Indian Railways: భారతీయ రైల్వేలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వింతలు, విశేషాలు ఉన్నాయి. వాటిలో చాలా విషయాలు ప్రయాణీకులకు, ప్రజలకు తెలియదు. అలాంటి ఒక రైల్వే అద్భుతం ఆంధ్రప్రదేశ్ లోనూ ఉంది. ఆ ప్రాంత పరిసర ప్రజలకు ఈ విషయం గురించి తెలిసినా, చాలా మందికి పెద్దగా తెలియకపోవచ్చు. అదే.. కడియం రైల్వే వంపు. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటంటే..
ఆసియాలోనే రెండో అతిపెద్ద రైల్వే వంపు!
తూర్పుగోదావరి జిల్లా కడియం గ్రామం మీదుగా రైలు ప్రయాణం చేసే వాళ్లు ఎవరైనా కడియం రైల్వే వంపు గురించి ఆరా తీస్తారు. ఎందుకంటే, కడియం ఊరునీ, అందమైన పంట పొలాలను దాటుకుంటూ వెళ్లే ఈ రైలు ప్రయాణం ఎంతో అందంగా ఉంటుంది. దానికి కడియం రైల్వే వంపు మరింత అందాన్ని తీసుకొస్తుంది. ఈ రైల్వే వంపు కేశవరం నుంచి ప్రారంభమై కడియం వరకు కొనసాగుతుంది. ఈ రైల్వే వంపుకు మన దేశంలోనే కాదు, ఆసియాలోనే ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ రైల్వే లైన్ చాలా వంపు తిరిగి ఉంటుంది. ఇది ఆసియాలోనే రెండో అతిపెద్ద వంపుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ వంపు కారణంగా, ఇంజిన్ లోపల ఉన్న లోకో పైలెట్, చివరి బోగీలో ఉన్న గార్డు ఒకరికొకరు కనిపిస్తారు.
ఈ రైల్వే లైన్ ఎందుకు అంత వంపుగా ఉంటుంది?
ఈ రైల్వే లైన్ బ్రిటిషర్ల కాలంలోనే ఏర్పాటు చేశారు. ఇది విజయవాడ-చెన్నై మార్గంలో ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. బ్రిటిష్ వాళ్లు ఈ రైల్వే లైను వేసే సమయంలో ఈ వంపును ప్రత్యేకంగా పెట్టారు. ఒకవేళ ఈ వంపు అనేది లేకుండా రైల్వే లైను వేస్తే.. అది రాజమండ్రి నగరాన్ని తాకకుండా వెళ్ళేది అంటారు. రాజమండ్రి మీదుగా రైల్వే లైన్ ఉండాలనే ఆలోచనతోనే ఇంత పెద్ద వంపును ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెప్తుంటారు.
Today's #railway #photo – the beautiful aerial capture of a train negotiating a long curve surrounded by paddy fields near Kadiyam station close to Rajamundry, in the jurisdiction of @drmvijayawada in @SCRailwayIndia! Pic courtesy, Antarvedi! #IndianRailways #trains #photography pic.twitter.com/9Fjc1NKO5d
— Ananth Rupanagudi (@Ananth_IRAS) January 5, 2022
Read Also: భారత్ లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ వెరీ వెరీ స్పెషల్, ఎందుకో తెలుసా?
చేపల చెరువుల ప్రాంతంలో రైల్వే వంపు
నిజానికి పచ్చటి పొలాల మధ్య ఈ రైలు ప్రయాణం చేస్తుంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రైల్వే వంపు ప్రాంతంలో చుట్టూ చేపల చెరువులు ఉంటాయి. నీళ్లలో నుంచి ఎగిరిపడే చేపలు రైల్వే ప్రయాణీకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇలాంటి అందమైన రైల్వే వంపులు దేశంలో చాలా ఉన్నాయి. కానీ, ఇంత పెద్ద రైల్వే వంపులు అనేవి ఆసియాలో చాలా తక్కువగా ఉన్నాయి.
Read Also: 3 దశాబ్దాలుగా ఉచిత భోజనం.. ఈ రైలు గురించి మీకు తెలుసా?