Virender Sehwag: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs England) మధ్య టి20 సిరీస్ ( India tour of England, 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ కూడా టీమిండియా కోల్పోయింది. మొన్న ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా, ఇంగ్లాండ్ చేతిలో కూడా సిరీస్ కోల్పోయింది. నిన్న బ్రిస్టల్ వేదికగా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నాలుగవ టి20 జరిగింది. ఇందులో కూడా తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలై..3-0 తేడాతో సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రదర్శన పై వీరేంద్ర సెహ్వాగ్ (virender sehwag) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీమిండియాను ఆ ఇద్దరు బీహార్ క్రికెటర్లే నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైభవ్ సూర్య వంశీ, ఇషాన్ కిషన్ ఇద్దరూ పరమ చెత్తగా ఆడి, టీమిండియా కొంపముంచుతున్నారని నిప్పులు చెరిగారు. వీళ్ళు ఉన్నంతకాలం టీం ఇండియా పరిస్థితి ఇలాగే ఉంటుందని చురకలు అంటించారు.
ఇంగ్లాండ్ చేతిలో టి20 సిరీస్ కోల్పోయిన టీమ్ ఇండియా ప్రదర్శన పై మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇషాన్ కిషన్ అలాగే 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ ఇద్దరు కూడా చెత్త ప్రదర్శన కనబరుస్తున్నారని మండిపడ్డారు. అందరూ సంజూను పక్కకు పెట్టాలని కోరాడు తప్ప, విఫలం అవుతున్న బీహార్ కుర్రాళ్లను మాత్రం గుర్తించలేకపోయారని ఫైర్ అయ్యారు. ముందుగా బీహార్ కుర్రాళ్ళు వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ ఇద్దరిని బయటకు పంపిస్తే టీమిండియా సెట్ అవుతుందన్నారు.
ఐపీఎల్ సమయంలో ఈ ఇద్దరు క్రికెటర్లు సెంచరీల మీద సెంచరీలు చేశారని గుర్తు చేశారు. సిక్సర్లు, బౌండరీలతో రెచ్చిపోయినట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ, ఇంగ్లాండ్ మైదానాలలో మాత్రం చేతకాని దద్దమ్మల లాగా ఆడుతున్నారని మండిపడ్డారు. ఐపీఎల్ లో ఆడినట్లుగానే ఇష్టం వచ్చినట్లు షాట్లు వాడి.. వికెట్లు సమర్పించుకుంటున్నారని సీరియస్ అయ్యారు. ఇంగ్లాండ్ కు వెళ్లిన తర్వాత క్రికెట్ ఆడడమే మర్చిపోయారని ఫైర్ అయ్యారు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టి20 సిరీస్ లో నెంబర్ వన్ ఆటగాడు ఇషాన్ కిషన్ నాలుగు ఇన్నింగ్స్ మొత్తం 66 పరుగులు మాత్రమే చేశాడు. రెండో టి20 లో 49 పరుగులు మాత్రమే సాధించాడు. ఇక వైభవ్ సూర్య వంశీ 3 మ్యాచ్లలో కేవలం 42 పరుగులు మాత్రమే సాధించడం గమనార్హం. ఏ ఒక్క ఇన్నింగ్స్ లో 20 పరుగులు దాటలేదు. అందుకే ఈ ఇద్దరు క్రికెటర్ల పై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.