OTT Movie : వ్యవసాయం గురించి ఒక సందేశాత్మక వెబ్ సిరీస్ ఓటీటీలోకి రీసెంట్ గా వచ్చింది. ఇది ఒక లవ్ స్టోరీతో పాటు, గ్రామీణ వ్యవసాయ జీవితం గురించి తెరకెక్కిన ఒక అద్భుతమైన సిరీస్. ఇందులో సిటీ జీవితానికి అలవాటుపడ్డ ఒక వ్యక్తి, తన తాత కల సాకారం చేయడానికి రైతుగా మారతాడు. ఈ చూడచక్కని సెరిస్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ….
ఎమ్ ఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమింగ్
‘మిట్టి – ఎక్ నయీ పహిచాన్’ (Mitti Ek Nayi Pehchan) 2025లో విడుదలైన హిందీ డ్రామా వెబ్ సిరీస్. దీనికి ఆలోక్ కుమార్ ద్వివేదీ, గగన్‌జీత్ సింగ్ కలసి దర్శకత్వం వహించారు. ఫ్రెష్‌లైమ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఆకాశ్ చావ్లా, అరుణవ జోయ్ సెంగుప్తా నిర్మించిన ఈ సిరీస్ లో ఇష్వాక్ సింగ్, శ్రుతి శర్మ, దీక్షా జునేజా, అల్కా అమీన్, యోగేంద్ర టికు, పియూష్ కుమార్ నటించారు. ఈ 8 ఎపిసోడ్ ల సిరీస్ ఉత్తర భారతదేశంలోని ఒక గ్రామంలో జరిగే వ్యవసాయం, గ్రామీణ జీవనం కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ సిరీస్ ఎమ్ ఎక్స్ ప్లేయర్‌లో 2025 జులై 10న విడుదలైంది. ఇది తెలుగు సబ్‌టైటిల్స్‌తో ఉచితంగా స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. IMDbలో దీనికి 8.5/10 రేటింగ్ కూడా ఉంది.
స్టోరీలోకి వెళితే
రాఘవ్ శర్మ (ఇష్వాక్ సింగ్) ముంబైలో ఒక పేరుపొందిన అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్. సిటీ లైఫ్ కు అలవాటుపడిఉంటాడు. అతను ఒక మంచి ఉద్యోగంతో పాటు, కాబోయే భార్య స్తుతి (దీక్షా జునేజా)తో సమయం గడుపుతూ సంతోషంగా జీవిస్తుంటాడు. అయితే అతని తాత సుదర్శన్ (యోగేంద్ర టికు) మరణ వార్త అతని జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది. రాఘవ్ ఉత్తర భారతదేశంలోని తన స్వగ్రామం డోల్ ఛప్రాకు, తాత అంత్యక్రియల కోసం వెళతాడు. అక్కడ అతను తన తాత ఆధునిక వ్యవసాయం కోసం 15 లక్షల రుణం తీసుకుని, నష్టాలు రావడంతో చనిపోయినట్లు తెలుసుకుంటాడు. గ్రామస్తులు సుదర్శన్‌ను అపహాస్యం చేస్తూ, అతని తాత గురించి అవహేళన చేస్తారు. అప్పులు, భూమి వివాదాలను మాత్రమే వదిలి పోయాయాడని గుసగుసలాడుకుంటూ ఉంటారు.
Read Also : ఇదెక్కడి సినిమారా మావా… ఆడవాళ్లను ఆ పని కోసమే వాడుకునే వింత విలేజ్… ఐఎండీబీలో 8.6 రేటింగ్
ఈ అవమానం రాఘవ్‌ను గిల్ట్‌తో నింపుతుంది. ఎందుకంటే అతను తన కుటుంబాన్ని, ముఖ్యంగా తాతను, ఎక్కువగా నిర్లక్ష్యం చేసి ఉంటాడు. రాఘవ్ తన తాత కలను సాకారం చేయడానికి గ్రామంలో ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఈ నిర్ణయం అతని ముంబై జీవితాన్ని, స్తుతితో అతని సంబంధాన్ని, అతని ఉద్యోగాన్ని కూడా ప్రమాదంలో పడేస్తుంది. గ్రామంలో అతను కృతిక సిన్హా (శ్రుతి శర్మ) అనే జిల్లా వ్యవసాయ అధికారి, డాక్టర్ సహినీ వంటి స్థానికుల సహాయంతో, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం మొదలెడతాడు. అయితే గ్రామంలోని కొంతమంది అతని ప్రయత్నాలకు అడ్డుతగులుతుంటారు. రాఘవ్‌కు మద్దతుగా మహూ, బైజు అనే ఇద్దరు నిరుద్యోగ యువకులు తోడవుతారు. రాఘవ్ దాదీ (అల్కా అమీన్) అతనికి ఆసరాగా నిలుస్తుంది.
ఈ సమయంలో అతను తన ఉద్యోగాన్ని కూడా కోల్పోతాడు. అతని ప్రియురాలు స్తుతి ఈ గ్రామానికి సర్‌ప్రైజ్‌గా వస్తుంది. కానీ రాఘవ్ కి కృతిక మీద కూడా ఫీలింగ్స్ వస్తాయి. కృతిక తెలివైన స్వభావం రాఘవ్‌కు స్ఫూర్తినిస్తుంది. ఇక క్లైమాక్స్‌లో, రాఘవ్ తన తాత కలను సాకారం చేయడానికి పూర్తిగా కట్టుబడతాడు. గ్రామస్తుల మనస్తత్వాన్ని మార్చడానికి, వ్యవసాయంలో ఆధునికతను తీసుకురావడానికి పోరాడతాడు. ఇక చివరికి రాఘవ్ తన తాత కలను నెరవేరుస్తాడా ? వ్యవసాయంలో మార్పులు తెస్తాడా ? ఇతని ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమవుతుంది ? అనే విషయాసలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సిరీస్ ను మిస్ కాకుండా చుడండి.