E-Paper
Advertisement

పెళ్లయ్యాక భర్తే అత్తారింటికి వెళ్తే… కడుపుబ్బా నవ్వించే ఈ జెన్ జీ రోమ్ కామ్ మూవీ తెలుగులోనే స్ట్రీమింగ్

పెళ్లయ్యాక భర్తే అత్తారింటికి వెళ్తే… కడుపుబ్బా నవ్వించే ఈ జెన్ జీ రోమ్ కామ్ మూవీ తెలుగులోనే స్ట్రీమింగ్
Advertisement

Pyaar Prema Kalyanam OTT : పెళ్లయ్యాక అమ్మాయి అత్తారింటికి వెళ్లడం మన దగ్గర చాలా సాధారణం. కానీ ఇక్కడ మాత్రం కథ పూర్తిగా రివర్స్. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న హీరో… చివరికి అత్తారింటికి ఇల్లరికం వెళ్లాల్సి వస్తుంది. మొదట్లో భార్యతో కలిసి ఉంటే చాలు అనుకున్న అతనికి, పెళ్లి తర్వాతే అసలు కష్టాలు మొదలవుతాయి. అత్తగారి రూల్స్, భార్య మాట, తన సెల్ఫ్ రెస్పెక్ట్ మధ్య ఇరుక్కుపోయిన అతని జీవితం ఎలా మారిపోయింది ? ప్రేమ కోసం తీసుకున్న నిర్ణయమే చివరికి ఎందుకు భారంగా అనిపించింది ? అదే ఈ Pyaar Prema Kalyanam సినిమా కథ. మరి ఈ జెన్ జీ లవ్ స్టోరీని తెలుగులో ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

హీరో ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. ఎలాంటి హంగామా లేకుండా తనదైన స్టైల్లో జీవితాన్ని గడుపుతుంటాడు. అలాంటి సమయంలో అతనికి ఓ మోడ్రన్, ఇండిపెండెంట్‌గా ఆలోచించే ఐటీ ఉద్యోగినితో పరిచయం ఏర్పడుతుంది. పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ హీరోయిన్ తల్లికి కూతురంటే చాలా ఇష్టం. పెళ్లి తర్వాత ఆమె వేరే ఇంటికి వెళ్లిపోవడం ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. తన కూతురు ఎప్పుడూ తన దగ్గరే ఉండాలనుకుంటుంది. అందుకే పెళ్లికి ఓ షరతు పెడుతుంది. అల్లుడు తమ ఇంట్లోనే ఉండాలని చెబుతుంది.

Advertisement

భార్యపై ఉన్న ప్రేమతో హీరో కూడా ఈ కండిషన్‌కు ఒప్పుకుంటాడు. తన ఇల్లు వదిలి అత్తారింట్లో అడుగుపెడతాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత అతనికి అసలు కష్టం మొదలవుతుంది. ఇంట్లో ప్రతి విషయానికీ అత్తగారి రూల్స్ ఉంటాయి. ఎప్పుడు లేవాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నదానిపై కూడా ఆమెదే ఫైనల్ డెసిషన్. మరోవైపు భార్య తన ఉద్యోగం, కెరీర్‌లో బిజీగా ఉంటుంది. భర్తతో ఏదైనా చిన్న గొడవ వచ్చినా అత్తగారు మధ్యలోకి రావడంతో సమస్య మరింత పెద్దదవుతుంది. హీరో తన మాటకు కూడా ఇంట్లో విలువ ఉండాలని కోరుకుంటాడు. కానీ ఏం మాట్లాడినా చివరికి తానే ఇబ్బందుల్లో పడుతుంటాడు.

మొదట ఇవన్నీ కామెడీగా కనిపించినా… క్రమంగా హీరోలో అసంతృప్తి పెరుగుతుంది. తాను ప్రేమ కోసం ఇంత త్యాగం చేసినా, భార్య తన భావాలను అర్థం చేసుకోవడం లేదనే బాధ మొదలవుతుంది. భార్య కూడా తల్లి మాటకు, భర్త ప్రేమకు మధ్య నలిగిపోతుంది. మరి చివరికి హీరో తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అత్తారింటిని వదిలి వెళ్లిపోయాడా ? భార్య తన తప్పును గుర్తించి భర్త వైపు నిలబడిందా? అత్తగారి రూల్స్‌కు హీరో ఎలా చెక్ పెట్టాడు ? ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట చివరికి కలిసి ఉన్నారా ? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

Advertisement

Also Read : పుట్టగానే ఆసుపత్రిలోనే బిడ్డను వదిలేసి వెళ్ళే తల్లి… గుండెను బరువెక్కించే ఈ ఎమోషనల్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

తెలుగులోనే అందుబాటులో

తమిళ మూవీ ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’ Netflixలో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది. ప్రేమ, ఫ్యామిలీ కామెడీ, భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలతో పాటు రిలేషన్‌షిప్ ఎమోషన్స్ తో సినిమా సరదాగా సాగిపోతుంది.

Tags

Related News

వీడియో గేమ్‌ లా మనుషుల ప్రాణాలతో ఆడుకునే దేవుడు… క్రేజీ కాన్సెప్ట్… ఇప్పటిదాకా ఇలాంటి సినిమాను చూసి ఉండరు

తేజ సజ్జ ‘ది ట్రేటర్స్’ తెలుగు ట్రైలర్ చూశారా? 20 మంది సెలబ్రిటీలు వీళ్లే!

నడిసముద్రంలో మిస్సింగ్ షిప్… తలుపు తీసి చూస్తే కళ్లు తేలేసే సీక్రెట్స్…’డార్క్’ మేకర్స్ మైండ్-బెండింగ్ మిస్టరీ

7 ఇయర్స్ మిస్సింగ్… పుట్టుకతో గుడ్డిదైన పిల్ల తిరిగొచ్చేసరికి కంటిచూపుతో… మెంటల్ మాస్ సిరీస్ మావా

దట్టమైన అడవిలో విమానం క్రాష్… బతకడానికి అమ్మాయిలు చేసిన పని చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే

ప్రతిరోజూ ఉదయం 3:33 గంటలకే మెలకువ… సీరియల్ కిల్లర్‌కి, ఈ టైమ్‌కి ఉన్న లింక్ ఏంటి ? తెలుగులోనే స్ట్రీమింగ్

బాబోయ్ 23 ఏళ్లకు ఒకసారి వచ్చే దెయ్యం మళ్లీ వచ్చింది… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని సినిమా

డ్రాగన్‌ను కొట్టడానికి కుర్రాడి క్రేజీ జర్నీ… విజువల్స్ పీక్స్ అసలు… ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమా

Big Stories

Advertisement
×