Champions Trophy 2025: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్ట్ ల సిరీస్ లో భారత జట్టు దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాబోయే సిరీస్ లపై ఫోకస్ పెట్టింది టీమిండియా. ఈ నెల చివర్లో సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్, ఆ తరువాత వచ్చే నెలలో ఛాంపియన్ ట్రోఫీ 2025 కోసం బరిలోకి దిగనుంది. వచ్చే నెల ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ హైబ్రిడ్ మోడల్ లో జరగనున్న విషయం తెలిసిందే.
Also Read: Dhanashree Verma: పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాడు.. ధనశ్రీ ఫోటోలు వైరల్ ?
కేవలం టీమిండియా ఆడే మ్యాచ్ లు మాత్రమే దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఐసీసీ డెడ్ లైన్ ప్రకారం ఛాంపియన్ ట్రోఫీ బరిలోకి దిగే జట్లను ఈ నెల 12వ తేదీలోపు ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత సెలక్టర్లు భారత జట్టు ఎంపికపై ఫోకస్ చేశారు. ముందు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసి.. ఆ తరువాత మార్పులు చేయనున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి వల్ల సెలెక్టర్లపై కూడా విమర్శలు వెళ్లివెత్తిన సందర్భంగా ఈసారి జట్టును ఆచితూచి ఎంపిక చేయనున్నారు.
50 ఓవర్ల క్రికెట్ ఫార్మాట్ లో జరగనున్న ఈ మెగా ఈవెంట్ లో భారత జట్టు రన్నరప్ హోదాలో బరిలోకి దిగనుంది. ఈ మెగా టోర్ని ఫిబ్రవరి 19వ తేదీ నుండి ప్రారంభం అవుతుంది. ఇక భారత జట్టు తన తొలి మ్యాచ్ ని ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్ తో ఆడబోతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్తాన్ తో తలపడుతుంది. ఈ ట్రోఫీకి సంబంధించిన భారత జట్టు ప్రకటన కోసం ముహూర్తం ఖరారు అయినట్లు సమాచారం. జనవరి 11వ తేదీన భారత జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.
అయితే దుబాయ్ లో పిచ్ లు స్పిన్ కి అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ఈసారి జట్టులో స్పిన్నర్లకు అధిక ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. ఇక ఈ టోర్నీలో భారత జట్టుకి రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. కానీ వైస్ కెప్టెన్ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత బౌలింగ్ దళాన్ని నడిపిస్తున్న జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.
తాజాగా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 32 వికెట్లతో ఒంటరి పోరాటం చేసిన బుమ్రాకి ప్రమోషన్ ఇస్తూ.. వన్డే ఫార్మాట్ కి వైస్ కెప్టెన్ గా నియమించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. గతంలో కూడా కొన్ని వన్డే సిరీస్ లకి బుమ్రా వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే ఈ వైస్ కెప్టెన్ రేసులో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ కూడా ఉన్నారట.
Also Read: Sania Mirza: సానియా మీర్జా కొత్త ప్రయాణం..ఇక రచ్చ రచ్చే!
కానీ బీసీసీఐ బుమ్రా వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. కానీ ప్రస్తుతం బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు భారత జట్టు సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో ఐదు టి20 లు, 3 వన్డేల సిరీస్ లు ఆడబోతోంది. ఈ సిరీస్ లకి వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రాకి రెస్ట్ ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. దీంతో అతడు నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీలో వైస్ కెప్టెన్ గా అడుగుపెట్టబోతున్నాడు.