OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలు రకరకాల స్టోరీలతో భయపెట్టడానికి వస్తుంటాయి. చాలా సినిమాలలో దయ్యాలను ఏదో ఒక రూపంలో మనుషులకి అంటగడుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఓయిజా బోర్డుతో గేమ్ ఆడి దయ్యాన్ని ఆహ్వానిస్తాru. ఆ దయ్యం ద్వారా సహాయం పొందటానికి ఇలా చేస్తారు. ఆ తర్వాత ఈ స్టోరీ ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఈ మూవీ ప్రేక్షకుల్ని భయపెట్టిస్తూ, చివరి వరకు ఆసక్తికరంగా సాగిపోతూ ఉంటుంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ మలేషియన్ తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘పూచండి’ (Poochand). 2022 లో విడుదల అయిన ఈ సినిమాకు Jk Wicky దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒక జర్నలిస్ట్ అయిన మురుగన్ చుట్టూ తిరుగుతుంది. అతను నిజమైన దెయ్యం కథల కోసం మలేషియాకు వెళ్తాడు. అక్కడ అతను శంకర్ అనే వ్యక్తిని కలుస్తాడు. అతను తన స్నేహితులైన అన్బు, గురుతో కలిసి అనుభవించిన ఒక భయంకరమైన పారానార్మల్ సంఘటన గురించి ఇతనికి వివరిస్తాడు. ఇప్పుడే అసలు స్టోరీ మొదలు అవుతుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
కథలో అన్బు అనే వ్యక్తి ఒక పక్షవాత రోగిగా ఉంటాడు. ఇతడు పాత నాణేలను ఎక్కువగా సేకరిస్తుంటాడు. ఒక రోజు శంకర్, గురు, అన్బు సేకరించిన ఒక పురాతన నాణెంతో ఓయిజా బోర్డ్ ఆడతారు. దీని ద్వారా వారు ఒక ప్రమాదకరమైన ఆత్మను ఆహ్వానిస్తారు. తమ సొంత కోరికలను నెరవేర్చడానికి ఈ ఆత్మను పిలుస్తారు. ఈ ఆత్మ వచ్చాక అనకోని సంఘటనలు జరుగుతాయి. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, వారు ఈ ఆత్మ గత చరిత్రను తెలుసుకుంటారు. ఈ క్రమంలోన శతాబ్దాల నాటి ఒక చీకటి రహస్యం బయటపడుతుంది. చివరికి వీళ్ళకు ఆత్మ సహాయం చేస్తుందా ? ఆత్మ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ? ఈ ఆత్మ గత చరిత్ర ఏమిటి ? మురుగన్ వీటి గురించి ఏం తెలుసుకుంటాడు. ఈ విషయాలను, ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి. ఈ సినిమా ‘Poochandi’ అనే తమిళ పదాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఇది దక్షిణ భారతదేశంలో పిల్లలను భయపెట్టడానికి ఉపయోగించే ఒక బూచోడు అనే పదాన్ని సూచిస్తుంది. ‘పూచండి’ అనేది 3 నుండి 6వ శతాబ్దం మధ్య కాలంలో శివ భక్తులతో ముడిపడి ఉంది. ఇందులో మలేషియన్ తమిళ సంస్కృతి కనిపిస్తుంది. ఈ సినిమా మలేషియా, సింగపూర్‌లో జనవరి 27, 2022 న రిలీజ్ చేశారు. తమిళనాడులో ఏప్రిల్ 1, 2022న విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ (Netflix) లో నవంబర్ 11, 2022 నుంచి అందుబాటులోకి వచ్చింది.
Read Also : తల్లిని చంపి కూతుర్ని ఇష్టపడే సైకో … ఊరంతా వాడేసిన అమ్మాయితో … వామ్మో ఇది మామూలు సినిమా కాదయ్యా