BigTV English

Alphabet: ఓ వైపు గూగుల్లో ఉద్యోగాల కోత..మరోవైపు రూ.6 లక్షల కోట్ల భారీ పెట్టుబడి ప్లాన్ ప్రకటన

Alphabet: ఓ వైపు గూగుల్లో ఉద్యోగాల కోత..మరోవైపు రూ.6 లక్షల కోట్ల భారీ పెట్టుబడి ప్లాన్ ప్రకటన

Alphabet: ఓ వైపు ట్రంప్ సుంకాల పెంపు గురించి షాకుల మీదు షాకులు ఇస్తుంటే.. మరోవైపు టెక్ ప్రపంచం కూడా షాకులు ఇస్తోంది. సునామిలా వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలకు భయపడకుండా, గూగుల్ మరింత ధైర్యంగా ముందుకు దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఏకంగా రూ. 6.2 లక్షల కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఇది సాధారణ సంఖ్య కాదు. ఇది గూగుల్ టెక్ భవిష్యత్తును పూర్తిగా మార్చనుంది.


డేటా సెంటర్‌లలో భారీ పెట్టుబడి
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ, ఈ పెట్టుబడి ప్రధానంగా డేటా సెంటర్ల అభివృద్ధికి, AI పై జరిపే పరిశోధనలకు ఖర్చవుతుందని తెలిపారు. చిప్‌లు కొనడం, సర్వర్ల నిర్మాణం, జెమిని లాంటి అధునాతన మోడళ్ల అభివృద్ధి ఈ భారీ ఖర్చులో భాగమన్నారు.

పెద్ద డేటా సెంటర్లు
ఇప్పటికే “జెమిని” మోడల్ ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అది చాట్‌బాట్‌ మాత్రమే కాదు. అది గూగుల్ సెర్చ్‌కి దగ్గరగా వెళ్లే ప్రయత్నంలో భాగంగా రూపొందించిన AI. దీన్ని ఇంకా బలంగా చేయాలంటే పెద్ద డేటా సెంటర్లు, శక్తివంతమైన హార్డ్‌వేర్ అవసరం. అందుకే గూగుల్ దీనిపై ఫోకస్ చేసింది.


Read Also: YouTube AI Music Tool: వాయిస్ నీది, బీట్ .

పెట్టుబడిదారులు ఆశ్చర్యం
అమెరికా మార్కెట్లలో ఎటూ వెళ్లని పరిస్థితుల్లో, ఈ భారీ పెట్టుబడి వార్త స్టాక్ మార్కెట్‌ను ఊపేసింది. ఈ క్రమంలో ఏప్రిల్ 9న Alphabet స్టాక్ దాదాపు 10% పెరిగింది. ఈ క్రమంలో ఒక్క రోజులోనే $1.5 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ పెరిగిపోయింది. ఇంకా మైక్రోసాఫ్ట్ కూడా $80 బిలియన్లు, మెటా $65 బిలియన్ల AI పెట్టుబడులు ప్రకటించడం చూస్తే, టెక్ దిగ్గజాలంతా తమ తమ విధానాన్ని AI టైమ్‌జోన్‌కి మార్చేసినట్లే అనిపిస్తుంది.

ట్రంప్ టారిఫ్‌ మధ్య గూగుల్ ధైర్యం
ఈ AI దూకుడుకి మధ్య, ట్రంప్ తాజా టారిఫ్ నోటిఫికేషన్లు కొంత గందరగోళం కలిగించాయి. కొన్ని దేశాలపై సుంకాలు తగ్గించగా, చైనా వంటి దేశాలపై సుంకాలను పెంచారు. దీనివల్ల హార్డ్‌వేర్ దిగుమతులకు సంబంధించి ఖర్చులు పెరగనున్నట్టు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అయినా గూగుల్ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగుతోంది. గూగుల్ క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ గుప్తా మాట్లాడుతూ, “సుంకాలు ఎలా మారతాయో చూస్తుంటాం, కానీ కస్టమర్ డిమాండ్ బలంగా ఉంది. పెట్టుబడి కొనసాగుతుంది ఆయన అన్నారు. ఇది గూగుల్‌కి ఉన్న విశ్వాసాన్ని చూపిస్తోంది.

ఖర్చుతో వచ్చిన అవకాశాల మార్గం!
అదే సమయంలో సైబర్ సెక్యూరిటీతో పాటు AI రంగం ప్రస్తుతం వృద్ధి అవకాశాలు చూపుతున్న అరుదైన రంగాలలో ఒకటి. ముఖ్యంగా Google Cloud వినియోగదారుల నుంచి వచ్చిన సానుకూల స్పందన ఈ వేగాన్ని మరింత పెంచుతుంది. జెమిని వంటి మోడళ్లతో కేవలం టెక్ రంగమే కాదు, ఆరోగ్య రంగం నుంచి విద్యా రంగం వరకు అన్నింటికీ సాంకేతికంగా శక్తి చేకూర్చే పనిలో గూగుల్ ఉంది. దీని వెనుక ఉన్న డేటా సెంటర్, హార్డ్‌వేర్, సర్వర్ ఇన్‌ఫ్రా అన్నీ ఈ పెట్టుబడి ద్వారా నిజం కానున్నాయి.

మరోవైపు ఉద్యోగాలపై కోతలు.. ఇదే వ్యూహమా?
ఇంత భారీ పెట్టుబడి చేయడం చూస్తే, గూగుల్ తన Android, Pixel, Chrome డివిజన్లలో వందలాది ఉద్యోగులను తొలగించిన వార్త బయటకు వచ్చింది. జనవరిలో వీరికి లేఆఫ్ ఆఫర్లు ఇచ్చి అధికారికంగా తొలగించారు. పరిశీలనలోకి వస్తే, ఫిబ్రవరిలో కూడా గూగుల్ తన క్లౌడ్ విభాగంలో ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మళ్లీ గూగుల్ తక్కువ ఖర్చు చేసి, అధిక లాభం తెచ్చే వ్యూహం పాటిస్తోందని చెప్పవచ్చు.

Amazon కూడా
ఇదే సమయంలో Amazon కూడా మిడిల్ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగులను తొలగించగా, Microsoft మరో సారి ఉద్యోగ కోతలపై పరిశీలిస్తోంది. అంటే టెక్ దిగ్గజాలన్నీ “తక్కువ ఖర్చుతో ఎక్కువ చేయాలి” అన్న దిశగా వెళ్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×