OTT Movie : ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక కావలసిన జానర్లో సినిమాలు చూసే ఎంజాయ్ చేసే అవకాశం బాగా పెరిగింది మూవీ లవర్స్ కి. థియేటర్లకు వెళ్లే పని లేకుండా హ్యాపీగా ఇంట్లోనే కూర్చుని, ఫ్యామిలీ అంతా ఎంచక్కా చూడాలనుకున్న సినిమాను చూడొచ్చు. ఇక బోర్ కొట్టిందో క్రైమ్ థ్రిల్లర్ సినిమాల వైపు మళ్లుతుంది మనసు. ఇక ఓటీటీలో ఇలాంటి సినిమాలకు కొదవేమీ లేదు. ఈ జానర్లో సినిమాలను వెతుకుతున్న వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఈ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ హిందీ సినిమా పేరు ‘పోషం పా’ (Posham Pa). ZEE5 ఒరిజినల్ ఫిల్మ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. 2019 ఆగష్టులో విడుదలైంది. ఇందులో మహీ గిల్ (ప్రజక్త), సాయనీ గుప్తా (రేఘా సాథే), రాగిణీ ఖన్నా (శిఖా దేశ్‌పాండే), శివానీ రఘువంశీ, ఇమాద్ షా తదితరులు నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ZEE5, Airtel Xstream Playలో అందుబాటులో ఉంది. IMDbలో 6.2 రేటింగ్ తెచ్చుకున్న ఈ గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.
కథలోకి వెళ్తే…
‘పోషం పా’ మూవీ 1990లో మహారాష్ట్రలో జరిగిన నిజమైన సిస్టర్స్ కేసు ఆధారంగా రూపొందింది. ఇది అంజనాబాయి గావిట్ (మహీ గిల్), ఆమె కుమార్తెలు సీమా గావిట్ (సాయనీ గుప్తా), రేణుకా షిండే (రాగిణీ ఖన్నా) చుట్టూ తిరుగుతుంది. “పోషం పా” అనే నర్సరీ రైమ్‌తో ప్రారంభమవుతుంది. వాళ్ళు 40 మందికి పైగా పిల్లలను కిడ్నాప్ చేసి, 12 మందిని హత్య చేశారు. కథ డాక్యుమెంటరీ స్టైల్‌లో సాగుతుంది. ఇద్దరు డాక్యుమెంటరీ మేకర్స్ (శివానీ రఘువంశీ, ఇమాద్ షా) ఈ మహిళల జీవితాలను, నేరాలను, ఆ అమ్మాయిల మానసిక స్థితిని, నేరాల వెనుక ఉన్న ఉద్దేశ్యాలను ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు.
Read Also : ఫ్రీగా వచ్చింది కదాని కక్కుర్తి పడితే, అందంగా చంపేసే అద్దం… అల్టిమేట్ హర్రర్ మూవీ
తల్లి తన కుమార్తెలు రేఘా, శిఖాను నేర జీవితంలోకి లాగి, పిల్లలను కిడ్నాప్ చేసి… దొంగతనం, హత్యలు చేయమని బలవంతం చేస్తుంది. వారు బిచ్చగాళ్ల పిల్లలను లక్ష్యంగా చేసుకుని, ఉపయోగపడరని తెలిశాక హత్య చేస్తారు. చివరకు 1996లో వాళ్ళు అరెస్ట్ అవుతారు. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు చివరికి ఎలా ఎండ్ అయ్యింది ? సొంత తల్లే తన కూతుర్లతో ఇంతటి దారుణమైన పని ఎందుకు చేయించింది ? పిల్లలను కిడ్నాప్ చేసి ఏం చేసేవారు? ఎందుకు చంపారు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.