E-Paper
Advertisement

నలుగురు స్నేహితులకు ఒకేసారి భార్యల నుంచి విడాకుల నోటీసులు… ఫ్యామిలీ థెరపిస్ట్ కే పిచ్చెక్కించే ప్లాన్

నలుగురు స్నేహితులకు ఒకేసారి భార్యల నుంచి విడాకుల నోటీసులు… ఫ్యామిలీ థెరపిస్ట్ కే పిచ్చెక్కించే ప్లాన్
Advertisement

Telugu Family Comedy Drama OTT : ఇతర కుటుంబాల సమస్యలు పరిష్కరించే ఫ్యామిలీ థెరపిస్ట్ జీవితమే ఒక్కసారిగా గందరగోళంగా మారితే… అదీ తనతో పాటు తన ముగ్గురు స్నేహితుల పెళ్లి బంధాలు కూడా ఒకేసారి కష్టాల్లో పడితే ? ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో భార్యల నుంచి విడాకుల మాట వినాల్సిన పరిస్థితి వచ్చిన నలుగురు స్నేహితులు… తమ జీవితాలను తిరిగి గాడిలో పెట్టేందుకు చేసే ప్రయత్నాలు ఒక్కోసారి నవ్విస్తాయి. మరికొన్ని సందర్భాల్లో తమ సంబంధాల్లోని అసలు సమస్యలను బయట పెడతాయి. పెళ్లి, ప్రేమ, స్నేహం చుట్టూ సాగే ఫ్యామిలీ కామెడీ డ్రామా ‘పురుషః’ (Purushaha). మరి ఈ తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే విషయంలోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

గోవింద్ ఫ్యామిలీ థెరపిస్ట్. భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలను పరిష్కరించడమే అతని వృత్తి. ఎవరి మధ్య విభేదాలు వచ్చినా మాట్లాడుకోవాలని, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ఇతరులకు చెబుతుంటాడు. కానీ అతని వివాహ బంధంలో మాత్రం పరిస్థితులు ఆపొజిట్ గా ఉంటాయి. ఒక దశలో గోవింద్ భార్య కమల అతని నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంటుంది. గోవింద్‌ కు ఇది ఊహించని షాక్. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచించే సమయంలోనే అతని ముగ్గురు స్నేహితుల జీవితాల్లో కూడా దాదాపు ఇదే సమస్య మొదలవుతుంది. వారి భార్యలు కూడా విడాకుల నిర్ణయం తీసుకుంటారు.

Advertisement

నలుగురు స్నేహితులు కలిసి తమ పెళ్లిళ్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ సమస్య ఎక్కడుందో బయట నుంచి అంచనా వేయడం, సొంత జీవితంలో దాన్ని ఎదుర్కోవడం మధ్య ఎంత తేడా ఉంటుందో గోవింద్‌ కు తెలుస్తుంది. ఇతరులకు సలహాలు ఇచ్చే వ్యక్తే తన భార్యతో మాట్లాడేటప్పుడు ఎందుకు విఫలమవుతున్నాడనే అంశం కథలో ఆసక్తిని పెంచుతుంది. వీళ్ల ప్రయత్నాల్లో ఎన్నో హాస్యభరితమైన పరిస్థితులు ఎదురవుతాయి. అదే సమయంలో భార్యాభర్తల మధ్య సంవత్సరాలుగా పేరుకుపోయిన అసంతృప్తులు కూడా బయటకు వస్తాయి. ప్రేమ ఉన్నప్పటికీ దాన్ని వ్యక్తం చేయకపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, కుటుంబ జీవితంలో చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారడం వంటి అంశాలను సినిమా వినోదాత్మకంగా చూపిస్తుంది.

గోవింద్ తన భార్యను తిరిగి తన జీవితంలోకి తీసుకురాగలడా ? నలుగురు స్నేహితుల పెళ్లిళ్లు నిజంగానే విడాకుల వరకు వెళ్తాయా ? వాళ్ల భార్యలు ఒకేసారి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ? ఇతరుల కుటుంబాలను కాపాడే ఫ్యామిలీ థెరపిస్ట్ తన పెళ్లిని కాపాడుకోవడానికి చివరకు ఏం చేశాడనేది ‘పురుషః’ (Purushaha)లో చూడాల్సిన ఆసక్తికరమైన అంశం.

Advertisement

Also Read : రాత్రిళ్లు కనిపిస్తున్న ఆ శవం ఎవరిది ? హారర్ కాదు అంతకు మించి… ప్రతీ సీన్ సీట్ ఎడ్జ్ ట్విస్ట్

తెలుగులోనూ చూడొచ్చు

‘పురుషః’ తెలుగు సినిమా. ఈ సినిమా Ahaలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. పవన్ కళ్యాణ్ బట్టుల, సప్తగిరి, వెన్నెల కిషోర్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు ఇందులో నటించారు.

Tags

Related News

బాబోయ్ ప్రాణాలు తీసే బొమ్మ… హారర్ గేమర్‌కి మైండ్ బ్లాకయ్యే సీన్… ఓటీటీలో గత్తరలేపుతున్న హర్రర్ మూవీ

పాప బర్త్‌డేకి డబ్బులు అడిగితే అవమానం… యజమాని కారులో కోట్ల క్యాష్… డ్రైవర్ షాకింగ్ డెసిషన్

భార్యాభర్తల వందల కోట్ల యుద్ధం… 8 ఎపిసోడ్ల ఇగో వార్… ఇంటెన్స్ లీగల్ డ్రామా

ఒకే రూమ్‌లో క్రష్‌తో సీక్రెట్ లైఫ్… చెప్పుకోలేని ప్రేమతో హీరో తిప్పలు… నెట్‌ఫ్లిక్స్‌లో సీజన్ 2 ల్యాండింగ్

రాత్రిళ్లు కనిపిస్తున్న ఆ శవం ఎవరిది ? హారర్ కాదు అంతకు మించి… ప్రతీ సీన్ సీట్ ఎడ్జ్ ట్విస్ట్

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

Big Stories

Advertisement
×