India’s Most Beautiful Train Journeys: దేశంలో ఎన్నో అద్భుతమైన రైల్వే మార్గాలు ఉన్నాయి. కానీ, కొన్ని రైల్వే మార్గాల్లో ప్రయాణిస్తుంటే అసలు దిగాలనిపించదు. ఒకవైపు ఎత్తైన కొండలు, మరోవైపు లోతైన లోయలు, ఇంకోవైపు సముద్రపు అలలు, పచ్చని అడవులు కిటికీలోంచి కనిపిస్తుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. దేశంలో ప్రకృతి అందాల మధ్యగా వెళ్లే ఎన్నో అద్భుతమైన రైలు మార్గాలు ఉన్నాయి. వాటిలో ఐదింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
తమిళనాడులోని రామేశ్వరం వెళ్లే ప్రయాణికులకు పంబన్ రైల్వే బ్రిడ్జ్ మర్చిపోలేను ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తుంది. ఈ బ్రిడ్జి సముద్రం ఉంటుంది. రైలు ఈ బ్రిడ్జి మీదుగా ప్రయాణిస్తుంటే, ఇరు వైపుల కనిపించే సముద్రం ఆహా అనిపిస్తుంది. జీవితంలో మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది.
మహారాష్ట్ర, గోవా, కర్ణాటక తీర ప్రాంతాలను మీదుగా కొనసాగే కొంకణ్ రైల్వే మార్గం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ మార్గంలో ప్రయాణిస్తుంటే పచ్చని కొండలు, నదులు, జలపాతాలు కనువిందు చేస్తుంటాయి. వర్షాకాలంలో ఈ ప్రాంతం పచ్చదనంతో మరింత అందంగా మారుతుంది.
బెంగాల్ లోని డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పర్యాటక రైలు మార్గం. ఇక్కడ నడిచే టాయ్ ట్రైన్స్ మరింత స్పెషల్. కొండల మధ్య మలుపులు తిరుగుతూ, టీ తోటల పక్క నుంచి సాగే ఈ ప్రయాణం ఎంతగానో ఆకట్టుకుంటుంది. మంచుతో కప్పుకున్న పర్వతాలు, పచ్చని ప్రకృతి ఈ రైలు ప్రయాణాన్ని మరింత అద్భుతంగా మార్చుతుంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా అందాలను చూడాలనుకునే వారికి కల్కా–సిమ్లా రైలు ప్రయాణం బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈ మార్గంలో రైలు బోలెడు మలుపులు తిరుగుతూ కొండలపైకి వెళ్తుంది. మార్గం మధ్యలో ఏకంగా 100కు పైగా టన్నెల్స్, పెద్ద సంఖ్యలో వంతెనలు కనిపిస్తాయి. పచ్చని కొండలు, లోయలు, చిన్న గ్రామాల మధ్య సాగే ఈ ప్రయాణం పర్యాటకులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది.
తమిళనాడులోని ఊటీకి వెళ్లే నీలగిరి మౌంటైన్ రైల్వే మరో అద్భుతమైన రైలు మార్గంగా చెప్పుకోవచ్చు. మెట్టుపాళయం నుంచి ఊటీ వరకు సాగే ఈ ప్రయాణంలో కొండలు, టీ తోటలు, అడవులు, లోయలు కనువిందు చేస్తాయి. పర్వత ప్రాంతాల్లో మేఘాలు తాకుతూ వెళ్తున్న అనుభూతి ప్రయాణికులను మంత్రముగ్ధులను చేస్తుంది.
Read Also: రాత్రి అయితే చాలు.. ఈ ప్రదేశాలు మరో ప్రపంచంలా మారిపోతాయి!