OTT Movie : పోలీస్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఇటువంటి సినిమాలు, అన్ని భాషలలో హిట్ టాక్ తో దూసుకుపోయాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తమిళ సినిమాలో, సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తారు. ఈ మూవీలో శరత్‌కుమార్ పోలీస్ పాత్రకి జీవం పోశాడు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
సోనీ లివ్ (Sony liv) లో
ఈ తమిళ థ్రిల్లర్ మూవీ పేరు ‘పోర్ థోజిల్’ (Por Thozhil). 2023 లో విడుదలైన ఈ మూవీకి విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించారు. ఇందులో శరత్‌కుమార్, అశోక్ సెల్వన్, నిఖిల విమల్ కీలక పాత్రల్లో నటించగా, నిజాల్‌గల్ రవి, సునీల్ సుఖద, సంతోష్ కీజాత్తూర్ సహాయక పాత్రల్లో నటించారు. దీనికి జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. ‘పోర్ థోజిల్’ 2023 జూన్ 9న థియేట్రికల్ గా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సోనీ లివ్ (Sony LIV) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఒక సీరియల్ కిల్లర్ చేసే దారుణమైన హత్యలు స్థానిక పోలీసులను కలవర పెడుతుంటాయి. ఇన్వెస్టిగేషన్ కోసం ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ కు పంపుతారు. ఈ కేసులో పని చేయడానికి DSP ప్రకాష్, SP లోగనాథన్ ను అధికారులు నియమిస్తారు. వీరితో పాటు సాంకేతిక సహాయకురాలుగా వీణ పని చేస్తుంది. ప్రకాష్ భయంతో కూడిన వ్యక్తి, పైగా కొత్తగా డ్యూటీ లోకి రావడంతో, అతనికి అసలు ఇన్వెస్టిగేషన్ మీద అవగాహన ఉండదు.
లోగనాథన్ మాత్రం ఒంటరిగా పని చేయడానికి ఇష్టపడే ఒక కఠినమైన అధికారిగా ఉంటాడు. వీరిద్దరి వ్యక్తిత్వాలు విభిన్నంగా ఉండటంతో, మొదట్లో వారి మధ్య సఖ్యత లేకపోయినా ఈ కేసు పరిష్కారం కోసం కలిసి పని చేయవలసి వస్తుంది. ఈ కేసులో చనిపోయిన వాళ్ళకు ఒకరితో ఒకరికి సంబంధం ఉండకపోవడంతో కేసు విచారణ కష్టంగా మారుతుంది.
ప్రకాష్, లోగనాథన్ దర్యాప్తులో ముందుకు సాగుతున్నప్పుడు, హంతకుడు పోలీసులతో సంబంధం ఉన్న వ్యక్తులను టార్గెట్ చేయడం ప్రారంభిస్తాడు. ఆ తరువాత విచారణలో హంతకుడు స్థానిక NGO లో టీచర్‌గా పని చేసే వ్యక్తి అని తెలుస్తుంది. అతని చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు అతన్ని ఈ దారుణమైన హత్యలకు ప్రేరేపిస్తాయి.
Read Also : పోలీసులకు చెమటలు పట్టించే దొంగతనం కేసు… సర్ప్రైజింగ్ ట్విస్టులతో మెంటలెక్కించే మలయాళం క్రైమ్ థ్రిల్లర్
హంతకుడు ఈ సారి వీణను టార్గెట్ గా ఎంచుకున్నాడని పోలీసులు గుర్తిస్తారు. చివరికి ఆ కిల్లర్ ని పోలీసులు పట్టుకుంటారా ? వీణ ప్రాణాలతో బయట పడుతుందా ? కిల్లర్ కి చిన్నప్పుడు తగిలిన మానసిక గాయాలు ఏంటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ తమిళ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.