Earth Core Gold Mine: బంగారం ఈ భూమిపై అత్యంత విలువైన, ఆకర్షణీయమైన లోహాల్లో ఒకటి. గోల్డ్ తరతరాలుగా మానవులను ఆకర్షిస్తోంది. ఇటీవల హవాయిలోని అగ్నిపర్వత శిలలపై జరిగిన పరిశోధనల్లో అద్భుతమైన విషయాలు బయటపడ్డాయి. భూమి లోతైన కోర్‌లో దాగి ఉన్న బంగారం గురించి సైంటిస్టులు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. జర్మనీలోని గొట్టింగెన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు డాక్టర్ నిల్స్ మెస్లింగ్ నేతృత్వంలో, భూమి కోర్ నుంచి బంగారం ఇతర విలువైన లోహాలు మాంటిల్ పొరల ద్వారా ఉపరితలంపైకి చేరుతున్నాయని గుర్తించారు. ఈ పరిశోధన హవాయి అగ్నిపర్వతాల లావాలో రుథేనియం, బంగారం లాంటి లోహాల ఉనికిని గుర్తించింది. ఇది శాస్త్ర లోకాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
భూమి లోపలి నిర్మాణం మూడు ప్రధాన పొరలుగా విభజించబడి ఉంటుంది. క్రస్ట్, మాంటిల్, కోర్. ఈ మూడింటిలో కోర్ భూమి ఉపరితలం నుంచి సుమారు 3,000 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. ఇది ఇన్నర్ కోర్ మరియు ఔటర్ కోర్‌గా ఉంటుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. హవాయిలోని కిలౌయా లోఇహి అగిపర్వతాల్లో అనేక ఆనవాళ్లు ఉన్న రసాయన సంకేతాలను కనుగొన్నారు. దీని నుంచి బంగారం కూడా బయటకు వస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎర్త్ కోర్ లో 30 బిలియన్ టన్నుల అంటే సుమారు 27వేల కోట్ల కేజీల బంగారు నిల్వలు ఉండి ఉంటాయని భావిస్తున్నారు. దీని విలువ మార్కెట్ రేటు ప్రకారం చూసుకుంటే 284.15 లక్షలు కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ALSO READ: Weather update: మళ్లీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వాన, జాగ్రత్త!
భూమి కోర్‌లో 99.9% బంగారం నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు. ఇది మొత్తం బయటకు వస్తే భూమిని 50 సెంటీమీటర్ల మందంతో కప్పగలదని వారు భావిస్తున్నారు. బంగారం సాధారణంగా భూమి ఉపరితలంపై సులభంగా లభించదు. ఎందుకంటే ఇది భూమి లోతైన పొరల్లో దాగి ఉంటుంది. హవాయిలోని అగ్నిపర్వతాలు, మాంటిల్ ప్లూమ్స్ ద్వారా భూమి కోర్ నుంచి పదార్థాలను ఉపరితలంపైకి తెస్తున్నాయి. ఈ లావాలో రుథేనియం-100 ఐసోటోప్‌తో పాటు బంగారం ఉన్నట్లు గుర్తించడం, కోర్ నుంచి లోహాలు పైకి లీక్ అవుతున్నాయనడానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ ఆవిష్కరణ భూమి భౌగోళిక చరిత్రను అర్థం చేసుకోవడంలో కీలకమైనది. ఎందుకంటే ఇది కోర్, మాంటిల్ మధ్య సంబంధాలను అధ్యయనం చేయడానికి దోహదపడుతుంది.
అయితే, 30 బిలియన్ టన్నుల బంగారం అనే సంఖ్య గురించి స్పష్టమైన సమాచారం లేదు. ఇది బహుశా అతిశయోక్తి కావచ్చు. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే, భూమి కోర్‌లో ఉన్న బంగారం మొత్తం భూమిపై లభించే బంగారం కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఈ బంగారాన్ని వెలికితీయడం ఖరీదైన, సంక్లిష్టమైన ప్రక్రియ. కాబట్టి ఇది ఆర్థికంగా సాధ్యం కాకపోవచ్చు. ఈ ఆవిష్కరణ శాస్త్రీయ దృక్కోణంలో ఆసక్తికరమైనది. ఆర్థిక ప్రభావం కంటే భూమి యొక్క లోతైన నిర్మాణాన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది.