E-Paper
Advertisement

కూతురి స్విమ్మింగ్ కోచ్ పై తల్లికి అలాంటి కోరిక… చివరికి ఏం జరిగిందో చూస్తే బుర్రపాడు

కూతురి స్విమ్మింగ్ కోచ్ పై తల్లికి అలాంటి కోరిక… చివరికి ఏం జరిగిందో చూస్తే బుర్రపాడు
Advertisement

Psychological Thriller: ఒక ఇంట్లో భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోయింది. కానీ ఆ గ్యాప్ ను ఫిల్ చేయడానికి భార్య తీసుకున్న ఓ నిర్ణయం… చివరికి అదే ఇంట్లో తల్లీకూతుళ్ల మధ్యే దూరం పెంచితే ? పైకి ఎంతో పర్ఫెక్ట్‌గా కనిపించే కుటుంబంలోకి ఓ కొత్త వ్యక్తి రావడంతో అందరి జీవితాలు తలకిందులైతే ? ఒక రహస్య బంధం బయట పడుతుందనే భయం, ఈర్ష్య, మోసం… ఇవన్నీ కలిసి పరిస్థితిని ఎక్కడికి తీసుకెళ్లాయి? అదే తాజాగా ఓటీటీలోకి వచ్చిన మెక్సికన్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘డిజైర్’ (Desire / Deseo) కథ. మరి పెద్దలకు మాత్రమే అనిపించేలా ఉన్న ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

లూసెరో మంచి పేరు ఉన్న సక్సెస్ ఫుల్ లాయర్. భర్త ఫెర్నాండోతో కలిసి సంపన్నమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. వాళ్లకు ఓ టీనేజ్ కుమార్తె కూడా ఉంటుంది. బయట నుంచి చూస్తే ఈ కుటుంబంలో ఎలాంటి సమస్యా లేనట్టే కనిపిస్తుంది. కానీ లూసెరో మాత్రం తన వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండదు. భర్తతో బంధం క్రమంగా ప్రేమ కంటే అలవాటుగా మారిపోవడంతో లోలోపల అసంతృప్తిగా ఉంటుంది.

Advertisement

అలాంటి సమయంలో ఆమె కూతురికి స్విమ్మింగ్ కోచ్‌గా మాటియాస్ వస్తాడు. యువకుడైన మాటియాస్ వ్యక్తిత్వం లూసెరోను ఆకర్షిస్తుంది. మొదట్లో తనలో కలుగుతున్న భావాలను ఆమె పట్టించుకోదు. కానీ అతనితో పరిచయం పెరిగే కొద్దీ పరిస్థితి మారిపోతుంది. చివరికి తన కుటుంబానికి తెలియకుండా మాటియాస్‌తో రహస్య సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఇక్కడి నుంచే అసలు సమస్య మొదలవుతుంది. లూసెరో తన రహస్యాన్ని దాచిపెట్టాలని ప్రయత్నిస్తుండగానే, మాటియాస్‌పై తన కూతురికి కూడా ఆసక్తి పెరుగుతుంది.

ఆమెకు తల్లి ఏం చేస్తుందో తెలియదు. దీంతో ఒకే వ్యక్తి చుట్టూ తల్లీకూతుళ్ల మధ్య తెలియని పోటీ మొదలవుతుంది. లూసెరో మాత్రం విషయం బయట పడితే తన కుటుంబ జీవితం పూర్తిగా కూలిపోతుందని భయపడుతుంది. మాటియాస్‌తో ఉన్న సంబంధాన్ని ఎలా దాచాలి? కూతురికి నిజం తెలియకుండా ఎలా ఆపాలి? అనే ఆలోచనలతో ఆమె మరింత ఒత్తిడికి లోనవుతుంది.

Advertisement

మరోవైపు కుటుంబంలో అనుమానాలు మొదలవుతాయి. చిన్న చిన్న విషయాలే పెద్ద గొడవలకు దారితీస్తాయి. ఈర్ష్య, అనుమానం, దాచిన నిజాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో లూసెరో తన నిర్ణయాల పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకప్పుడు తనకు ఆనందాన్ని ఇచ్చిన ఆ రహస్య బంధమే ఇప్పుడు తన కుటుంబాన్ని కోల్పోయే పరిస్థితికి తీసుకొస్తుంది.

చివరికి నిజాలు బయటపడే కొద్దీ ప్రతి ఒక్కరి మధ్య ఉన్న సంబంధాలు మారిపోతాయి. లూసెరో తన కోరిక కోసం తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది ? ఒక రహస్య సంబంధంతో మొదలైన కథ చివరికి ఎలాంటి టర్న్ తీసుకుంది ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే. నమ్మకం పోయినప్పుడు కుటుంబ బంధాలు ఎంత సులభంగా కూలిపోతాయో ఈ సినిమాలో చూడవచ్చు.

తెలుగులో ఉందా ?

‘డిజైర్’ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో అందుబాటులో ఉంది. సినిమా ఒరిజినల్ స్పానిష్ ఆడియోతో పాటు ఇంగ్లీష్ డబ్బింగ్, సబ్‌టైటిల్స్ ఆప్షన్స్‌తో వస్తోంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ ఆడియో అందుబాటులో లేదు. ఇందులో అడల్ట్ థీమ్స్, బోల్డ్ కంటెంట్ ఉండటంతో, ఈ సినిమా పెద్దలకు మాత్రమే అని గుర్తు పెట్టుకోండి.

Read Also: అడవిలో ఫ్రెండ్స్‌తో పార్టీ… 

చివరికి ఒకరినొకరు చంపుకునే పరిస్థితి… క్లైమాక్స్ ట్విస్ట్ కేక

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×