E-Paper
Advertisement

Illu Illalu Pillalu Serial Today Episode June 15th ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: రామరాజు మీదకు బర్గర్ విసిరిన సాగర్

Illu Illalu Pillalu Serial Today Episode June 15th ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: రామరాజు మీదకు బర్గర్ విసిరిన సాగర్
Advertisement

Illu Illalu Pillalu Serial Today Episode: సాగర్‌ పిజ్జాలు, బర్గర్లు తీసుకొచ్చి నర్మదకు ఇచ్చి తాను ప్రెష్‌అప్‌ అయి వస్తాను కలిసి తిందామని చెప్పి లోపలికి వెళ్తాడు. సాగర్‌ లోపలికి వెళ్లగానే.. నర్మద అందరినీ పిలుస్తుంది. దీంతో వేదవతి, తిరుపతి, ప్రేమ, ధీరజ్‌ వస్తారు. వాళ్లతో వాళ్లందరికీ తలా ఒక పిజ్జా బర్గర్‌ ఇస్తుంది నర్మద. అందరూ చాలా బాగున్నాయి అంటూ లొట్టలేసుకుంటూ తింటుంటారు. ఇంతలో లోపలి నుంచి వచ్చిన సాగర్‌ చూసి షాక్‌ అవుతాడు. కోపంగా నర్మదను ఏంటిది అని అడగ్గానే.. నువ్వే కదా కలిసి తిందాం అన్నావు అందుకే అందరం కలిసి తింటున్నాం అని చెప్పగానే..

సాగర్‌ కోపంగా చూస్తుంటాడు. ధీరజ్‌ మాత్రం విడిపోయినా కూడా కలిసి తిందామన్నావు చూడు అది ఎక్కడో టచ్‌ చేసిందిరా అంటూ మెచ్చుకుంటూ తింటాడు. దీంతో సాగర్‌ కోపంగా నర్మదను తిడుతూ.. నేను చెప్పింది మనిద్దరం కలిసి తిందామని చెప్పానని అంటాడు. దీంతో ధీరజ్‌ ఆ విషయం మాకు తెలియదు కదా అంటూ ఒక పిజ్జా ఇస్తే సాగర్‌ విసిరి కొడతాడు. అది రామరాజు మీద పడుతుంది. నర్మద సారీ చెబితే రామరాజు పర్వాలేదు అంటూ సాగర్‌ను తిట్టి వెళ్లిపోతాడు.

Advertisement

ధీరజ్‌ కారు దగ్గరకు వెళ్లి డోర్‌ ఓపెన్‌ చేస్తే అందులో తిరుపతి కూర్చుని ఉంటాడు. ధీరజ్‌ షాక్‌ అవుతాడు. ఎలా వచ్చావు కారులోకి అంటూ అడగ్గానే.. తన దగ్గర రెండో కీ ఉందని రాత్రంతా ఇక్కడే పడుకున్నానని చెప్పాడు తిరుపతి. దీంతో ఆక్సిజన్‌ అందక చనిపోయి ఉంటే.. అంటూ ధీరజ్‌ తిడతాడు. అదంతా సరే కానీ తన లవ్‌కు సపోర్ట్‌ చేయమని అడుగుతాడు. దీంతో ధీరజ్‌ అమ్మాయిల మనస్తత్వం గురించి చెప్తుంటే.. అప్పుడే ప్రేమ వచ్చి ధీరజ్‌ సంకలో కూర్చుంటుంది. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ మౌనంగా ఉండిపోతే తిరుపతి గట్టిగా అరుస్తూ.. లోపలికి వెళ్లిపోతాడు. తర్వాత ప్రేమ వెటకారంగా ధీరజ్‌కు పెళ్లాం గురించి క్లాస్‌ పీకుతుంది. మీ నాన్న ఎప్పుడూ బయటకు వెళ్లేటప్పుడు  మీ అమ్మను ఎదురు రమ్మంటాడు. కానీ నువ్వు ఎప్పుడైనా అలా చెప్పావా..? అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో ధీరజ్‌ అయితే సరే ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను ఇప్పుడు నాకు ఎదురు రా అంటూ చెప్పగానే.. ప్రేమ హ్యాపీగా సరే అంటూ ధీరజ్‌కు ఎదురు వస్తుంది. ధీరజ్‌ వెళ్లిపోతాడు.

ధీరజ్‌ చెప్పగానే.. బొద్దింక కోసం ఇంట్లోకి వెళ్లి వెతికి మరీ బొద్దింకను పట్టుకుని నువ్వు బొద్దింకవు కావే నా ప్రేమ సామ్రాజ్యానికి పెద్ద సైజు బ్రిడ్జువి అనుకుంటూ.. సుకన్యను వెతుక్కుంటూ వెళ్తాడు. సుకన్య డైనింగ్‌ టేబుల్‌ దగ్గర వీడియో చూస్తూ.. నవ్వుతూ ఉంటుంది. దగ్గరకు వెళ్లిన తిరుపతి.. సుకన్య దగ్గరకు వెళ్లి బొద్దింకను చూపిస్తాడు. వెంటనే సుకన్య వెంటనే భయంతో చేతితో నెట్టేస్తుంది. తిరుపతి చేతుల్లోంచి బొద్దింక తిరుపతి షర్టులో పడిపోతుంది. వెంటనే సుకన్య కర్ర తీసుకొచ్చి బొద్దింకను చంపేస్తానని తిరుపతిని కొడుతుంది. దీంతో తిరుపతి నన్ను వదిలేసేయ్‌ అంటూ తిరుపతి అక్కడి నుంచి పారిపోతాడు.

Advertisement

వల్లీ ఆకలిగా ఉందని కేకలు వేస్తుంది.. ఒసేయ్‌ సుక్కు త్వరగా టిఫిన్‌ పట్టుకురావే అంటూ అరుస్తుంది. కిచెన్‌లోంచి ఉప్మా తీసుకొచ్చిన సుకన్య ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చిన దానిలా అలా అరుస్తావేంటి.. అనగానే.. వల్లీ తాను కడుపుతో ఉన్నానని ఆకలి వేస్తుందని చెప్పగానే.. నీ నాటకాలు నా దగ్గర వేయకండి.. మీ కడుపు గురించి నిజం నాకు తెలుసులే అంటూ తను తీసుకొచ్చిన ఉప్మా ఇస్తుంది. ఆ ఉప్మా చూసిన వల్లీ షాక్‌ అవుతుంది. ఇదేంటి ఇలా ఉందే.. అనగానే.. అందరూ జీడిపప్పు ఉప్మా చేస్తే.. నేను కరివేపాకు ఉప్మా చేశాను అంటుంది. దీంతో వల్లీ కోపంగా తిడుతుంది. ఇంతలో నర్మద వచ్చి అక్కా నీకోసం ఓ స్పెషల్‌ టిఫిన్‌ చేశాను రా అంటూ తీసుకెళ్తుంది. అప్పుడే ప్రేమ కూడా పెద్ద ప్లేట్‌లో ముసుగు వేసుకుని ఏదో తీసుకువస్తుంది. అది చూసి వల్లీ సంతోషంతో గంతులు వేస్తుంది. నాకోసం చాలా తీసుకొచ్చినట్టు ఉన్నారు అంటుంది. ప్రేమను, నర్మదను పొగడ్తలతో ముంచెత్తుతుంది. దీంతో ప్రేమ ఇదిగో అక్కాయ్‌ తిన్న తర్వాత కూడా మమ్మల్ని ఇలాగే పొగడాలి అంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.
  

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆమె ఎంట్రీ ఖాయం..

Big Stories

Advertisement
×