OTT Movie : ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో దొరుకుతుంది. ఇందులోకి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లతో మూవీ లవర్స్ బాగా ఎంటర్టైన్ అవుతున్నారు. సీరియల్స్ నుంచి ప్రేక్షకులు వెబ్ సిరీస్ లపై మనసు పారేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సైన్స్ ఫిక్షన్ సిరీస్ కొరియన్ నుంచి వచ్చింది. ఇది ఒక ట్రైన్ జర్నీతో స్టార్ట్ అవుతుంది. సాధారణ ప్రయాణికులు, అసాధారణ అడ్వెంచర్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఈ సిరీస్ మిమ్మల్ని వేరొక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. చివరి వరకు ఈ సిరీస్ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ కొరియన్ టెలివిజన్ డ్రామా సిరీస్ పేరు ‘పెండింగ్ ట్రైన్’ (Pending Train). 2023 లో విడుదలైన ఈ సినిమా సైన్స్-ఫిక్షన్ సర్వైవల్ డ్రామా శైలిలో రూపొందించబడింది. ఇందులో ట్రైన్ లో జరిగే సన్నివేశాలు, చూపు తిప్పుకోకుండా చేస్తాయి. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. చివరివరకూ ఈ కొరియన్ డ్రామా సిరీస్ టెన్షన్ పెట్టిస్తుంది.
స్టోరీలోకి వెళితే
టోక్యోలో కొంతమంది ప్రయాణికులు, తమ రోజువారీ జీవితంలో భాగంగా ఒక రైలులో ప్రయాణిస్తుంటారు. వీరిలో తమ భవిష్యత్తు కోసం కలలు కనే ప్రయాణికులే ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళు ప్రయాణిస్తున్న రైలులో అలజడి రేగుతుంది. అకస్మాత్తుగా వారి సెల్‌ఫోన్‌లలో భూకంప హెచ్చరిక వస్తుంది. రైలు ఒక టన్నెల్‌లోకి ప్రవేశించినప్పుడు, విద్యుత్ స్పార్క్‌లు రావడంతో లైట్లు ఆగిపోతాయి. అప్పుడు రైలు ఆ సమయంలో చాలా వేగంగా ప్రయాణిస్తుంది. ఆ వేగానికి ప్రయాణికులు కూడా స్పృహ కోల్పోతారు. కొంతసేపటికి వాళ్ళు మళ్లీ కళ్లు తెరిచినప్పుడు, ఒక విచిత్రమైన నిర్జనమైన భవిష్యత్ ప్రపంచంలో ఉన్నట్లు కనిపిస్తుంది. రైలు ట్రాక్‌లు కూడా అకస్మాత్తుగా ముగిసిపోతాయి. ఈ సన్నివేశాలు చూసి ట్రైన్ లో ఉన్న వాళ్ళకు ఒక్కసారిగా పిచ్చెక్కిపోతుంది.
చుట్టూ అడవి, పాడైపోయిన భూమి మాత్రమే వాళ్ళకు కనిపిస్తుంది. ఆహారం, నీరు, కమ్యూనికేషన్ సౌకర్యాలు లేని ఈ కొత్త పరిస్థితుల్లో, వారు బతకడానికి పోరాడాల్సి వస్తుంది. ప్రయాణికులు తమ వ్యక్తిగత జీవితాల్లోని సవాళ్లను ఎదుర్కొంటూనే, ఈ అసాధారణ పరిస్థితుల్లో ఒకరికొకరు సహకరించుకుంటారు. ఎలాగైనా ఈ పరిస్తితి నుంచి బయటపడాలని అనుకుంటారు. అందుకోసం పోరాటాన్ని మొదలు పెడతారు. వారు ఈ ప్రపంచంలో ఎందుకు ఉన్నారు ? తిరిగి తమ సమయానికి వెళ్లగలరా ? లేదా ఈ భవిష్యత్తులోనే జీవించాలా ? అనే సందేహాలు ఆ ప్రయాణికులలో అలజడిని రేపుతాయి. వీటి గురించి మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే, ఈ కొరియన్ టెలివిజన్ డ్రామా సిరీస్ ను చడాల్సిందే. మరెందుకు ఆలస్యం ఈ సిరీస్ పై ఓ లుక్ వెయ్యండి.
Read Also : తెల్లార్లూ ఎంజాయ్… ఉదయాన్నే ఒంటిపై నూలు పోగు లేకుండా… ఎవరితో ఆ పని చేసిందో కూడా గుర్తులేనంతగా…