OTT Movie : బెంగాలీ వెబ్ సిరీస్ లు మంచి కంటెంట్ ఉన్న స్టోరీలతో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. హారర్ జానర్ లో వస్తున్న బెంగాలీ సిరీస్ లను ప్రేక్షకులు ఓటీటీలో ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ అతీంద్రీయ శక్తుల చుట్టూ తిరుగుతుంది. క్లైమాక్స్ వరకు ఈ స్టోరీ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇందులో డార్జిలింగ్‌లోని భయంకరమైన అడవి, జంప్-స్కేర్స్ హారర్ ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తాయి. బెంగాలీ కల్చర్ ని ఎంజాయ్ చేసే వాళ్లకి ఈ సిరీస్ ఒక ట్రీట్. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ?అనే వివరాల్లోకి వెళితే
హోయ్‌చోయ్ లో స్ట్రీమింగ్
‘పర్ణశవరీర్ శాప్’ (Parnashavarir Shaap) 2023లో విడుదలైన బెంగాలీ హారర్ వెబ్ సిరీస్. ఇది హోయ్‌చోయ్ (Hoichoi) ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. పరంబ్రత చట్టోపాధ్యాయ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, సౌవిక్ చక్రవర్తి రాసిన ‘పర్ణశవరీర్ శాప్’ నవల ఆధారంగా తీయబడింది. ఈ సిరీస్‌లో చిరంజీత్ చక్రవర్తి, గౌరవ్ చక్రవర్తి, సురంగనా బంద్యోపాధ్యాయ్, అనిందితా బోస్, అర్ణ ముఖోపాధ్యాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 7 ఎపిసోడ్‌లతో, ఒక్కో ఎపిసోడ్ సుమారు 20 నిమిషాలు ఉంటుంది. భూత్ చతుర్దశి (2023 నవంబర్ 10) సందర్భంగా విడుదలైన ఈ సిరీస్ హారర్, సస్పెన్స్‌తో నిండిన ఒక గ్రిప్పింగ్ కథను అందిస్తుంది. IMDbలో ఈ సిరీస్ కి 7.5/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
అమియో (గౌరవ్ చక్రవర్తి), మితుల్ (సురంగనా బంద్యోపాధ్యాయ్), టిటాస్ (అనిందితా బోస్), పల్లవ్ (అర్ణ ముఖోపాధ్యాయ్) అనే నలుగురు స్నేహితులు డార్జిలింగ్‌లోని చమక్‌పూర్ అనే ఊరిలో వెకేషన్‌కి వెళ్తారు. అక్కడ వీళ్లంతా సరదాగా, చల్లగా టైమ్ స్పెండ్ చేద్దామని ప్లాన్ తో వస్తారు. కానీ వాళ్లు ఒక పురాతన వస్తువుని తాకడంతో, వాళ్ల హాలిడే ఒక్కసారిగా భయంకరంగా మారిపోతుంది. మితుల్‌కి ఏదో వింతగా అనిపిస్తుంది. ఆమె ప్రవర్తన ఒక్కసారిగా మారిపోతుంది. ఆమె ఒక దెయ్యం ఆవహించినట్లు (పొసెస్డ్) అయిపోయి, తనని తాను హర్ట్ చేసుకోవడం మొదలెడుతుంది. అదే సమయంలో ఆ ఊరిలో కొన్ని మరణాలు కూడా సంభవిస్తాయి. దాంతో అందరూ భయపడిపోతారు.ఈ సమస్యని సాల్వ్ చేయడానికి, అమియో, భదూరి మోషాయ్ (చిరంజీత్ చక్రవర్తి) అనే మాంత్రికున్ని సంప్రదిస్తాడు. భదూరి మోషాయ్ ఒక వృద్ధుడైన ఫేయిత్ హీలర్. మితుల్‌ని కాపాడేందుకు వస్తాడు. అతను తన మాంత్రిక శక్తులతో మితుల్‌ని ఆవహించిన శక్తి ఏమిటో కనిపెడతాడు. అది దేవి పర్ణశవరీ శాపం అని తెలుస్తుంది.
పర్ణశవరీ అనేది పురాతన హిందూ దేవత. ఆమె వ్యాధులను నివారించే శక్తిగా పూజించబడుతుంది. కానీ ఆమె శాపం పడితే భయంకరమైన పరిణామాలు ఉంటాయి. భదూరి మోషాయ్, ఈ శాపం వెనక ఉన్న కారణాన్ని తెలుసుకుంటాడు. అది ఒక మనిషి బలితో (హ్యూమన్ సాక్రిఫైస్) మొదలైన కుట్ర అని, దాని వల్ల దేవి పర్ణశవరీ వినాశకర శక్తులు విడుదలైనట్లు తెలుస్తుంది. ఈ శాపం మితుల్‌ని మాత్రమే కాదు, ఊరి ప్రజలందరినీ ఆపదలోకి నెట్టేస్తుంది. ఈ సమయంలో భదూరి మోషాయ్, మితుల్ ద్వారా ఆవహించిన స్పిరిట్ ఏం చెప్పాలనుకుంటోందో డీకోడ్ చేస్తాడు. అతను దేవి పర్ణశవరీని మేల్కొల్పి, ఈ శాపాన్ని తొలగించేందుకు ఒక ప్రమాదకర నిర్ణయం తీసుకుంటాడు. సిరీస్ మొత్తం డార్జిలింగ్‌లోని ఫాగీ అడవులు, భయంకరమైన వాతావరణంలో జరుగుతుంది. మొదటి నాలుగు ఎపిసోడ్‌లలో జంప్-స్కేర్ మూమెంట్స్, సస్పెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. చివరి ఎపిసోడ్‌లో, భదూరి మోషాయ్ ఈ శాపాన్ని ఎలా తొలగించాడు? మితుల్‌ని, ఊరి ప్రజలను ఎలా కాపాడాడు? అనేది లాజికల్‌గా ముగుస్తుంది.