E-Paper
Advertisement

OTT Movie : గబ్బిలం దేవుడి కథ…. స్పానిష్ అడల్ట్ యానిమేటెడ్ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

OTT Movie : గబ్బిలం దేవుడి కథ…. స్పానిష్ అడల్ట్ యానిమేటెడ్ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement

OTT Movie : స్పానిష్ అడల్ట్ యానిమేటెడ్ చిత్రం ‘అజ్టెక్ బ్యాట్‌మ్యాన్: క్లాష్ ఆఫ్ ఎంపైర్స్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇది DC కామిక్ పాత్ర అయిన బ్యాట్‌మ్యాన్ ఆధారంగా రూపొందింది. బాక్స్ ఆఫీస్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా $663 మిలియన్లు వసూలు చేసింది. ఈ యానిమేటెడ్ చిత్రం సెప్టెంబర్‌లో US థియేటర్లలో విడుదలై ఎనిమిదవ స్థానంలో నిలిచింది. అంతే కాకుండా అత్యధిక వసూళ్లు చేసిన నాల్గవ యానిమేటెడ్ చిత్రంగా కూడా నిలిచింది. ఈ కథ యోహువల్లి అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతని తండ్రి మరణానికి రివేంజ్ గా అతను గబ్బిల దేవుడి దగ్గర శిక్షణ పొంది, ముసుగు ధరించిన హీరోగా మారుతాడు. ఆ తరువాత అసలు స్టోరీ మొదలవుతుంది. ఇది ఏ ఓటీటీలోకి వస్తుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఈ స్పానిష్ అడల్ట్ యానిమేటెడ్ చిత్రం ‘అజ్టెక్ బ్యాట్‌మ్యాన్: క్లాష్ ఆఫ్ ఎంపైర్స్’ (Aztec Batman: Clash of Empires) 2025 నవంబర్ 23 నుంచి Jio Hotstarలో అందుబాటులోకి రానుంది. ఇందులో హొరాసియో గార్సియా రోజాస్ బ్యాట్‌మ్యాన్ టైటిల్ పాత్రను పోషిస్తుండగా, ఒమర్ చాపారో జోకర్‌గా కనిపిస్తారు. ఇది తెలుగులో కూడా అందుబాటులోకి వస్తోంది.

ఈ కథ ఏమిటంటే

Advertisement

ఈ కథ 1519లో అజ్టెక్ రాజ్యంలో మొదలవుతుంది. యోహువాల్లీ అనే యువకుడు తన తండ్రితో ఒక గ్రామంలో సంతోషంగా ఉంటాడు. ఒక్కసారిగా స్పానిష్ దండయాత్రికుడు హెర్నాన్ కార్టెస్ గుండాలతో వచ్చి గ్రామాన్ని దోచుకుంటాడు. అతని తండ్రిని కత్తితో పొడిచి చంపేస్తాడు. యోహువాల్లీ భయపడి అక్కడి నుంచి పారిపోయి, అజ్టెక్ రాజధాని టెనోచ్టిట్లాన్‌కి చేరుకుంటాడు. అక్కడ రాజు మోక్టెజుమా II, మంత్రి యోకాని కలిసి స్పానిష్ దండు వస్తుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు. కానీ యోకా అతన్ని పట్టించుకోడు. నిజానికి యోకా కార్టెస్‌తో సీక్రెట్ ఒప్పందం చేసి, అజ్టెక్ రాజ్యాన్ని ద్రోహం చేయాలని ప్లాన్ చేస్తుంటాడు.

Read Also : అమ్మాయిల వరుస హత్యలు… ఆ పార్ట్స్ కోసి చంపే సైకో… బ్రూటల్ మర్డర్ మిస్టరీ

Advertisement

ఇది తెలుసుకున్న యోహువాల్లీ బ్యాట్ దేవుడు త్జినాకాన్ ఆలయంలో శిక్షణ తీసుకుంటాడు. ప్రత్యేక మాస్క్, ఆయుధాలు తయారు చేసుకుని, “బ్యాట్‌మ్యాన్” అవతారం ఎత్తుతాడు. రాత్రి పూట స్పానిష్ సైనికులపై దాడులు చేస్తూ తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకోవడం మొదలెడతాడు. ఈ సమయంలో జాగ్వార్ అనే అమ్మాయి (క్యాట్‌వుమన్ లాంటి హీరోయిన్) అతనికి సపోర్ట్ చేస్తుంది. ఆమె కూడా స్పానిష్‌లను ద్వేషిస్తుంటుంది. అలా రాత్రుళ్లు స్పానిష్ సైన్యంపై దాడులు చేస్తూ, రాజ్యాన్ని, ప్రజలను కాపాడుతూ తన ప్రతీకారాన్ని కూడా తీర్చుకుంటాడు.

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×