E-Paper
Advertisement

Psycho Thriller OTT : సీరియల్ కిల్లర్ చేతిలో చిక్కుకునే మేకప్ ఆర్టిస్ట్… మైండ్ బెండయ్యే క్లైమాక్స్

Psycho Thriller OTT : సీరియల్ కిల్లర్ చేతిలో చిక్కుకునే మేకప్ ఆర్టిస్ట్… మైండ్ బెండయ్యే క్లైమాక్స్
Advertisement

Psycho Thriller OTT : ఓటీటీలలో వచ్చే క్రైమ్ థ్రిల్లర్స్ లోనూ రకరకాల కథలు ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. జానర్ ఒక్కటే అయినా కథ మాత్రం కొత్తగా, డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ కూడా ఒకటి. ఈ జానర్లో వచ్చిన ఓ ఇంట్రస్టింగ్ సినిమానే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో ఉంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

శ్రీజిత్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన బెంగాలీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘విన్సీ డ’ (vinci da movie 2019). ప్రోస్థెటిక్ మేకప్ ఆర్టిస్ట్, సైకోపాత్ మధ్య సాగే ఈ స్టోరీ ట్విస్టులు, మైండ్ గేమ్స్‌తో క్షణక్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇందులో రుద్రనీల్ ఘోష్, రిత్విక్ చక్రవర్తి, అనిర్బన్ భట్టాచార్య, సోహినీ సర్కార్ ప్రధాన పాత్రలు పోషించారు. 2019లో రిలీజ్ అయిన ఈ సినిమా IMDb 7.3 రేటింగ్ సంపాదించింది. ఇప్పుడు Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also :  షార్ట్ కట్ లో కోటీశ్వరుడు కావాలనుకునే సిన్సియర్ పోలీస్ కొడుకు… క్లైమాక్స్ ట్విస్టుకి ఫ్యూజులు అవుట్

స్టోరీలోకి వెళ్తే…

విన్సీ డ కథ (రుద్రనీల్ ఘోష్) చుట్టూ సాగుతుంది. అతనొక అద్భుతమైన ప్రోస్థెటిక్ మేకప్ ఆర్టిస్ట్. సినిమా ఇండస్ట్రీలో అతని టాలెంట్‌ ను ఎవ్వరూ పట్టించుకోరు. కాబట్టి టాలెంట్ కు తగ్గ పని లేక స్ట్రగ్లింగ్ లైఫ్ గడుపుతాడు. అంతేకాదు యారోగంట్, స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్వభావం వల్ల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాడు. అతని ఫాదర్ చనిపోయాక లైఫ్ మరింత డిఫికల్ట్ అవుతుంది. ఈ క్రమంలోన ఒకరోజు అడి బోస్ (రిత్విక్ చక్రవర్తి) అనే లాయర్ అతని లైఫ్‌లోకి ఎంటర్ అవుతాడు.

Advertisement

అడి బోస్ గతం దారుణంగా ఉంటుంది. టీనేజ్‌లో తండ్రి మద్యం మత్తులో తల్లిని కొడుతుంటే, ఆపడానికి ట్రై చేసి క్రికెట్ బ్యాట్‌తో చంపేస్తాడు. జైలు నుంచి బయటకు వచ్చాక క్రిమినల్ లాయర్ అవుతాడు. కానీ అతను లాయర్ అయ్యాక కూడా కోర్టులో శిక్ష పడకుండా తప్పించుకున్న క్రిమినల్స్‌ను స్వయంగా శిక్షించడానికి పూనుకుంటాడు. ఇలాంటి పని చేస్తున్నాడు కాబట్టి తనను తాను “సీరియల్ లాయర్” అని అనుకుంటాడు.

అడి విన్సీ దా టాలెంట్‌ను యూజ్ చేసుకుని ప్రోస్థెటిక్ మాస్క్స్ తయారు చేయిస్తాడు. ఆ మాస్క్స్ ధరించి క్రిమినల్స్ ఐడెంటిటీతో క్రైమ్స్ చేసి, వాళ్లను ట్రాప్ చేయిస్తాడు. మొదట విన్సీ దీన్ని డైరెక్టర్ జాబ్ అని అనుకుంటాడు. కానీ తర్వాత ట్రూత్ తెలిసి షాక్ అవుతాడు. అడి ప్లాన్స్‌లో ఇన్నోసెంట్ పీపుల్ కూడా చనిపోవడంతో గిల్ట్ ఫీల్ అవుతాడు. దీంతో అడి నుంచి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తాడు. కానీ అడి వీడియో ఎవిడెన్స్‌తో బ్లాక్‌మెయిల్ చేస్తాడు. క్లైమాక్స్‌లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంటుంది. మరి ఆ ట్విస్ట్ ఏంటి? అమాయకులను కూడా అడి ఎందుకు చంపుతున్నాడు? చివరకు విన్సీ ఎలా తప్పించుకున్నాడు? అనేది కథ.

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×