E-Paper
Advertisement

 ఇద్దరమ్మాయిలతో ఓ అబ్బాయి…. ఫ్యామిలీతో కలిసి చూశారో పరలోకానికే

 ఇద్దరమ్మాయిలతో ఓ అబ్బాయి…. ఫ్యామిలీతో కలిసి చూశారో పరలోకానికే
Advertisement

Coming of Age Drama: ఓటీటీలో అడల్ట్ కంటెంట్ ఉండే సినిమాలకు కొదవేమీ లేదు. కాకపోతే ఫ్యామిలీతో ఇలాంటి సినిమాలు చూడలేరు కాబట్టి, చూసిన కాసేపైనా ఒక మంచి మూవీని చూడాలి అనుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఇద్దరమ్మాయిలు కలసి ఎలాంటి రచ్చ చేశారో తెలియాలంటే ‘గర్ల్స్ లైక్ గర్ల్స్’ (Girls Like Girls) మూవీని చూడాల్సిందే. ఇది 2026 జూన్ 19న అమెరికాలో థియేటర్లలో విడుదలై యువత హృదయాలను గెలుచుకున్న కమింగ్-ఆఫ్-ఏజ్ రొమాంటిక్ మూవీ. హేలీ కియోకో రాసిన పాపులర్ నవల, ఆమె పాప్ సాంగ్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

17 ఏళ్ల కోలే ఒంటరిగా ఉంటుంది. తన తల్లి మరణం తర్వాత ఆ బాధతో బతుకుతుంది. తల్లి పోవడంతో తండ్రి ఉంటున్న ఒరెగాన్ అనే గ్రామీణ ప్రాంతానికి షిఫ్ట్ అవుతుంది. కొత్త చోట కోలేకు సోనియా అనే అందమైన, పాపులర్ అమ్మాయి పరిచయం అవుతుంది. సోనియా గ్రామంలో అందరి దృష్టిని ఆకర్షించే అమ్మాయి. ఆమెకు ఇప్పటికే ట్రెంటన్ అనే బాయ్‌ఫ్రెండ్ కూడా ఉంటాడు.

Advertisement

మొదట్లో ఇద్దరూ స్నేహితులుగా మారతారు. కోలే తన తల్లి గురించి బాధపడుతూ చెప్పినప్పుడు, ఇద్దరి మధ్య ఒక భావోద్వేగ క్షణం వస్తుంది. అంతే ఆ క్షణంలో వాళ్ళు ప్రపంచాన్ని మరిచిపోయి ముద్దు పెట్టుకుంటారు. ఆ తర్వాత ఈ ఇద్దరు అమ్మాయిల మధ్య సరికొత్త ప్రేమ భావాలు మొలకెత్తుతాయి. కానీ సోనియా సమాజం ఏమనుకుంటుందో అనే భయంతో, అమ్మాయిలతో డేటింగ్ అనుభవం లేకపోవడంతో మొదట్లో కోలేకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుంది.

ఈ గందరగోళం మధ్య కోలే ఓవైపు బాధ పడుతూనే, తనకు వచ్చిన సమస్యలను ఫేస్ చేస్తుంది. మరోవైపు సోనియా తన బాయ్‌ఫ్రెండ్ ట్రెంటన్‌తో ఉన్న సంబంధం, కోలే పట్ల ఉన్న ఆకర్షణ మధ్య చిక్కుకుపోతుంది. వారిద్దరూ తమ మనసులోని నిజమైన భావాలను అంగీకరించడానికి, సమాజ భయాలను అధిగమించడానికి ఏం చేశారు ? చివరికి ఈ ఇద్దరు అమ్మాయిల లవ్ స్టోరీకి ఎలా ఎండ్ కార్డ్ పడింది ? ఈ క్రమంలో కోలేకి వచ్చిన సమస్యలు ఏంటి ? చివరికి ఇద్దరూ ఒక్కరయ్యారా లేదా ? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిన కథ.

స్ట్రీమింగ్ కి పే చేయాల్సిందే

Advertisement

ఈ అందమైన ప్రేమ ప్రయాణాన్ని ఓటీటీలో ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు. ‘గర్ల్స్ లైక్ గర్ల్స్’ ప్రస్తుతం అమెరికాతో పాటు కొన్ని అంతర్జాతీయ ప్రాంతాలలో Amazon Prime Video, Apple TVలో రెంట్ బేసిస్‌లో అందుబాటులో ఉంది. అంటే సినిమాను చూడాలంటే డబ్బులు పే చేయాల్సిందే. థియేటర్లలో టికెట్ కోసం ఖర్చు చేస్తాం కదా అలాగన్నమాట. భారతదేశంలో రానున్న రోజుల్లో Netflix లేదా JioCinemaలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

Read Also: ఉన్నట్టుండి డబ్బుల ప్రింటింగ్ మిషన్ ఊడిపడితే… లాస్ట్ ట్విస్ట్ అస్సలు మిస్ అవ్వొద్దు

Related News

క్రిమినల్స్ వేటలో శవమై తేలే ఏజెంట్… అనుకున్నంత సింపుల్ కాదు ఈ కేసు… ఇంటెన్స్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్

మళ్లీ మొదలైన రచ్చ… నలుగురు ఫ్రెండ్స్ లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్ ట్విస్టులతో సీజన్ 2 స్ట్రీమింగ్ షురూ

ప్రేమ పేరుతో మెంటలెక్కించే పనులు… ఎక్స్ రీఎంట్రీతో బుర్రపాడు ట్విస్ట్… ఈ లవ్ ట్రయాంగిల్ చూస్తే బుర్రపాడు

నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించే స్పెషల్ టీమ్… కంటెంట్ నెక్స్ట్ లెవెల్ భయ్యా… డెడ్లీ క్రైమ్స్ తో సీజన్ 9 స్ట్రీమింగ్ షురూ

పాపులర్ SNL షో వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ కథ… ఇండస్ట్రీ సీక్రెట్స్ బయటపెట్టిన నెట్‌ఫ్లిక్స్ కొత్త డాక్యుమెంటరీ

కులం పిచ్చితో ప్రేమికుల ప్రాణాలు తీసే రాక్షసత్వం… హార్డ్ హిట్టింగ్ మూవీ

తీరప్రాంతాన్ని వణికించే మిస్టరీ క్రియేచర్… ఊరిని కాపాడుకోవడానికి మత్స్యకారుడి పోరాటం… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్

యూనికార్న్ ఐలాండ్‌లో ఊహించని విపత్తులు… ఆ వింత రహస్యం ఏంటి ? నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త మ్యాజికల్ అడ్వెంచర్

Big Stories

Advertisement
×