E-Paper
Advertisement

OTT Movie : స్మశానంలో శవాలు తవ్వే సైకో… ఆ ఊళ్ళో ఆడపిల్లలు పుడితే అంతే సంగతులు… క్రేజీ కన్నడ మిస్టరీ థ్రిల్లర్

OTT Movie :  స్మశానంలో శవాలు తవ్వే సైకో… ఆ ఊళ్ళో ఆడపిల్లలు పుడితే అంతే సంగతులు… క్రేజీ కన్నడ మిస్టరీ థ్రిల్లర్
Advertisement

OTT Movie : దెయ్యాల సినిమాలను చూస్తున్నప్పుడు వచ్చే థ్రిల్ వేరే సినిమాలను చూసినప్పుడు కనిపించదు. ఆడియన్స్ ని భయపెట్టడానికి ఈ సినిమాలలో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా విజువల్ ఎఫ్ఫెక్ట్స్ తో గుండెల్లో గుబులు పుట్టిస్తుంటారు మేకర్స్. అలా భయపెట్టిన ఓ కన్నడ హారర్ సినిమా గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ సినిమాకి గత ఏడాది థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏడాది ఓటీటీలో కూడా హల్చల్ చేసింది. ఈ కథ ఒక గ్రామంలో ఆడ పిల్లలు పుట్టిన వెంటనే, ఆ ఇంట్లో ఒక వృద్ద మహిళ చనిపోతుంటుంది. ఈ రహస్యం కనిపెట్టే ప్రయత్నంలో స్టోరీ ఉత్కంఠంగా నడుస్తుంది. ఒక దెయ్యం ఎంట్రీతో క్లైమాక్స్ వరకూ గూస్ బంప్స్ వస్తుంటాయి. హారర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

అవినాష్ N. దర్శకత్వంలో వచ్చిన ఈ కన్నడ సూపర్‌ నాచురల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘హగ్గ'(Hagga). ఇందులో అను ప్రభాకర్, హర్షిక పూణచ్చ, తబల నాని లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2024 సెప్టెంబర్ 20న రిలీజ్ అయింది. 2025 జూన్ 27 నుంచి Watcho ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఐయండిబిలో ఈ సినిమా 7.8/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే

Advertisement

ఒక మారుమూల గ్రామంలో వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి. అక్కడ ఆడపిల్ల పుట్టిన ప్రతిసారీ ఆ ఇంట్లోని ఒక వృద్ధ మహిళ హఠాత్తుగా మర్మమైన రీతిలో చనిపోతుంటుంది. ఆ శవం హగ్గ (త్రాడు)తో మెడకు చుట్టుకుని లాగి ఉరేసినట్టు కనిపిస్తుంది. ఇలాంటి వరుస మర్డర్లు జరగడంతో గ్రామస్తులు భయంతో వణికిపోతుంటారు. రామన్న అనే వ్యక్తి ఈ సంఘటనలను గమనించి, ఒక జర్నలిస్ట్ సహాయంతో ఈ మిస్టరీని ఛేదిస్తాడు. వాళ్లు కనుగొన్నది ఏమిటంటే, ఇది రెండు శక్తుల మధ్య జరుగుతున్న ఘోరమైన యుద్ధంగా గుర్తిస్తారు. ఒక శక్తి అదే గ్రామానికి చెందిన సావిత్రి అనే మహిళ ఆత్మ. ఆమె గతంలో భరించిన దారుణమైన అన్యాయం వల్ల ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటుంది. ఆడపిల్లలు ఇంటికి అశుభం అని ఆమెను, ఆమె బిడ్డను హింసించి చంపేస్తారు. ఇది ఆ గ్రామంలో ఒక సంప్రదాయంగా నడుస్తుంటుంది.

Read Also : ఒకే అమ్మాయితో ఇద్దరబ్బాయిలు… మస్ట్ వాచ్ మలయాళ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

Advertisement

ఆ ట్రాజెడీ వల్ల ఆమె ఆత్మ హగ్గతో ప్రతీకారం తీర్చుకుంటూ, ఆడపిల్ల పుట్టినప్పుడు వృద్ధ మహిళలను (ఆ సంప్రదాయానికి కారణమైనవాళ్లను) చంపేస్తుంది. మరో శక్తి సావిత్రి ఆత్మను ఎదుర్కొని పోరాడుతుంది. ఇద్దరి మధ్య పాత శత్రుత్వం ఉంటుంది. రామన్న ఈ రెండు శక్తుల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని అర్థం చేసుకుని, సావిత్రి ఆత్మను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు. క్లైమాక్స్‌లో రెండు శక్తుల మధ్య ఘోర పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో ఏ శక్తి గెలుస్తుంది ? ఈ శక్తుల మధ్య వైరం ఏంటి ? రామన్న సావిత్రి ఆత్మను శాంతింప జేస్తాడా ? ఆ గ్రామంలో చావులు ఆగుతాయా ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ కన్నడ సూపర్‌ నాచురల్ హారర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.

 

 

Related News

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×