E-Paper
Advertisement

అడవిలో ఫ్రెండ్స్‌తో పార్టీ… చివరికి ఒకరినొకరు చంపుకునే పరిస్థితి… క్లైమాక్స్ ట్విస్ట్ కేక

అడవిలో ఫ్రెండ్స్‌తో పార్టీ… చివరికి ఒకరినొకరు చంపుకునే పరిస్థితి… క్లైమాక్స్ ట్విస్ట్ కేక
Advertisement

Malayalam Thriller on OTT: ఒక ఫారెస్ట్ గార్డ్… తనకు ఎంతో నమ్మకమైన స్నేహితులను అడవిలోకి పార్టీకి పిలిచాడు. సరదాగా మొదలైన ఆ రాత్రి… ఒక జింకను వేటాడిన తర్వాత పూర్తిగా మారిపోతుంది. స్నేహితుల మధ్య దాగి ఉన్న పాత పగలు, ద్రోహాలు ఒక్కొక్కటిగా బయట పడుతుంటే… అదే సమయంలో అడవిలో ఏదో తెలియని ప్రమాదం వారిని వేటాడటం మొదలు పెడుతుంది. బయటకు వెళ్లే దారి లేదు… ఎవరిని నమ్మాలో తెలియదు… అడవిలో ఉన్న ప్రమాదం కంటే తమతో ఉన్న మనుషులే ప్రమాదకరంగా మారితే ? అసలు ఆ రాత్రి అసలు ప్లాన్ ఎవరిది ? ఈ ప్రశ్నల చుట్టూ సాగే సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ ‘ఫారెస్ట్ గార్డ్’ (Forest Guard). మరి ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు? తెలుగులో ఉందా? అసలు కథేంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

మిథున్ అంకితభావంతో పని చేసే ఫారెస్ట్ గార్డ్. దట్టమైన అడవిలో డ్యూటీ చేస్తూ ఉండే అతను చాలా కాలం తర్వాత తన పాత స్నేహితులతో కలిసి సమయం గడపాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఆనందు, ఇమోద్‌తో పాటు ఓ ప్రముఖ వేటగాడు కితోలను కూడా తాను పని చేసే అడవిలోకి రహస్యంగా ఆహ్వానిస్తాడు.

Advertisement

అడవి మధ్యలో స్నేహితులంతా కలిసి పార్టీ చేసుకుంటారు. మొదట సరదాగా స్టార్ట్ అవుతుంది ఆ రాత్రి. అయితే ఓ జింకను వేటాడటంతో పరిస్థితులు మారిపోతాయి. మద్యం మత్తులో జరిగిన ఆ వేట తర్వాత ఒక్కొక్కరిలోని అసలు స్వభావం బయటకు రావడం మొదలవుతుంది. గతంలో జరిగిన గొడవలు, పాత పగలు, ఈగోలు, ద్రోహాలు వారి మధ్య అనుమానాలను పెంచుతాయి.

అప్పటివరకు ఒకరినొకరు స్నేహితులుగా భావించిన వాళ్లే… ఒక్కసారిగా ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకోవడం మొదలుపెడతారు. చిన్న విషయం కూడా పెద్ద గొడవగా మారుతుంది. పరిస్థితి మరింత విషమించడంతో ఎవరు ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అడవిలో చిక్కుకున్న వాళ్లకు అసలు ప్రమాదం బయట ఉందా ? లేక తమతో ఉన్న మనుషుల్లోనే ఉందా ? అనే ప్రశ్న మొదలవుతుంది.

Advertisement

ఇదే సమయంలో అడవిలో ఏదో తెలియని శక్తి లేదా క్రూరమైన జంతువు తమను వేటాడుతోందని వారికి అర్థమవుతుంది. బయటకు వెళ్లే మార్గం కనిపించదు. ఒకవైపు అడవిలోని ప్రమాదం, మరోవైపు తమ మధ్య పెరుగుతున్న అనుమానాలు. ప్రాణాలతో బయటపడటానికి ప్రయత్నించే కొద్దీ పరిస్థితులు మరింత భయానకంగా మారుతాయి.

అయితే కథ ముందుకు వెళ్లే కొద్దీ ఈ సంఘటన యాదృచ్ఛికంగా జరగలేదనే అనుమానం మొదలవుతుంది. మిథున్ తన స్నేహితులను అసలు అడవిలోకి ఎందుకు పిలిచాడు ? ఆ రాత్రి జరిగిన వేట వెనుక ఉన్న నిజం ఏంటి ? వారిని వేటాడుతున్న అసలు ప్రమాదం ఎవరిది ? చివరకు ఈ నరకం నుంచి ఎవరు ప్రాణాలతో బయటపడ్డారు ? అనేదే క్లైమాక్స్‌లో ఆసక్తిని పెంచుతుంది.

తెలుగులోనూ స్ట్రీమింగ్

కథిర్, షైన్ టామ్ చాకో, హకీమ్ షాజహాన్, సుధి కొప్ప, జియో బేబీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్‌కు ఎమ్సీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. సుమారు 2 గంటల 6 నిమిషాల రన్‌టైమ్‌తో సాగే ఈ సినిమాను ఆహా (Aha) ఓటీటీలో తెలుగు డబ్బింగ్‌తో చూడవచ్చు. అడవి నేపథ్యం, స్నేహితుల మధ్య పెరిగే అనుమానాలు, సర్వైవల్ ఎలిమెంట్స్, మైండ్ గేమ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. సస్పెన్స్, సర్వైవల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు తాజాగా తెలుగులోకి వచ్చిన మలయాళం థ్రిల్లర్ ‘ఫారెస్ట్ గార్డ్’ను మిస్ అవ్వొద్దు.

Read Also: తల్లి మరణంతో ఊరు మారిన అమ్మాయి… ఆడపిల్లల వల్ల ఇంత పెద్ద సమస్యా ? అసలు గుట్టేంటి ?

Tags

Related News

అల్జీమర్స్‌తో బాధపడే వృద్ధుడు… అతన్ని చూసుకునే మహిళకు వచ్చిన కష్టం చూస్తే గుండె బరువెక్కాల్సిందే

చనిపోయిన అమ్మాయి నుంచి వాయిస్ మెసేజ్… అసలు కథ తెలిస్తే దిమ్మతిరుగుతుంది మావా

కార్పొరేట్ కంపెనీతో ఓ పల్లెటూరి కుర్రాడి ఫైట్… చివరికి ఏం జరిగిందంటే?

ఎమ్మెల్యే కిడ్నాప్… పోలీసులకు దొరకని క్లూస్ ఈ కేబుల్ ఆపరేటర్ ఎలా పట్టుకున్నాడంటే?

బిజినెస్‌లో బిగ్ ట్రబుల్… బావమరుదులు వేసిన ప్లాన్స్ చూస్తే మైండ్ బ్లాక్

కోట్లాది మంది చూసిన ఈ రెండు సిరీస్‌లకు నెట్‌ఫ్లిక్స్ గుడ్‌బై… లాస్ట్ ఛాన్స్ భయ్యా

చనిపోయాడనుకున్న వ్యక్తి మళ్లీ వచ్చాడు… అతని కోసం వచ్చిన కిల్లర్ ఎవరో తెలిస్తే షాక్

Big Stories

Advertisement
×