Singer Pravasthi : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. సినీ కార్మికుల పక్షపాతిగా నిలిచి వారికి అండగా వుంటారు. ఈయన సినిమాకి సంబంధించిన అన్ని కార్యక్రమాలలో ముందుంటారు. ఆయన దర్శకత్వంలో ఎన్నో సినిమాలు రూపుదిద్దుకున్నాయి. మరెన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా సింగర్ సునీత, ప్రవస్తి, పాడుతా తీయగా కార్యక్రమం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వారిని ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం..
గొప్ప సింగర్ కాదు …అందుకే తీసేసారు ..
పాడుతా తీయగా కార్యక్రమం పై సింగర్స్ ని ఉద్దేశించి, ప్రవస్తి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ విషయంపై ప్రముఖ నిర్మాత, తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నాకు తెలిసి పాడుతా తీయగా బాలు గారు స్టార్ట్ చేసినప్పుడు అది కాంపిటీషన్ కార్యక్రమంగా కాకుండా, ఎంతోమంది సింగర్స్ ని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడం షార్ట్ చేశారు. ఇక ప్రవస్తి ఏదో కార్యక్రమంలో కూడా తనని తీసేశారు అని చెప్పింది. తీసేయడం ఆ అమ్మాయికి కొత్త ఏం కాదు, గొప్ప సింగర్ కాదు కాబట్టి తీసేశారు. ఇప్పుడు కూడా అలానే జరిగింది. ఎప్పుడు కూడా టీఆర్పీని బట్టి ప్రొడ్యూసర్ ఎవరిని హైప్ చేయాలి, ఎవరిని డౌన్ చేయాలి అన్నది చూసుకుంటూ ఉంటాడు. టీఆర్పీ గ్రాఫ్ ని బట్టి అసలు మొత్తం వ్యవహారం ఉంటుంది. ఆ అమ్మాయి జడ్జిల పై ఆరోపణలు చేసింది. అసలు జడ్జిలకి ఈ విషయంతో సంబంధం ఉండదు. సంగీత పరిజ్ఞానం ఎక్కువగా ఉన్న జడ్జిలు కాబట్టి సునీత, ఎవరైనా కానీ ఆ పాట లోటుపాట్లు గమనించి చెప్తారు. ఈ అమ్మాయి పై కోపంతో అలా చెప్పారు కదా అని ఆయన మాట్లాడారు.
సునీత కె దిక్కు లేదు ..ఇక ప్రవస్తి కి ఆఫర్స్ ఎలా వస్తాయి ..
ఇక సునీత ప్రవస్తిని షోలో నుంచి తీసేయమని చెప్పదు, అలా చెప్తే ఏం లాభం ఉంటుంది. ఏదో మిస్ అండర్స్టాండింగ్ వల్ల జరిగిందే కానీ, సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ప్రవస్తి ఈ పాట నన్ను పాడనివ్వట్లేదు అనే ఆరోపణకి.. సునీత చెప్పినట్లు కొన్ని కంపెనీలతో టైఅప్ అయి ఉండడం వల్ల కొన్ని పాటలు వద్దని ఉండొచ్చు, ఇక సినిమాలలో పాటలు పాడడం గురించి చెప్పాలంటే ఈ రోజుల్లో ఎవరికి ఆఫర్స్ ఎక్కువగా రావట్లేదు. సునీత కు సినిమాల్లో పాటలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు, సునీత కే దిక్కులేదు. ఇక సంవత్సరానికి నాలుగు ఐదు పాటలు పాడితే ఎక్కువ, ఒకప్పుడు నెలకి 15 పాటలు పాడేది, ఇప్పుడు ఆవిడకే దిక్కు లేదు. ఇక ప్రవస్తికి సునీత ఆఫర్స్ లేకుండా ఎలా చేస్తుంది. ఏదైనా సినిమా ఆఫర్ వస్తే నాతో పాడించండి అని అడుగుతుంది. కానీ ప్రవస్థితో పాడించవద్దు అని చెప్పదు కదా, పెద్దపెద్ద సింగర్స్ కే అవకాశాలు రావట్లేదు అలాంటిది, ప్రవస్తి చెప్పేది కరెక్ట్ కాదు.. టాలెంట్ ఉంటే ఎవరికైనా ఆఫర్స్ వస్తాయి. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ ఉండాలి అని తమ్మారెడ్డి తెలిపారు. అయన పాడుతా తీయగా వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు. ఈ వీడియో చూసిన వారంతా ఆయన చెప్పే దాంట్లో నిజం ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
టాలెంట్ వుంటే చాలు ..
ఇక పాడుతా తీయగా కార్యక్రమంపై ఇందులో జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఎం ఎం కీరవాణి, చంద్రబోస్, సునీతలపై 19 ఏళ్ల సింగర్ ప్రవస్తి చేసిన కామెంట్స్ అందరికీ తెలిసినవే. ఆ తరువాత సింగర్ సునీత రియాక్ట్ అయ్యి వీడియో ద్వారా సమాధానం ఇచ్చారు. ప్రవస్థి సునీత వీడియో తర్వాత కూడా ఆమెపై ప్రశ్నలు వర్షం కురిపిస్తూ మరొక వీడియోను బయటకు వదిలింది. ఆ వీడియోకి సమాధానంగా సింగర్ సునీత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రవస్తి నీ ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఈ వ్యవహారం ఇలా జరుగుతున్న టైం లో ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ పాడుతా తీయగా షో గురించి, బాలు గారు దీనిని కాంపిటీషన్ లా కాకుండా సింగర్స్ ని పరిచయం చేసే వేదికగా స్టార్ట్ చేశారని, ఆయన స్ఫూర్తితో ఈ షోని ముందుకు తీసుకువెళ్లాలి అని, ఇక్కడ టాలెంట్ ఉంటే సరిపోతుందని.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అని తెలిపారు.
Jabardast Faima : పటాస్ ప్రవీణ్ కి నాకు మధ్య జరిగింది ఇదే, ఆసక్తికర విషయాలు రివీల్ చేసిన ఫైమా