Akkada Ammayie Ikkada Abbayie OTT: బుల్లితెరపై మేల్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju).. బుల్లితెరపై పలు షోలు చేసి మెప్పించిన ఈయన హీరోగా కూడా అడుగుపెట్టారు. “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?” అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రదీప్, తన రెండో ప్రయత్నంగా చేసిన చిత్రమే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ప్రదీప్ తో పాటు పలు షోలతో మెరిసిన దీపికా పిల్లి (Deepika pilli) ఇందులో హీరోయిన్ గా నటించారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తొలి చిత్రం పేరుతోనే ఈ సినిమా రూపొందించడం గమనార్హం. సినిమా టైటిల్ తోనే ప్రేక్షకులలో కాస్త ఆసక్తి పెరిగింది. అలా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన ప్రదీప్ మూవీ..
ఇకపోతే థియేటర్లలో విడుదలైన నెల రోజులు పూర్తికాకుండానే ఇటు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధమయ్యింది. తెలుగు ఓటీటీ వేదిక అయిన ఈటీవీ విన్ లో మే 8వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈటీవీ విన్ పోస్టర్ కూడా పంచుకుంది. మొత్తానికి అయితే మరో వారం రోజుల్లో ఓటీటీలోకి రాబోతుండడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కథ విషయానికి వస్తే..
కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) సివిల్ ఇంజనీర్. తన బాస్ ఆదేశాలతో భైరిలంక అనే ఊర్లో మరుగుదొడ్లు కట్టేందుకు డ్రైవర్ బిలాల్ (సత్య) తో కలిసి వెళ్తాడు. ఆ ఊరిది ఒక విచిత్రమైన చరిత్ర. 30 ఏళ్ల కిందట వర్షాలు లేక కరువు తాండవిస్తున్న దశలో ఒక అమ్మాయి పుడుతుంది. అమ్మాయి పుట్టగానే వర్షాలు పడతాయి. ఊరి కష్టాలు కూడా తొలగిపోతాయి. ఆ అమ్మాయికి రాజకుమారి (దీపిక ) అనే పేరు కూడా పెడతారు. పెద్దయ్యాక కూడా ఆమె ఊరు దాటి వెళ్లడానికి వీళ్లేదని, ఊళ్లో ఉన్న 60 మంది కుర్రాలలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఊరు పెద్ద తీర్పు ఇస్తాడు. అందుకు రాజకుమారి తల్లిదండ్రులు కూడా అంగీకారం చెబుతారు. ఇక కాలంతోపాటు ఆమె కూడా పెరిగి పెద్దదవుతుంది. ఆమె మనసును గెలుచుకోవడానికి ఊరి కుర్రాళ్లంతా పోటీ పడుతూ ఉంటారు. ఆమెఏం చెబితే అది చేస్తూ ఉంటారు. బయట నుంచి ఒక్కరు కూడా ఊర్లోకి రాకుండా చూసుకుంటూ ఉంటారు.అలాంటి పరిస్థితుల్లో ఊర్లోకి వచ్చిన ఇంజనీర్ కృష్ణ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు..? రాజకుమారిని ఎలా ప్రేమించారు..? వూరి కట్టుబాట్లు కాదని, వీరు ఎలా ఒక్కటయ్యారు..? రాజకుమారి కోసమే చూస్తున్న 60 మంది కుర్రాళ్ళు ఏం చేశారు.? అనే విషయాన్ని చాలా చక్కగా చూపించారు మొత్తానికైతే చిన్న సినిమాగా వచ్చినా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం మే 8వ తేదీ నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవడానికి సిద్ధమవుతోంది.
Summer Just Got Hotter
Presenting the Blockbuster Bonanza of May on @etvwin!(1/2) pic.twitter.com/1OS2VU5c7I
— ETV Win (@etvwin) May 1, 2025