OTT Movie : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలలో, మలయాళం సినిమాలకి క్రేజ్ ఎక్కువగానే ఉంది. మంచి కథలను తెరమీద చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ స్టోరీ ఒక నకిలీ బ్యాంకు చుట్టూ తిరుగుతుంది. అమాయకులను ఇందులో ఇరికించి, డబ్బులు సంపాదిస్తారు కొంతమంది కేటుగాళ్ళు. ఈ మూవీ చివరి వరకు చాలా ఆసక్తికరంగా సాగుతుంది. గత ఏడాది థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
సైనా ప్లే (Saina play) లో
ఈ మలయాళం మూవీ పేరు ‘పార్ట్‌నర్స్’ (Partners). ధ్యాన్ శ్రీనివాసన్, కళాభవన్ షాజోన్, సత్నా టైటస్ ఇందులో నటించారు. ఈ మలయాళం మూవీకి నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. 2024 లో రిలీజ్ అయిన ఈ మలయాళ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సైనా ప్లే (Saina play) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
విజయ్ అనే వ్యక్తి బ్యాంకు ఉద్యోగానికి వచ్చిన వాళ్లను ఇంటర్వ్యూ చేస్తుంటాడు. అయితే ఏమాత్రం క్వాలిఫికేషన్ లేని వాళ్ళని సెలెక్ట్ చేస్తాడు. వాళ్లందరికీ ఒక గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు ఇస్తాడు. హీరో కూడా అందులో క్యాషియర్ గా జాయిన్ అవుతాడు. అయితే ఆ బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బును, ఒక వ్యక్తి తీసుకుని వెళ్ళిపోతుంటాడు. బ్యాంకును నడపటానికి కనీసం లక్ష రూపాయలు కూడా ఉండదు. విజయ్ వీళ్ళకు ఆరు నెలలు సమయం ఉందని, మీ టాలెంట్ నిరూపించుకుంటే ఉద్యోగాలు ఉంటాయని చెప్తాడు. రొటేషన్ కి కూడా డబ్బులు లేకుండా, వచ్చిన డబ్బులు తీసుకొని పోతుంటారు. వీళ్ళంతా ఆ ఊరిలో ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తారు. అందుకు అతను ఒప్పుకోడు. ఎందుకంటే బయట వడ్డీకి ఇస్తే ఎక్కువ వస్తాయని చెప్తాడు. వీళ్ళు ఏం చేయలేక, అతని దగ్గర కొంచెం డబ్బును క్కూడా అప్పు తీసుకుంటారు. ఆ తర్వాత ఆ బ్యాంకు నకిలీదని హీరో తెలుసుకుంటాడు.
అక్కడినుంచి వెళ్ళిపోదామని అనుకున్న సమయంలో, పోలీసులు వచ్చి వాళ్లను జీపులో తీసుకెళ్తారు. వీళ్లను ఒక ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చిన విజయ్ కలుస్తాడు. విజయ్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ తెలివిగా ఇందులో ఇరికిస్తాడు. ఆ బ్యాంక్ లో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక క్రైమ్ ఉంటుంది. మీరు బ్యాంకు నుంచి వెళ్లిపోతే అదే కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారని బెదిరిస్తాడు. విజయ్ వాళ్లని బ్లాక్ మెయిల్ చేస్తాడు. చివరికి మోసపోయిన ఉద్యోగస్తులు ఏం చేస్తారు? విజయ్ వాళ్లతో ఏ విధంగా పనులు చేయించుకుంటాడు? ఇంకా ఎంత డబ్బు జమ చేస్తారు. ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సైనా ప్లే (Saina play) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘పార్ట్‌నర్స్’ (Partners) అనే ఈ మలయాళం మూవీని చూడాల్సిందే.