Sobhitha: బుల్లితెర పై సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోయిన సీరియల్స్ లలో కార్తీక దీపం కూడా ఒకటి. ఈ సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయిన మోనిత పాత్రలో నటించింది శోభిత శెట్టి. ఈ సీరియల్ ద్వారా ఫెమస్ అయిన ఈమె బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, సీరియల్స్ లో కాదు, రియల్ లైఫ్ లో విలన్ అనే రేంజ్ లో నెగటివిటీ ని సంపాదించుకొని బయటకు వెళ్ళింది. అదే విధంగా ఈమెని అభిమానించే వాళ్ళు, బలమైన అమ్మాయి అని పొగిడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె సీరియల్స్ చెయ్యలేదు. ఇటీవల కార్తీకదీపం 2 మొదలైంది అందులో శోభిత క్యారెక్టర్ లో వేరొకరు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వీడియోలను ఫోటోలను షేర్ చేస్తూ పాపులారిటిని పెంచుకుంటుంది.. తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఓ షోలో పాల్గొంది.. ఆ షోలో ఆమెకు దారుణమైన అవమానం జరిగింది. అదేంటో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం..
శోభాశెట్టి ఎక్కడ అడుగు పెడితే అక్కడ గొడవ..
శోభ శెట్టి బిగ్ బాస్ తో ఫైర్ బ్రాండ్ అని ట్యాగ్ని తగిలించుకుంది. ఈమె ఏ షోలు అడుగుపెడితే అక్కడ గొడవలే జరుగుతాయని తెలిసిందే. ఈసారి మాత్రం బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కోపం తెచ్చుకోవడం తో అలిగి షో నుండి వెళ్ళిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రతీ వారం జీ తెలుగులో సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ అనే ప్రోగ్రాం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ షోలో చాలా మంది సీరియల్ యాక్టర్స్ పాల్గొంటున్నారు.. ఈ షో కారణంగానే సుడిగాలి సుధీర్, యాంకర్ రవి గతంలో వివాదాల్లోకి చిక్కుకున్నారు. అయితే యాంకర్ రవి ఈ షో నుండి తప్పుకోవడంతో ఆయన స్థానంలోకి అర్జున్ అంబటి వచ్చాడు. ఈ షోకి సంబంధించిన ప్రోమో ని విడుదల చేయగా అది బాగా వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇందులో ప్రభాకర్, శోభా మధ్య పెద్ద వార్ జరుగుతుంది.
Also Read : రాజ్ తరుణ్ చేసిన మిస్టేక్ ఇదే.. అడ్డంగా దొరికిపోయాడు..
అసలు గొడవ ఎందుకు జరిగింది..?
ఈ షోకు శోభా శెట్టి ఎన్నాళ్ళో వేచిన హృదయం సీరియల్ తరపున గెస్టుగా వచ్చింది. చామంతి’ సీరియల్ తరుపున ప్రభాకర్ వచ్చి గేమ్స్ ఆడాడు. ఇక పాపాల రాయుడు గా ఆయన తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ ని అందించాడు. అయితే శోభా శెట్టి ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఎంతసేపు ఆపుతారయ్య.. ఎందుకు గేమ్..తీసి దొబ్బంది అవతలకి అని అరుస్తాడు. అప్పుడు శోభా శెట్టి మాట్లాడుతూ మీరు కంటెంట్ కోసం ఇలా అరవడం వంటివి చేస్తే, నాకు అందులో ఎలాంటి ఆసక్తి లేదు అని అంటుంది. నేను కంటెంట్ ను ఎలాగైనా ఇస్తాను నువ్వు నా కంటెంట్ కి అవసరం లేదు అని మొఖాన్నే చెప్పేస్తాడు. ఇక ఒకరికి ఒకరు వాదనలు వేసుకుంటూ ఉండడంతో శోభా శెట్టి అలిగి షో నుండి వాకౌట్ అయ్యింది. గేమ్ ఆడలేనప్పుడు ఎందుకు సపోర్టుగా రావడం అంటూ యాంకర్ అషు రెడ్డి కామెంట్ చేస్తుంది.. దాంతో ఈ షో పెద్ద రచ్చగా మారుతుంది. ప్రస్తుతం మీకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది..