్సాన్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

పెట్రోల్ ఏరాక్స్‌ కు గుడ్‌బై.. యమహా ఏరాక్స్-E వచ్చేసింది!

నిస్సాన్ టెక్టన్ వచ్చేసింది.. ఇంత తక్కువ ధరలో అన్ని క్రేజీ ఫీచర్లా?

E20 పెట్రోల్‌ వివాదం.. ఇప్పుడు అందరి ఫోకస్ XP100 ప్యూయల్ పైనే.. దీని స్పెషల్ ఏంటో తెలుసా?

ఇక అంతా ఈవీల రాజ్యమేనా? జూన్ సేల్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×