E-Paper
Advertisement

Psychological Thriller OTT: ఓటిటిలోకి వచ్చేస్తున్న కొంకణా సేన్ కొత్త మూవీ… ఏ ఓటీటీలోకి అంటే ?

Psychological Thriller OTT: ఓటిటిలోకి వచ్చేస్తున్న కొంకణా సేన్ కొత్త మూవీ… ఏ ఓటీటీలోకి అంటే ?
Advertisement

Psychological Thriller OTT : ఓటీటీలోకి ఒక సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ఒక మహిళా డాక్టర్ చుట్టూ తిరిగే ఈ స్టోరీ, లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సాగనుంది. ఇప్పటికే వచ్చిన ఈ సినిమా ట్రైలర్‌కు విశేష స్పందన కూడా వస్తోంది. అయితే ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రేక్షకులు మరి కొద్ది గంటల్లో ఈ సినిమాను చూడవచ్చు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్

అనుభూతి కశ్యప్ దర్శకత్వంలో వస్తున్న ఈ హిందీ సినిమా పేరు ‘అక్యూజ్డ్’ (Accused). కరణ్ జోహార్‌కు చెందిన ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను నిర్మించింది. ఈ చిత్రం 2026 ఫిబ్రవరి 27న నేరుగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో విడుదల కానుంది. ఇది తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో కొంకణా సేన్ శర్మ, ప్రతిభా రాంటా ఇద్దరూ స్వలింగ సంపర్కులుగా, భార్యాభర్తలుగా నటిస్తున్నారు. ఈ స్టోరీ ఉత్కంఠభరితమైన మలుపులతో నడుస్తున్నట్లు ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

లండన్‌లో గైనకాలజిస్ట్‌గా పనిచేసే డాక్టర్ గీతిక సేన్ (కొంకణా సేన్ శర్మ) లైఫ్ చాలా సాఫీగా సాగిపోతుంటుంది. ఆమె మీరా అనే వేరొక మహిళతో సహజీవనం చేస్తుంటుంది. తక్కువ వయసులోనే పెద్ద పొజిషన్‌కి వెళ్లిన ఆమె, హాస్పిటల్‌లో డీన్ పదవికి కూడా పోటీలో ఉంటుంది. సరిగ్గా అదే టైమ్‌లో, ఆమె తీవ్రమైన లైంగిక వేధింపులకు పాల్పడిందని సడన్‌గా ఆరోపణలు వస్తాయి. ఆ ఒక్క ఆరోపణతో ఆమె జీవితం తలకిందులైపోతుంది. సమాజంలో ఆమెకు ఉన్న గౌరవం పోవడమే కాకుండా, తన పార్ట్‌నర్ మీరాతో ఉన్న బంధం కూడా చిక్కుల్లో పడుతుంది.

ఆమె నిజంగానే ఆ తప్పు చేసిందా లేక ఆమెను ఎవరైనా కావాలనే ఇరికించారా? అందరూ ఆమెను దోషిగా చూస్తున్నప్పుడు, ఆమె తన నిజాయితీని ఎలా నిరూపించుకుంది? ఈ క్రమంలో ఆమె మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కొంది ? అనే విషయాలను, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో  చాలా ఉత్కంఠభరితంగా చూపించనున్నారు.

Advertisement

Read Also : జోంబీగా మారే కూతురు… తండ్రి మాస్టర్ ప్లాన్… ఒక్కసారి చూస్తే జీవితంలో మర్చిపోలేరు భయ్యా

Tags

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×