E-Paper
Advertisement

సిమ్ లేదు.. టవర్ అక్కర్లేదు.. భద్రతా బలగాలకు చుక్కలు చూపిస్తున్న ‘లోరా’ ఆయుధం!

సిమ్ లేదు.. టవర్ అక్కర్లేదు.. భద్రతా బలగాలకు చుక్కలు చూపిస్తున్న ‘లోరా’ ఆయుధం!
Advertisement

LoRa Network: జమ్మూకాశ్మీర్ అడవుల్లో టెర్రరిస్టుల్ని ఏరిపారేస్తున్న భద్రతా బలగాలకు కొత్త తలనొప్పి మొదలైంది. సైన్యానికి దొరక్కుండా ఉండేందుకు ఓ సరికొత్త ఘోస్ట్ నెట్వర్క్‌ను ఉపయోగిస్తున్నారు ఉగ్రవాదులు. లోరా అనే ఈ ఆయుధం లాంగ్ రేంజ్‌లో లో పవర్‌తో పనిచేస్తుంది. ఈ నెట్వర్క్‌కు సిమ్ కార్డ్ అవసరం లేదు. అసలు మొబైల్ టవర్, వైఫై లాంటివి అక్కర్లేదు. అందుకే దీన్ని గుర్తించడం భద్రతా బలగాలకు అసాధ్యం అవుతోంది.

లోరా అల్ట్రా డివైజ్..

ఇటీవల బడ్గాం జిల్లాలో లష్కరే తోయిబా చీఫ్ ఆపరేషనల్ కమాండర్ హసీమ్ మూసాను సైన్యం మట్టుబెట్టింది. తన మృతదేహం దగ్గర ఓ ఎలక్ట్రానిక్ డివైజ్ దొరికింది. ఫస్ట్ అది స్మార్ట్‌ఫోన్ అనుకున్నారు. కానీ తర్వాత పరీక్షల్లో అది లోరా అల్ట్రా డివైజ్ అని తేలింది. ఇది ఎన్‌క్రిప్ట్ చేసిన వైర్‌లెస్ కమ్యూనికేషన్ డివైజ్ అని భద్రతాధికారులు ప్రకటించారు. ఈ డివైజ్ ఏకంగా సెల్ టవర్‌లా పనిచేస్తుంది. దీనికి సిమ్ కార్డ్‌ పనిలేదు. అసలు రీచార్జే అవసరం లేదు. వీటితో 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి కూడా మెసేజ్‌లు, జీపీఎస్ లొకేషన్లు, ఎమర్జన్సీ అలర్ట్‌లు పంపించొచ్చు.

మన దేశంలో..

Advertisement

రేడియో సిగ్నల్స్‌పై ఆధారపడే ఈ డివైజ్‌లతో టెర్రరిస్టులు ప్రైవేట్ టెలికామ్ నెట్వర్క్‌నే ఏర్పాటు చేసుకున్నారు. దాంతో సాధారణ ట్రాకింగ్ సిస్టమ్‌కు ఇవి దొరకట్లేదు. లోరా డివైజ్‌లను మన దేశంలో అసెంబ్లింగ్ చేయలేదని తేలింది. పాకిస్తాన్ నుంచి వీటిని మనదేశంలోకి పంపినట్టు అనుమానిస్తున్నారు. దీనికి చైనా నుంచి టెక్నాలజీ సాయం అంది ఉంటుంది అంటున్నారు.

Also read: హైదరాబాద్‌లో దారుణం.. వృద్ధుడే లక్ష్యంగా హనీట్రాప్.. రూ.38 లక్షలు కాజేసిన కేటుగాడు!

Tags

Related News

తమిళ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు.. శివకార్తికేయన్ సమావేశం వెనుక వ్యూహం ఇదేనా?

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఆ భూముల కేసులో జోక్యానికి నో!

విమాన ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న చార్జీలు!

పండుగ సీజన్‌లో గోల్డ్ షాపింగ్ చేస్తున్నారా.. భారీగా పెరిగిన ధరలు, GST లెక్కలివే!

మీ పిల్లలతో వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా.. చరిత్ర కలిగిన ఈ పార్క్ చూసేయండి!

అసలు మొదట్లో ఇన్‌స్టాగ్రామ్ ఎందుకోసం వాడేవారో మీకు తెలుసా..?

పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో పొలిటికల్ హీట్.. చైర్మన్ అభ్యర్థుల లిస్ట్ ఇదే?

Big Stories

Advertisement
×