Prime Video Latest Releases : సినిమా, సిరీస్ ప్రేమికులకు గుడ్ న్యూస్. ప్రైమ్ వీడియోలో ఈ వారం మళ్లీ మంచి కంటెంట్ తో ఆడియన్స్ ను అలరిస్తోంది. ‘రాఖ్’ విడుదలకు ముందే… యాక్షన్, డ్రామా, రొమాన్స్, సస్పెన్స్ జానర్లలో నాలుగు కొత్త సినిమాలు, సిరీస్ లు ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం పదండి.
ఇదొక హార్ట్ టచింగ్ రొమాంటిక్ డ్రామా సిరీస్. కార్లీ ఫార్చ్యూన్ రాసిన బెస్ట్ సెల్లర్ నవల ‘Every Summer After’ ఆధారంగా రూపొందించారు. కెనడాలోని బ్యారీస్ బే అనే చిన్న సరస్సు ఉన్న పట్టణంలో జరిగే ఈ కథలో పెర్సీ ఫ్రేజర్ (సాడీ సోవరాల్), సామ్ ఫ్లోరెక్ (మాట్ కార్నెట్) మధ్య చిన్ననాటి స్నేహం నుంచి ప్రేమ, విరహం, జీవిత మలుపుల వరకు ఆరేళ్ల ప్రయాణాన్ని ఇందులో చూపించారు. సూస్ ఫ్లోరెక్ మరణం తర్వాత పెర్సీ తిరిగి ఆ పట్టణానికి రావడం, ఆ తరువాత జరిగే పరిణామాల కథను ఎమోషనల్ గా చూపించారు. మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ లో అన్నీ ఎపిసోడ్లను ఒకేసారి జూన్ 10న విడుదల చేశారు. ఇందులో మైఖేల్ బ్రాడ్‌వే, అబిగైల్ కోవెన్, ఆరోరా పెర్రినో, ఎలిషా కత్‌బర్ట్ వంటి నటీనటులు కూడా నటించారు. రొమాన్స్, నాస్టాల్జియా ఇష్టమైన వారికి ఈ సిరీస్ బెస్ట్ ఆప్షన్.
హిందీ ఒరిజినల్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ ‘రాఖ్’. 1978లో న్యూఢిల్లీలో జరిగిన ఇద్దరు టీనేజర్ల (సోదరి-సోదరుడు) కిడ్నాప్, మర్డర్ కేసు చుట్టూ కథ తిరుగుతుంది. కొత్త పోలీస్ ఆఫీసర్ జైప్రకాష్ జాటవ్ (అలీ ఫజల్) ఈ కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. డార్క్ అట్మాస్ఫియర్‌తో కరుడుగట్టిన నేరస్థులు, ఫ్యామిలీ ఎమోషన్స్ తో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ఈ సిరీస్. సోనాలి బింద్రే, ఆమిర్ బషీర్, అకాష్ మఖీజా, రామందీప్ యాదవ్ తదితరులు నటించారు. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉండగా, 2026 జూన్ 12న విడుదలయ్యాయి.
సూర్య నటించిన తమిళ యాక్షన్ ఫాంటసీ డ్రామా ‘కరుప్పు. ఆర్.జె. బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో బ్లాక్‌బస్టర్ అయి 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కథలో బిను అనే అమ్మాయి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం చెన్నై వస్తుంది. ఆమె బంగారం దొంగతనం కావడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. సూర్య దేవుడు కరుప్పుగా అవతరించి న్యాయం చేసే మాస్ యాక్షన్ పాత్రలో కనిపిస్తాడు. త్రిష, ఇంద్రాన్స్ తదితరులు నటించారు. జూన్ 12 నుంచి ప్రైమ్ వీడియోలో ఈ మూవీ తమిళ్‌తో పాటు హిందీ, తెలుగు (వీరభద్రుడు), మలయాళం, కన్నడ డబ్బింగ్ వెర్షన్లలో అందుబాటులో ఉంది.
“కింగ్ ఆఫ్ పాప్” మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా తీసిన బయోపిక్ మూవీ. ఇందులో జాఫర్ జాక్సన్ (మైఖేల్ జాక్సన్ మనవడు) ప్రధాన పాత్రలో నటించాడు. జాక్సన్ లోని చిన్ననాటి ప్రతిభ నుంచి అతను ప్రపంచంలోనే బెస్ట్ సింగర్ గా పాపులర్ అవ్వడం వరకు అతని జీవితం, సంఘర్షణలు, వారసత్వం గురించి ఈ చిత్రంలో చూపించారు. ఏప్రిల్ 2026లో థియేటర్లలో విడుదలై, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో రెంట్ ఆప్షన్ లో అందుబాటులో ఉంది.
Read Also : డెడ్లీ మార్షల్ ఆర్ట్స్… దుమ్మురేపే యాక్షన్ సీన్స్… ఈ మాస్టర్ పీస్ ను డోంట్ మిస్