Buchi Babu Sana: ఒకప్పుడు ఎక్కువగా సినిమాల ఎక్స్‌పీరియన్స్ లేని దర్శకులతో పనిచేయడానికి స్టార్ హీరోలు పెద్దగా ఒప్పుకునేవారు. కానీ ఈరోజుల్లో ఎక్కువగా సినిమాల అనుభవం ఉందా, ఇంకా డెబ్యూ అయ్యిందా కాలేదా అనే విషయాన్ని కూడా ఆలోచించకుండా కథ నచ్చితే కొత్త దర్శకులతో సైతం పనిచేయడానికి ఒప్పుకుంటున్నారు స్టార్లు. అలా రామ్ చరణ్ కూడా దర్శకుడు బుచ్చి బాబుతో కలిసి పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీరి కాంబినేషన్‌లో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతుండగా తాజాగా దీనికి సంబంధించిన విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు దర్శకుడు.
అప్పుడే కథ రాసుకున్నాను
‘‘నేనెప్పుడూ మన ఆచారాల గురించి చెప్పే కథలను చెప్పాలని అనుకుంటాను. ఎందుకంటే అలాంటి సందర్భాలు, ఎమోషన్‌తో ప్రేక్షకులకు కనెక్ట్ అవుతారని భావిస్తాను. పైగా అలాంటి కథల వల్ల అందరూ చాలా ప్రభావితం అవుతారు. అలాంటి కథలు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలవు. కోవిడ్ వల్ల అసలు నా సినిమా ఉప్పెన థియేటర్లలో విడుదల అవుతుందా లేదా అని చాలా భయపడ్డాను. థియేటర్లు మూసేయడం వల్ల సినిమాలన్నీ ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. అలా అసలు నేను ఈ ఇండస్ట్రీలో ఉండగలనా లేదా అని చాలా భయపడ్డాను. అప్పుడే నేను కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా పెద్ది కథ రాసుకున్నాను’’ అని చెప్పుకొచ్చాడు బుచ్చిబాబు (Buchi Babu).
అదే జరిగింది
‘‘ముందుగా పెద్ది కథను సుకుమార్‌కు వినిపించాను. ఆయనే ఈ కథను రామ్ చరణ్‌కు వినిపించమని నాకు చెప్పారని షాకయ్యారు. చరణ్‌కు కథ వినిపించగానే వెంటనే ఆయన క్యారెక్టర్‌కు, కథకు కనెక్ట్ అయ్యారు. నేను కథ చెప్తున్నంత సేపు చాలా శ్రద్ధగా విన్నారు. అలా మొదటి సిట్టింగ్‌లోనే చిన్న చిన్న మార్పులతో కథను ఓకే చేశారు. నేను పెద్ది కథ రాయడం మొదలుపెట్టే ముందు మా ఊరిలోని రామాలయంలో కూర్చొని నేను రెండో సినిమా తెరకెక్కించగలిగితే అందులో హీరో క్యారెక్టర్ పేరు పెద్ది అని పెడతానని మాటిచ్చాను. పెద్ది సినిమా కోసం అన్నీ అనుకున్నట్టు జరిగినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. అది దేవుడి పవర్. నేను చాలా ఆధ్యాత్మిక వ్యక్తిని. దేనికోసం అయినా మనస్ఫూర్తిగా కష్టపడితే అది జరుగుతుందని నమ్ముతాను’’ అని తన నమ్మకాన్ని బయటపెట్టాడు.
Also Read: ఆశకు పోయి బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న మృణాల్.. ఇలా అయితే కష్టమే.?
చాలా ఇబ్బందిపడ్డాను
‘‘చరణ్ చాలా ఆధ్యాత్మిక వ్యక్తి. తను ఆధ్యాత్మిక పుస్తకాలు చాలా చదువుతారు. మేము దేవుడికి సంబంధించి, మైథలాజీకి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకుంటాం. ఆయనకు ఈ సబ్జెక్ట్‌పై చాలా అవగాహన ఉంది. నా పుట్టినరోజుకు రామ్ చరణ్ ఇచ్చిన గిఫ్ట్ నాకు చాలా స్పెషల్. ఆయన ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా చాలా ఒదిగి ఉంటారు. పెద్ది (Peddi) ఫస్ట్ షాట్ విడుదల సమయానికి చిరంజీవి కూడా ఇంట్లోనే ఉన్నారు. నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. రామ్ చరణ్ (Ram Charan) పెద్ది ఫస్ట్ షాట్‌ను పెద్ద సౌండ్ పెట్టి అందరికీ చూపించారు. నా జీవితంలో అది మర్చిపోలేని మూమెంట్’’ అని గుర్తుచేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాడు బుచ్చిబాబు.